సర్వం శ్రీసాయి

శ్రీ గజనన విజయం

తొమ్మిదవ అధ్యాయం  click here for pdf

గణేశాయనమః. హే సగుణ స్వరూపుడైన రుక్మిణీవరా! హే చంద్రభాగా తీరవిహారా! శ్రీయోగివరద సారంగధరా! పతితపావనా! దయానిధే! పిన్నలు లేకుంటే పెద్దల పెద్దరికం ఎలా తెలుస్తుంది? లోకంలో పతితులూ, పాపులూ వుండబట్టే భగవంతుని స్మరించటం జరుగుతోంది. మేము పతితులము పాపులమూ కాబట్టి హే పావనకర్తా! రుక్మిణీకాంతా! హే ప్రభో! ఇది మరువవద్దు. లోహానికి పరుసవేది స్పర్శ కలగగానే బంగారమౌతుంది. లోహానికి కూడా కొంత విలువ వుంటుంది కదా! లోహమే లేకుంటే పరుసవేది మహిమ ఏమిటి? కాలవల్లోని నీటిని గోదారి తనలో కలుపుకున్నపుడే అది తీర్ధమౌతుంది! హే మాధవా! యీ విషయాలన్నింటినీ విచారించకండి! దాసగణూకి చేయూతనివ్వండి. దీనిని మునిగిపోకుండా కాపాడండి. అట్లే అగుగాక! 'గోవిందబువకలీకర్' హరిదాసు కావటం వలన హరికీర్తన చెయ్యటానికై శేగాంవ్ వచ్చారు. అక్కడొక ప్రాచీన శివాలయం వుంది. దాని మోటే అనే షావుకారు ఉద్దరించాడు. ఈనాటి ధనికులకు గుళ్ళూ గోపురాలంటే గిట్టవు. వారికి మోటర్లూ, క్లబ్బులూ, సైకిళ్ళూ మొదలైన వాటి మీదనే ధ్యాస. కానీ 'మోటే' అనే షావుకారు అలాటివాడు కాదు. ధనికుడైనా వానిలో భక్తిభావం వుండేది. అతడు జీర్ణావస్థలో నున్న శివమందిరాన్ని ఉద్దరించాడు. అందుచేత శివాలయం అనే పేరుకన్నా 'మోటే మందిరం' అనే పేరే ఎక్కువగా ప్రజలకు తెలిసినది, వాడుకలోనున్నది. ఇక ముందు కథ వినండి.

ఆ మోటే మందిరంలో హరిదాసు టాక్ లీకర్ విడిది చేశారు. ఆ మందిరాని కెదురుగా తమ గుఱ్ఱాన్ని కట్టేశారు. ఆ గుఱ్ఱం చాలా చెడ్డ స్వభావం కలది. అది మాటిమాటికి అరిచేది. వచ్చేపోయే వారిని తంతూ వుండేది. కుక్కలాగా కొరకటం, చాలాసార్లు త్రాడు తెంపుకొని అడవిలోకి పారిపోవటం వంటివి చేస్తూవుండేది. అందుచేత యీ గుఱ్ఱంతో అంతా విసిగిపోయారు. టాకలీకర్ జి దాని కోసం ప్రత్యేకంగా ఒక ఇనుపగొలుసు చేయించారు కానీ దాన్ని తీసుకొని రావటం మరిచారు. అందుచేత త్రాటితోనే ఏదోవిధంగా దాన్ని ఒక చెట్టుకు కట్టేశారు. వారు మాత్రం మందిరంలో పడుకున్నారు. అర్ధరాత్రి రెండు గంటలకు నాలుగువైపులా చిమ్మచీకటిగా వుంది. చెట్టుమీది గుడ్ల గూబ అరుస్తోంది. తీతువుపెట్ట'తూ, తూ అంటోంది. గబ్బిలం తన ఆహారం కోసం వెతుకుతోంది. మరో పక్షి చెట్టుమీదుండే కలకలరవం చేస్తోంది. ఎక్కడ చూసినా నిశ్శబ్దంగా వుంది. ఇళ్ళతలుపులన్నీ మూసేసి వున్నాయి. బాటలందెవ్వరూ సంచరించటం లేదు. అలాటి సమయంలో గుఱ్ఱన్ని కట్టేసిన చోటుకి శ్రీగజాననులు తిన్నగా......

