శ్రీ గజనన విజయం - ఏడవ అధ్యాయం

శ్రీ గజనన విజయం-ఏడవ అధ్యాయం click here for pdf

 

శ్రీ గణేశాయ నమః. జయ జయ రాఘవ! రామా! జయ జయ మేమశ్యామా! యోగులకు నిదానమైన దాశరథీ! నీకృపవలననే ఈ భువిని కవులు కూడా అతి బలవంతులై దైత్యరాజైన రావణుని మట్టు బెట్టారు! నీదయ కలిగిన నాడే సకల కార్యాలూ ఫలిస్తాయి. భక్తుడు కోరినది లభిస్తుంది. కూడా! ఓ స్వామీ ! రాజకృపకు పాత్రుడైనవాడు దివాన్ (మంత్రి)కు కూడా ఆదరణీయుడే, వాడెంత నీచుడైనా! నాపై దయ కలుగుతుందా? అని ' అనుకొనే సమయంలో నాదగ్గర భక్తిజ్ఞానాలు లేవు కదా అని సందేహం కలుగుతూంటుంది. హే శ్రీపతీ! నా స్థితి నిజంగా శోచనీయమైనదే! మన స్పెప్పుడూ ఏదో ఆశాపాశంలో చిక్కుకునే వుంటుంది. అట్టి యీ పాతకుణ్ణి మనిషే దగ్గర చేరనీయని సమయంలో దేవుడెట్లా దగ్గర చేరనిస్తాడు? కానీ ఇది భౌతికదృష్టి పరంగానే! కానీ, ఓ దీనబంధూ! శాస్త్ర గ్రంధాల సాక్షిగా ఇలాంటి పాపులనే నీవు దరిజేరుస్తావని వున్నది. పుణ్యాత్ములెలానూ ఉద్దరింప బడుతారు. ఇందులో పెద్ద విశేషమేమీ లేదు. కానీ పాపుల నుద్దరించే వాడిదే గొప్పతనం! ఈ లోకంలో నీకంటే పెద్ద వాడెవరు? (గొప్పవాడెవరు?). అందుచేత నాపాపాల్ని లెక్కించకు. శరణాగతుడైన దాసగణుపై దయజూపి నీ పెద్దరికాన్ని నిలబెట్టుకో మరి!

 

