Play when clicked
నా చూపులో నీ చూపు కలిపి
ధ్యానము చేయి.
నిరంతర ఆనందము పొందుతావు 


వివిధ రకములైన సంగీతము వివిధ రకములైన భావావేశములను కల్గించుట మీరు గమనించారా? మనం అందరము 90 శాతము అంతకన్నా ఎక్కువ భాగము శూన్యము (Space) తో తయారు చెయ్యబడినాము. కనుక సంగీతము మన మీద లోతైన ప్రభావము చూపుతుంది. సంత్సంగము లో పాడినపుడు మన భావావేశములకు శుద్ధి కలిగి మన లోపల విశాలమైన భావన కలుగుతుంది. ఎప్పుడు ఆగకుండ గలగల గలా మాట్లాడే మన 'చిన్న మెదడు'నెమ్మదించి, ధ్యానములో లోతైన అనుభవమును పొందగలరు ధ్యానములో గాఢమైన అనుభూతిని పొందుటకు క్రమశిక్షణ మరియు ధ్యానము మీద గౌరవము అన్నది ముఖ్య సూత్రములు అని భావించండి. కనుక మీ ధ్యానమునకు ప్రతి రోజూ కొంత సమయము కేటాయించి గాఢమైన ధ్యానము వలన కలుగు అనుభూతిని ఆస్వాదించండి.