వచ్చారు. అల్లరి చిల్లరి వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి ఈశ్వరుని ఆజ్ఞ వలన సాధువులూ, యోగులూ జన్మిస్తారు. రోగం తగ్గటానికే కదా ఔషధ సేవనం? అలానే సాధు పురుషులవలన అల్లరిచేసే వాళ్ళు అల్లర్లు సద్దు మణుగుతాయి.ఆస్తు! ఆ రాత్రి స్వామీజి ఆ గుఱ్ఱం దగ్గరకొచ్చి దాని కాళ్ళమద్యలో మహదానందంగా నిద్రించారు. '(గణే గణాత్ బోతే)' అనే పాటను పాడుతూనే వున్నారు. ఇది దేనికి సంకేతమో ఎవరర్ధం చేసుకోగలరు? దీని అర్థం బహుశా యిలా అనుకోవచ్చు. 'గణే' అంటే లెక్కించటం అని 'గణ' అంటే బ్రహ్మతో భిన్నంకాని జీవాత్మ అని దీనిని చెప్పటానికి గణాంత్ అనే పదం ప్రయోగింపబడిందని చెప్పుకోవచ్చు. 'బోతే' అనే పదం 'బాతేం' అనే పదం యొక్క అపభ్రంశం (మారిన పదం) కావచ్చు 'బాతెం (మాటలు/పదాలు) అనేది మూల పదం కావచ్చు. 'బా' అనే పదం 'మనము' ను సంబోధిస్తుంది. "త" (=తత్) సర్వనామం నామవాచక మూలానికి అర్ధం అవుతుంది. అంటే "ఓ మనసా! జీవుడే బ్రహ్మ" అని నిత్యమూ తెలుసుకో: అదే యిదీను "గణ గణ గణాంత్ బోతెం" అని, "గణ గణ గణాత్ బోతే" అనీను ఈ కీర్తన గురించి శేగాంవ్ లో రెండు భిన్న మతాలున్నాయి. ఇందులో అసలైనదేదీ అని చర్చించటం వలన ప్రయోజనం ఏమీ వుండదు. ప్రస్తుత ప్రసంగమే మనకి ముఖ్యం స్వామి గుఱ్ఱం కాళ్ళమధ్య పడుకునే వున్నారు. "గణీ గణ గణాంత్ బోతే" అనే సంకీర్తన సంతోషంగా పాడుతూనే వున్నాడు. ఆ సంకీర్తనం అనే గొలుసుచేత ఆ గుఱ్ఱం కట్టబడినట్లుగా వుంది! గుఱ్ఱం అలవాటు తెలిసిన గోవింధబువా మధ్య మధ్య లేచి దాన్ని చూస్తుండేవారు; ఒక సారి లేచి చూసేటప్పటికి గుఱ్ఱం చాలా శాంతంగా నిలబడివుంది. అది చూసి సందిగ్ధంలో పడ్డారు. బువాజీ గుఱ్ఱనికేమీ జబ్బు చేయలేదు కదా! అనే ఆలోచన వచ్చింది. ఇలా శాంతంగాను నిశ్శబ్దంగానూ వుండటం దాని స్వభావానికి విరుద్ధమే! ఇందులో ఏదో మర్మం వుంది. అదేదో చూద్దామని గోవిందబువా గుజ్జం దగ్గరకొచ్చారు. ఒక మనిషి గుఱ్ఱం కాళ్ళమధ్యలో పడుకొని వుండటం చూశారు. కొంచెం ముందుకెళ్ళి చూస్తే, కైవల్యాన్ని ప్రసాదించే శ్రీగజానన స్వామియే ఆ వ్యక్తి అని తెలుసుకున్నారు. గుఱ్ఱం శాంతంగా ఎందుకుందో గోవిందబువాకిపుడర్ధమైంది. సమర్ధస్వామి సహవాసం వలన గుఱ్ఱం శాంత ప్రవృత్తి కలదైంది, కస్తూరి సువాసనలు వెదజల్లేచోట చెడు వాసనెలా వస్తుంది? గోవిందబువా స్వామి చరణాలు తాకాడు. వారిలో అష్టభావాలూ పొంగినాయి! నోట స్తవనం చేయటం ప్రారంభించారు. "స్వామీ! మీరు విఘ్నహర్తలని నేడు...

అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నా గుఱ్ఱం చాలా చెడ్డది.అందరూ దాన్ని చూసి భయపడతారు. హే గురుదేవా! దాన్ని సరైన మార్గంలో పెట్టడానికై మీరే విచ్చేశారు. దీని చెడ్డతనం ఎంతని చెప్పను? నడుస్తూ నడుస్తూ ఒక్కసారి గెంతుతుంది. మధ్య మధ్య వెనక కాళ్ళతో తంతూ వుంటుంది. దీనితో అవస్థ పడలేక బజారులో అమ్ముదామనుకున్నాను. కానీ ఎవ్వరూ దీనిని కొనటానికి ముందుకు రాలేదు. పోనీ దీన్ని వూరికే యిచ్చేద్దామనుకున్నాను. ఐనా ఎవ్వరూ తీసుకోవటానికి ముందుకు రాలేదు. చివరికి మీరే దీనిపై దయజూపారు ఇది మంచిదే. మాలాటి హరిదాసులకు అతి సామాన్యమైన గుఱ్ఱమే వుండాలి దగ్గర గొర్రెల్ని పెంచేవాడింట్లో పులినేలా పెంచటం ? కానీయండి. స్వామి దృష్టిపడగానే ఆ గుఱ్ఱం అతి శాంతస్వభావం కలదైంది. మూర్ఖజీవుల్ని ఉద్దరించటానికే కదా స్వామి గజాననుల ఆగమనం? స్వామీజీ గుఱ్ఱం వీపుపైన చేత్తో రాస్తూ "మిత్రమా! చెడు స్వభావాన్ని వదిలేయి. నీవు శంకరునివలె నిలబడినావన్నది మరువవద్దు. ఎద్దు తలవంచి తన యజమాని పనివేలా చేస్తూ వుంటుందో అలానే నీవూ చేయాలి ఎవరిని బాధించవద్దు" అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. తమ కృపాదృష్టితో పశువులో కూడా మార్పు తేగలిగారు స్వామి!

రెండవరోజు తోటలోనున్న స్వామి దర్శనార్ధం తమ గుఱ్ఱాన్నెక్కి వచ్చారు గోవింద బువాజీ. గుఱ్ఱుపు చెడు అలవాట్లన్నిటినీ శేగాంవ్ ప్రజలు ఎరిగినవారికి అది చెడు అలవాట్ల పుట్ట! అందుచేతనే దాన్ని చూసి భయపడేవాళ్లంతా దాన్ని తోటలో చూసినవాళ్ళంతా "గోవిందబువా యీ పీడ యిక్కడికి తెచ్చారెందుకు? ఇక్కడ స్త్రీలూ, పిల్లలూ కూడా వున్నారే! మీ గుఱ్ఱం అందర్ని నానా అవస్థలూ పెడుతుం"దన్నారు. నిన్నటిదాకా మీరు చెప్పిందంతా అక్షరాలా నిజం. కానీ శ్రీ స్వామీజీ కృపాదృష్టి పడటం వలన యిది ఎంతో మంచిదైపోయింది. ఇదిప్పుడు చెడు అలవాట్లన్నిటినీ వదిలిపెట్టేసింది. ఇప్పుడిది నిజంగా ఒక సాధుగోవే అయింది. ఇప్పుడిక భయపడాల్సిన అవుసరంలేదు" అని గోవిందబువా గుఱ్ఱన్ని చింతచెట్టు క్రింద నిలబెట్టారు. కట్టకుండానే అది గంటసేపూ నిలబడేవుంది. పచ్చని ఆకుకూరలెన్నో వున్నాయి అక్కడ. కానీ వాటివైపు అది కన్నెత్తి కూడా చూడలేదు. యోగులశక్తి చాలా గొప్పది. పశువులు కూడా వారి ఆజ్ఞను భంగం చేయవు.కుటీరంలోని స్వామిని గోవిందబువా స్తుతించటం ప్రారంభించాడు.