హనుమదాలయంలో ఉత్సవం ప్రజలే జరిపించేవారు. కానీ దానికి గణేశ కులంవాడైన 'ఖండూరావ్ పాటిల్' ముఖ్యడు. ఈ పాటిల్ వంశం చాలా ప్రాచీనమైంది. పొలాలు ఎక్కువగా వుండటం వలన వారి వంశం ధనకనకాలతో సంపన్నమైంది. సాధువులకు సేవచేయటం ముందునుంచే ఆచారంగా వస్తోంది. మరియీ పాటిల్ ముఖ్యుడూ, అధికారి అయితే ఇక అడిగేదేముంది? అతని కిద్దరు కొడుకులు, పెద్దవాడు కడతాజీ, రెండోవాడు కుకాజీ. ఇతడు పండరి పురంలో వున్న విరోబాజీ భక్తుడు. పాటిల్ కుటుంబానికి 'గోమాజీ స్వామి' ద్వారా గురూపదేశం లభించింది. పాటిల్ కడతాజీకి ఆరుగురు పుత్రులు వున్నారు కానీ కుకాజీకి సంతులేదు. కడతాజీ పోయిన తరువాత అతని ఆరుగురు పిల్లల్ని పెంచి పెద్దచేసే భారం కుకాజీ పైన పడింది. కుకాజీ యొక్క సదాచారణ, భక్తి భావన వలన ధనవైభవాలు వృద్దయ్యాయి. అష్టసిద్దులే అతని ఇంటిలో తిష్ఠవేశాయా అనుకోవచ్చు! కుకాజీ పాటిల్ స్వర్గానికి వెళ్ళి పోయిన తరువాత ఇంటిబాధ్యత 'ఖండూ పాటిల్' పై పడింది. ఇతడెవ్వరి మాటావినేవాడు కాదు, కోపిష్టి ఖండూపాటిల్ ఐదుగురు తమ్ములు. గణపతి నారాయణ, మారుతి, హరి, కృష్ణాజీ అనే వారు. ఖండూపాటిల్ కి సంపత్తితో పాటుగా అధికారం కూడా చేతికి వచ్చేసరికి తమ్ములంతా అహంకారులయ్యారు. సోదరులందరికీ 'కసరత్తు' అంటే సరదా! కుస్తీలు, సాముగరిడీలు అంటేనూ, వాటిలో పాల్గొనటం అంటేనూ చాలా సరదా. ఇందులో హరిపాటిల్ అనేవాడు కుస్తీ పట్టటంలో చాలా పేరుగలవాడు. ప్రతి సంవత్సరం ఆంజనేయస్వామి ఉత్సవం జరుగుతుంది. కానీ అందులో పాటిల్ వంశపు జయ జయ ధ్వానాలే వినిపించేవి! పాటిల్ ముందు మరెవ్వరిని గురించి చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు! గర్విష్ఠులైన పాటిల్ కుటుంబం కారణంగానే శేగాంవ్ లో ఎప్పుడూ అల్లర్లు జరుగుతూ వుండేవి! వాని దృష్టిలో అంతా ఒక్కటిగానే వుండేది! పెద్దా చిన్న అంతరం లేదు! పేద సాదా... | బ్రహ్మచారి. గృహస్తూ, సాధు సన్యాసులూ అందర్నీ ఒకే త్రాసులో తూచేవాడు. నోటికొచ్చినట్లు వదరుతూండేవాడు. ఇక పాటిల్ బంధువులుస్వామిన | సతాయించటం మొదలు పెట్టారు. కొందరు ఒరే పిచ్చోడా! ఏమిటిరా నువు తినేది ఛీ' అనేవాళ్ళు. పిచ్చివాణ్ణి చూసిన జనం ఎలా పరిహసిస్తూ ఉంటారో, అలానే పాటిల్ సోదరులు స్వామిని వేళాకోళం చెయ్యటం ప్రారంభించారు. "ఒరేయ్! నాతో కుస్తీ పడతావా? నిన్నంతా మహాయోగి వంటున్నారు. మరి మాకేమీ తెలియటం లేదు! అదేదో కాస్త మాక్కూడా తెలియనీ! లేకుంటే నిన్ను చావగోడతాం. జాగ్రత్త!" అని కొందరు అంటున్నాదంటున్నారు.స్వామి విననట్లే వుండేవారు. ఏమీ అనేవారు కాదుకానీ వాళ్ళను చూసి మందహాసం చేసేవారు. గుడిలో ఇలానే ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూవుండేది! భాస్కర్ పాటిల్ దీనిని సహించలేక పోయారు. స్వామి ఇక మీరిక్కడ వుండరాదు. మనం అకోలా వెళ్ళిపోదాం. ఈ పాటిల్ సోదరులు గర్వపోతులు ఆహంకారులూను. వీళ్ళకి దూరంగా వుండటమే మంచిది. వీరికెవరన్నా భయభక్తులు లేవు సరికదా ఎవరినీ గౌరవించరు. కూడా! సంపదలూ బలధర్పాలూ విళ్ళకు కళ్ళు నెత్తిమీదికి తెప్పించినాయి. బలం, ధనం, అధికారం వీటి మంచి చెడుల తారతమ్య భావాన్ని మరిచి పాయారు అన్నాడు. 'భాస్కర్! కొంచెం ధైర్యంగా వుండు. ఈ పాటిల్ కుటుంబం వాళ్ళు నాకు అత్యంత ప్రియులు సుమా గర్వంచేత వీళ్ళలో వినయ విధేయతలు లోపించినాయి. కానీ వీళ్ళ అంతరాత్మల్లో వెదికితే వీరు నా కుమాళ్ళని తెలుస్తుంది! వీళ్ళు మహాత్ముల ఆపాదకృపాపాత్రులు. కానీ, అధికారం చేతికి రావటం వలన అదే సర్వస్వం అనుకొని ఉద్ధతులై పోయారు. పులిస్వభావ ధర్మాలు గోవు కొస్తాయా? కత్తికి పదునుంటేనే అందం.. నిహలో చల్లదనం వుంటుందా ఎక్కడైనా? కొంత సమయం గడిచిన తరువాత వీళ్ళ గర్వం దిగజారి పోతుంది. వర్షాకాలంలోని మురికినీరు శీతాకాలంలొ తేరుకోవూ'. ఒక రోజు ఒక విచిత్ర సంఘటన జరిగింది. హరిపాటిల్ గుడికొచ్చి స్వామిచెయ్యి పట్టుకొని 'లే! నాతో కుస్తీ పట్టు గణగణ గణాంత బొతే' అనే అర్ధంలేని వ్యర్థ పదాలు వల్లించకు. నువ్వేదో మహిమగల వాడివని అనుకుంటున్నారంతా! అందులోని నిజానిజాలు ఇవాళ తేల్చేస్తాను. కుస్తీ నువు గెల్చినట్లయితే నీకో పెద్ద ఇనామిస్తాను (బహుమతిని) అన్నాడు. హరిపాటిల్ చేసిన సవాలుకి స్వామి వానితో కుస్తీ పట్టడానికి సిద్ధమయ్యారు. ఇద్దరూ యుద్ధసన్నద్ధులయ్యారు. ఇక స్వామి చూపిన చమత్కారమేమిటో వినండి. స్వామి గోదాములో దిగి కూర్చొని నువ్వో గొప్ప పహిల్వానువు కదా! ఏదీ ముందు నా చెయ్యి పట్టుకొని లేవు. మనిద్దరం కుస్తీ పడదాం" అన్నారు. అది విన్న హరిపాటిల్ ఇదెంతపని? అనుకొని వారి చేతిని పట్టుకొని లేపటానికి ప్రయత్నించాడు. కాని విఫలుడే అయ్యాడు. స్వామిని రవంతకూడ కదల్చలేక పోయాడు సరికదా వాడి వంటినిండా ముచ్చెమటలు పోశాయి! తన శక్తినంతా కూడగట్టుకొని ప్రయత్నించాడు. కాని స్వామి ఒక పెద్ద పర్వతంలాగా వుండిపోయి ఏమాత్రం కదల్లేదు!