'అచింత్య జగతికి నీచేసిన కృతులెవ్వరెరుగుదురె మాతా!
జగతినెట్టి ఖలుడైనా నీ కృప సన్మార్గుడె యౌగాత !అవగుణ ఖని నే, చింతామణి నీవన్నది విదితమె కాదా!
జగదుద్ధారక! వరదపాణి నా శిరసు సతముండు గాత!

ఈ విధంగా స్తుతించి శ్రీస్వామి ఆశీస్సులు పొంది తమ గుఱ్ఱాన్నెక్కి టాకలి గ్రామంవైపు వెళ్ళి పోయారు. ఏదో ఒక కోరికను మనసులో వుంచుకొని ప్రతిరోజూ శేగాంవ్ కి వచ్చి పోయేవారు చాలా మంది వుండేవారు. అందులో 'బాలాపూర్' నుండి ఇద్దరు సజ్జనులు ఏదో ఒక కోరిక మనస్సులో వుంచుకొని స్వామి దర్శనార్ధం వచ్చారు. వస్తూవస్తూ మార్గమధ్యంలో 'మరోసారి వచ్చే సమయాన స్వామికి గంజాయి తెద్దాం. స్వామికి గంజాయంటే ప్రేమ అధికం. స్వామికిష్టమైనదాన్ని మనం సమర్పిస్తే వారికి మనపై తప్పక దయ కలుగుతుంది. ఇతరులు మిఠాయిలూ పాలకోవాలూ తెస్తుంటారు. కాని మనం మాత్రం స్వామికోసం 'గాంజా'నే తీసుకొనివద్దాం' అని అనుకొని దీన్ని మరచిపోరాదని ఒకరికొకరు చెప్పుకొని ఒక వస్త్రానికి ముడివేశారు. మరచిపోకుండా వుండటానికి మరోసారి స్వామి దర్శనానికొచ్చారు కానీ 'గంజా' తేవటం మరచారు. స్వామి చరణాలకు తల తాకించగనే జ్ఞాపకానికి వచ్చింది. మళ్ళీ వచ్చేటప్పుడు మరచిపోకుండా రెండింతల 'గంజా' తప్పకుండా తెద్దాం" అని మనసులోనే అనికొని స్వామి దర్శనానంతరం తిరిగి వెళ్ళిపోయారు. తరవాత కూడా అలానే జరిగింది. గాంజా తేవటం మరచిపోయారు. తల దించుకొని స్వామికెదురుగా కూర్చున్నారిద్దరూ. స్వామి వారిని చూపించి భాస్కర్ పాటిల్ "ఈ తమాషా లోకపు రీతిని చూడు మరచిపోరాదని ముళ్ళేసుకొని కూడా అనుకున్న వస్తువును తేకుండా మరచిపోతున్నారు! జాతికి బ్రాహ్మణులైనా తాము అన్నదే చేయలేకపోతున్నారు. బ్రాహ్మణుని నోటివాక్కు ఎప్పుడూ వృథా కాకూడదు మరి! చండాలురు యీ నిజాన్ని ఎరుగరు. బ్రాహ్మణులు తమ నిజధర్మాన్ని వదిలేశారు. అందుచేతనే తమ శ్రేష్ఠత్వాన్ని కోల్పోయారు. వారిద్దరూ మనస్సులోనే మొక్కుకున్నారు. ఒక వస్తువు నిస్తానన్నారు కానీ తీసుకొని రావటం లేదు. దాని వల్ల వీళ్ళ అభీష్టం ఎలా నెరవేరుతుంది? మాటలలో సత్యమూ, చిత్తంలో నిర్మలత్వమూ వుంటేనే ఆ దేవుడెపుడైనా దయతలుస్తాడు!" అన్నారు. బాస్కరునితో పలికిన మాటలు వారిద్దరి మనసుల్నీ.....

తాకాయి. వారు కుతూహలంతో చూడసాగారు. "స్వామి మన మనసులోని మాటని కనిపెట్టారే! వారు నిజంగా అంతర్జానులే జగత్ చక్షవు గజాననులు సూర్యునివంటి తేజస్సు కలవారే! మనం మొక్కుకున్నది వారు తెలుసుకున్నారు. ఇప్పుడు మనం శేగాంవ్ లోకి వెళ్ళి 'గంజా' తీసుకొని వద్దాం!" అని విచారించి లేచి బయటకు పోయారు. ఇంతలో స్వామి "పాచిపులుసుని వేడిచేసినందున ఏమీ వుపయోగంలేదు. నాకు గంజా అక్కరేలేదు. నేనేమీ దాని కోసం తపించటంలేదు. ఇప్పుడు బజారుకు వెళ్ళవద్దు. చెప్పేదీ, చేసేదీ (ఉక్తి మరియు కృతి) రెండూ ఒకే విధంగా వుండాలని గుర్తుంచుకోండి! మీ అభీష్టం నెరవేరిన తరువాతనే, అదీ ఇద్దామనుకుంటేనే గంజా తీసుకొనిరండి) పైవారంలో మీ అభీష్టం నెరవేరుతుంది. దానిని గురించి విచారించకండి. మీ పని ఐతే వరుసగా 5 వారాలు నియమం తప్పకుండా యిక్కడికి వచ్చివెళ్ళండి. ఎందుకంటే ఎవరి కృపచేత కుబేరుడు ధనపతి అయ్యాడో ఆ స్వామి మృడానీపతి, కర్పూరగౌరులు ఐన శ్రీ శంకరులు వేంచేసి వున్నారు. శంకరుని దర్శనం చేసుకొని వెళ్ళండి! గంజా తేవటం మరచిపోవద్దు! పరమార్ధంకోసం సాధకుడు మిథ్యావచనాలు చెయ్యకూడదు మరి!" అన్నారు వారితో. ఈ అమృతవచనాలు వినిన అయిద్దరూ - స్వామికి సాష్టాంగపడ్డారు. శంకరుని దర్శనం చేసుకొని తమ గ్రామమైన బాలాపూర్ కి వెళ్ళిపోయారు. స్వామి చెప్పినట్లుగానే పైవారంలో వారమకున్న కార్యం ఫలించింది. వారు స్వామికి గంజా సమర్పించి వారి మొక్కును తీర్చుకున్నారు.

ఓ శ్రోతలారా! బాలాపూర్ గ్రామానికి చెందినదే మరో కథ వినండి! బాల కృష్ణుడనే ఒక రామదాసభక్తుడు ఆ గ్రామంలో వుండేవాడు. పుతలీబాయి అతని ధర్మపత్ని. ఇద్దరూ భగవద్ఛత్తులే ప్రతి సంవత్సరం సజ్జనగఢ్ కి వెళ్ళి దర్శనం చేసుకునే నియమం వారిది. ప్రతీ పల్నీ ఒకే ఆలోచన కలవారు. పుష్యమాసంలో వారిద్దరూ సజ్జనగడ్ కి వెళ్ళే నియమం పెట్టుకున్నారు. సామానుతో కూడా వెళ్ళటానికి వారొక గుఱ్ఱన్ని కూడా తోడుగా తీసుకెళ్ళేవారు. ఒక చేతికర్రనూ, బొంతనూ 'దాసబోధనూ, మొదలైనవి కూడా తీసుకెళ్ళేవారు. సాధువులకుండే పవిత్ర ఆచరణువున్నా ఆ సాధుత్వానికి గర్వపడేవారు కాదు. పాదయాత్ర చేస్తూ సాయంకాలం కాగానే ఏదో ఒక గ్రామంలో ఆగిపోయి అక్కడ భిక్షాటన చేసి భోజనం చేసేవారు. దొరికింది ముందు శ్రీరాముని కర్పించిన తరువాతనే ఆ ప్రసాదాన్ని స్వీకరించేవారు. పుష్యకృష్ణ పక్షంలో సతీసమేతంగా వారు బాలాపూర్ నుండి బయలుదేరేవారు. బాలకృష్ణబువా చేతిలో చందనపు చిడతలుండేవి.

పుతలీబాయి చేతిలో తాళాలు తీసుకొని వారి ననుసరించేది. పాదయాత్రలో నిరంతరం రఘుపతి నామసంకీర్తనం చేస్తూవుండేవారు. శేగాంవ్,ఖాంగాం, మెహకర్, దేవుల్ గాంరాజా మొదలైన గ్రామాలగుండా ప్రయాణించి జాలనా గ్రామంలోని ఆనందస్వామికి నమస్సు అర్పించుకొని. జాంబగ్రామం చేరేవారు. అక్కడ మూడురోజులుండేవారు. ఈ జాంబగ్రామం శ్రీరామదాసుల జన్మస్థలం ముందు 'దివారా' అనే గ్రామంలోని గోదావరినదికి నమస్కరించి స్నానాదులు ముగించి తిరిగి 'బీడ్' అంబేజోగాయీ గ్రామాలగుండా ప్రయాణంచేసి బాలేశ్వరస్వామి దర్శనార్ధం. ''మోహోరీ' వచ్చేవారు. 'జోమగాం' రామదాసస్వామి ప్రముఖ శిష్యులు కళ్యాణుల నివాసమే! ఆటనుంచి నరసింగపూర్, పండరిపూర్, నాతేపుతే, శింగణాపూర్, వాయీ, సతారా అనే గ్రామాలను దాటుతూ 'సజ్జన్ గడ్' చేరుకునేవారు. నవమి ఉత్సవానికి మాఘబహుళ పాడ్యమికి సజ్జన్ గడ్ చేరుకునేవారు. బాలకృష్ణబువా యథాశక్తి బ్రాహ్మణులకు అన్నదానం చేసేవారు. ఆయన నిజానికి రామదాసభక్తుడే అనిపించేవారు! ఇలాటి రామదాసభక్తుడు ముందుముందు తయారవటం చాలా కష్టం. దాసనవమి ఉత్సవం పూర్తికాగానే వారు వచ్చిన మార్గాన్నే తిరిగి వెళ్ళిపోయేవారు. ఇదే క్రమం ఎన్నేళ్ళనుంచో క్రమం తప్పకుండా వస్తూవుండేది. ఇప్పుడు ఆయన వయస్సు అరవైయేళ్ళు. మాఘబహుళ ద్వాదశినాడు. బాలాపూర్ వెళ్ళటానికి బయలుదేరేవారు. సరే! ఏకాదశి రోజున రామదాసస్వామి సమాధి దగ్గర బాలకృష్ణబువా కూర్చొని వున్నారు. కళ్ళవెంబడి నీళ్ళు కారుతూన్నయి. నోటివెంట ఒక్క మాటకూడా రావటంలేదు. కొన్ని క్షణాలు స్తబ్దుడుగా వుండి చివరికి "హే సమర్థ రామదాన స్వామీ! ఓ గురురాజా! పుణ్యవంతా! నా శరీరం యిక శిథిలమైపోతుంది. ఇక పాదయాత్ర చేయజాలను. ఏదైనావాహనాన్నుప యోగించుకొని వద్దామన్నారాలేను. ఇక్కడికి రావాలనే నియమం యిప్పటివరకూ తప్పలేదు. కానీ యిప్పుడా నియమం భంగమైపోతుంది. పరమార్ధంకోసం శరీరం ఆరోగ్యంగా వుండాలి కదా! అప్పుడే ఏదైనా చేయగలిగేది. హే స్వామీ! మీరే నా తల్లి! కివన్నీ చెప్పకూడదు. మీ కివన్నీ తెలిసినవే!' అని ప్రార్థిస్తూ అక్కడే నిద్రపోయారు. ఉదయాన ఆయన కొక కల వచ్చింది. అందులో రామదాసస్వామి 'ఆరే! నువ్విలా డీలా పడిపోకూడదు. శరీరం దుర్భలమై యిక్కడికి రాలేకపోతే మరేమీ పర్వాలేదు. నీపై నా కృపాకటాక్షాలెప్పుడూ వుంటాయి! నా పుత్సవం నువు బాలాపూర్లోనే జరిపించు. నవమి రోజున నీకు దర్శనమివ్వటానికి నేను

తప్పకుండా వస్తాను. నే చెప్పింది వృధాకాదు. సాధకుడు ఎంత చేయగలడో అంత పరమార్థం కోసం చెయ్యాల్సిందే!" అన్నారు. రామదాసస్వామి కలలో యిచ్చిన ఆదేశానికి బాలకృష్ణబువా ఎంతో సంతోషించాడు. పత్నితో బాలాపూర్ తిరిగి వచ్చేశారు. మరుసటి సంవత్సరం మాఘమాసంలో ఏంజరిగిందో వినండి.

మాఘపద్య పాడ్యమికి బాలకృష్ణబువా శ్రీరామదాసస్వామి ఉత్సవం ప్రారంభించాడు. ఉదయం 'దాసబోధ' పారాయణ, మధ్యాహ్నం బ్రాహ్మణ భోజనం, సాయంత్రం ధూపదీప హారతులు, రాత్రికి హరి సంకీర్తనం మొదలైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 'స్వామి సమర్థులు ఎలా విచ్చేస్తారు?' అనే బాలకృష్ణబువా మనస్సులో మాటిమాటికి ఆలోచన వస్తోంది. గ్రామంలో జరిగే యీ వుత్సవానికి ఆర్ధికంగానూ, శారీరకంగానూ ప్రజలనుంచి సాయం లభించేది. ఈ విధంగా బ్రహ్మాండమైన వుత్సవం బాలావూర్ లో జరుగుతోంది. తొమ్మిదవ రోజున ఆకస్మాత్తుగా అనుకోని సంఘటన ఒకటి జరిగింది. నవమి రోజున శ్రీగజాననులు స్వయంగా అక్కడికి విచ్చేశారు. బాలకృష్ణబువా యింటిలో రామాభిషేకం 'అవుతోంది. శ్రీగజాననులను అక్కడ చూసి అంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. మరి కొందరు యజమానితో 'త్వరగా చేయండి. ఈ దాసనవమి శుభదినాన శ్రీగజాననులు వేంచేశారు!" అన్నారు. 'ఈ శుభదినాన శ్రీస్వామి గజాననులు విచ్చేయటం ఎంతో శుభం! నేడుకదా యోగులు పాదధూళిచేత నా గృహం పావనమైంది! కానీ నేనుసజ్జన్ గడ్ లో వున్న స్వామి రామదాసుల రాకకై ఎదురు చూస్తున్నాను. వారు నవమి రోజున యిక్కడికి తప్పక విచ్చేస్తానని మాటిచ్చారు! సమర్థుల మాట ఎప్పటికీ అసత్యం కాదు. ఇందు నాకేమాత్రం సందేహంలేదు!" అన్నారు బాలకృష్ణబువా. ఇక్కడ శ్రీగజాననులు గుమ్మం గడపలో నిలబడి "జయజయ రఘువీర సమర్ధ" అంటూ శ్లోకం పఠిస్తున్నారు. శ్లోకం ఏమిటంటే శిలయైన ఆహల్యకు శ్రీరాముడు ముక్తి కలిగించాడు. శ్రీరాముని పదములు తాకగానే ఆమె పవిత్రమైంది!" అని. ఈ మధుర వాక్కులు వినగానే బాలకృష్ణబువా తమ చోటునుండి లేచి గుమ్మం దగ్గర కొచ్చారు. చూడగానే శ్రీగజాననుల మూర్తి ఎదుట కనిపించింది ఆజానుబాహు శరీరం ఎదుట నిలిచింది. వంగి నమస్కరించబోయే సమయానికి సమర్థ రామదాసస్వామి సాక్షాత్కరించినట్లయింది. చేతిలో దండమూ, వీపుపైన జటలు, ఫాలభాగమందు గోపచందనంతో తీర్చిదిద్దిన త్రిపుండ్రము లంగోటి ధారణ చేసిన వారి రంగు ఆ సమర్థ రామదాసస్వాముల రూపాన్ని తిలకించిన వారి కన్నులనుండి..

ఆనందాశ్రువులు ప్రవహించసాగాయి. తిరిగి మరుక్షణంలో సమర్థులకు బదులుగా శ్రీగజాననులు కనిపించసాగారు. సమర్థస్వామి కనిపించకపోయేసరికి ఆయన నిరాశుడయ్యేవారు ఆ సమయంలో సమర్థుల దర్శనం అయ్యేది. ఒక సారి సమర్ధులు మరోసారి శ్రీగజాననులు దర్శన మిచ్చేవారు. ఇందులో నిజమేమీటో తెలుసుకోలేక సందిగ్ధావస్థలో పడ్డారు బాలకృష్ణలు వాణి? వారి యీ చీకలావస్థను గ్రహించిన గజాననులు "సమర్ధుల దర్శనం కాకపోయినందున కినుక వహించకు! నేనే నీ సమర్థ రామదాసును! ముందు నా స్థానం సజ్జన్ గడ్! కానీ యిప్పుడు శేగాంవ్ లో వుంటున్నాను. సజ్జన్ గడ్ లో నవమిరోజు నీ దగ్గరకు వస్తానని మాటిచ్చాను కదా? ఇది నీకు గుర్తులేదా? నా వాగ్దానాన్ని పూర్తిచేయటానికి ఇక్కడికొచ్చాను.మనసులోని సంధిగ్దాన్ని వదిలెయ్యి! నేనే రామదాసును! ఆత్మను మరిచి శరీర రూపాన్నే నిజమనుకుంటున్నావు. భగవద్గీతలో ఒక శ్లోకం వుంది: "వాసాంసి జీర్ణాని" అనే శ్లోకాన్ని మననం చేసుకో! భ్రమచేత మతిభ్రష్టుడవకు!" శంకను వీడినన్ను ఆఫీసుణ్ణి చెయ్యి" అంటూ శ్రీ స్వామి బాలకృష్ణబువా చేతిని పట్టుకొని లోపలికి వచ్చారు. ఒక పెద్ద రంగుల వీటమీద ఆసీమలయ్యారు! ఈ వార్త బాలాపూరంతా తెలిసిపోయింది.స్వామీజిని దర్శించటానికి ప్రజలు గుంపులు గుంపులుగా రాసాగారు. స్వామి యింత చెప్పినా బాలకృష్ణ బువాకి యింకా సంయంగానే వుంది. చివరికి ఆ రాత్రి మూడవజాములో మళ్ళీ ఒక కల వచ్చింది. ఆ కలలో సమర్దరామదాసు.అరె పార్హడ ప్రాంతంలోని శ్రీగజాననులు నా అవతారమే! దీన్ని గురించి సంశయం వద్దు. లేకుంటే నీకరిష్టం జరుగుతుంది. నన్నే గజాననులుగా తలచి వారికి పూజచెయ్య!భగవద్గీతలోని "సంశయాత్మ వినశ్యతి అనే శ్లోకాన్ని గుర్తుచేసుకో అన్నారు. సమర్థులు స్వప్నంలో సాక్షాత్కరించటం వలన బాలకృష్ణబువాలోని సంకోచం పటాపంచలైంది. ఎంతో ఆనందపులకితుడయ్యాడు. వెంటనే వెళ్ళి శ్రీగజాననుల చరణాలు స్పృశించాడు. "స్వామీ! మీ లీలలు తెలియటానికి ససమర్దుడను. కానీ స్వప్న దర్శనం వలన నాలోని అనుమానాలన్నీ దూరమయ్యాయి. నా నవమి ఉత్సవం దిగ్విజయంగా ఫలప్రదమైంది అందులో ఏమాత్రం తృటి జరగలేదు. నాబొటి బాలుని మీద మీకు దయ కలగటం వలన నేను కృతార్ధులయ్యాను" అన్నాడు. కొంతసేపయిన తరువాత కొంతకాలం బాలాపూర్ లో విడిది చేయమని" కోరాడు. అప్పుడు స్వామి "ఇప్పుడు నేనిక్కడ ఉండను. కొద్దిరోజుల తరువాత మళ్ళీ వస్తాను" అని సెలవిచ్చారు. భోజనం తరువాత శ్రీగజాననులు శేగాంవ్ కి వెళ్ళిపోయారు. దారిలో వారు వెడుతున్నట్లు ఎవరూ గమనించనే లేదు. వాయువేగంతో శేషాంవ్ చేరారు.

స్వస్తిశ్రీ దాసగణూ ! విరచితమైన యీ శ్రీ గజానన విజయమనే గ్రంథం భావుకులకు సుఖప్రదమగుగాక! అని దాసగణూ కోరిక

॥ శుభం భవతు ||

శ్రీ హరి హరార్పణమస్తు||

ఇది నవమాధ్యాయము సమాప్తము.

యే మనుష్యః మాం ఆశ్రతః!
తాన్ సర్వేస్యః కర్మ వినాశనః