అబ్బ! యీయన ఎంత శక్తిశాలి? కదల్లేని పర్వతం కూడా యీయన ముందు ఎందుకూ పనికిరాదు సుమా! ఈయన సన్నగా కన్పిస్తున్నాడు కానీ ఏనుగంత బలం వుంది! ఇంత శక్తివుండీ మేం చేస్తున్న పరిహాసాలన్నీ సహిస్తూ వచ్చారు! వీరిది గజబలం కాబట్టే మనలాంటి నక్కల వైపు కన్నెత్తయిన చూడలేదు! నక్క వాళ్ళు ఏనుగులు వింటాయా? కుక్కల అరుపులకు పులులు బెదురుతాయా! అనుకున్నాడు. కాని హరిపాటిల్ ఆపదలో పడ్డాడు. అతడింత వరకు ఎవరికీ తలవంచలేదు! పరాజితుడై నందువల్ల స్వామికి తల వంచాలి! కాళ్ళూ పట్టుకోవలసిన పరిస్థితి కలిగింది! స్వామి 'నువు నాకు బహుమతినైనా ఇవ్వు! లేదా కుస్తీలో ఓడించు' అన్నాడు. కుస్తీ పట్టడం మగవాళ్ళ ఆటే అన్ని ఆటల్లోనూ పెద్దదంటారు బలరామ శ్రీకృష్ణులు కూడా చిన్నతనంలో కుస్తీపట్టేవాళ్ళట!, ముష్టికుడు చాణూరుడు అనేవాళ్ళు కంసుడి అంగరక్షకులు! వాళ్ళు తమ మల్లయుద్ధ ప్రావీణ్యంతోనే పరమాత్ముణ్ణి ఎదుర్కొన్నారు. మొదట శారీంకబలం, రెండవది? కుటుంబం అయిన తర్వాతే ధనమానాల విషయం వచ్చేది! అరే! పాటిల్ యమునాతీరాన నిలాంటి ఒక బలవంతు డుండేవాడు. అతడు గోకులంలోని గోపబాలులందరినీ నశక్తుల్ని చేశాడు. నీవుకూడా అలానే చేయాల్సింది. బీదల శరీరాన్ని దృడం చేయటంలో నువు సాయపడాలి లేకుంటే యీ 'పాటిల్' బిరుదును వదలివేయాల్సి వుంటుంది! ఇదే నే కోరే బహుమతి! అని అంటూ....

 

స్వామి పాటిల్ గర్వాన్ని అణిచి పారేశారు. అప్పుడు హరిపాటిల్ అతివినమ్రుడై నా పై మీదయ వుంటే శేగాంవ్ లోని పిల్లలంతా తప్పకుండా బలవంతులౌతారు" అన్నాడు. హరిపాటిల్ చాలా చతురుడు ఇలాంటిది బడిలోకెడితే వచ్చేది కాదు. అది స్వయంసిద్ధమే! ఈ సంఘటనతో స్వామి మహిమను తెలుసుకొన్న హరిపాటిల్ ఇక వారినాటపట్టించటం మానేశాడు. హరిలో వచ్చిన యీ మార్పు వాళ్ళ బంధవులకు నచ్చలేదు. అతణ్ణి తిడుతూ నీవు ఆ పిచ్చివానికి భయపడుతున్నా వేమిటి? మాకేమీ అర్ధంకావటం లేదు. అరే! నువు గ్రామాధికారిని జనమంతా మనకు ప్రణమిల్లాలి. తెలుసా! కాని యిప్పుడు దానికి విరుద్ధంగా జరుగుతోంది. నువు ఆ దిగంబరుని పాదాలు పట్టసాగావు ఇదేమీ బాగాలేదు. ఆ వెర్రివాడు గొణుగుడింకా ఎక్కువైంది. మామూలు జనం తెలుసుకునే విధంగా వాడిలోని (మోసాన్ని) కవటాన్ని బయట పెట్టాలి. మనం అలా చేయలేక పోతే జనం అంతా వాడికి వశమైపోతారు! అప్పుడు గ్రామాధికారి తన కర్తవ్యాన్ని నిర్వర్తించ లేక పోయాడనే మచ్చ మన కొస్తుంది. మోసగాళ్ళు కపట సాధువులుగా తయారై జనాన్ని తమవైపు త్రిప్పుకుంటారు. స్త్రీలని మోసంచేసి తమ అభీష్టాలని సునాయాసం చేసుకుంటారు. బంగారం అసలైందో నకిలీదో పరిక్షిస్తే తెలుస్తుంది!

 

 చెరకుగడలతో తుకారాంని చావకొట్టినప్పుడే కదా ఆయన శాంతస్వభావం ఏమిటో తెలియవచ్చింది! గేదె నోటినుండి వేదాన్ని పలికించినప్పుడే కదా జ్ఞానేశ్వరులు అసలైన సాధువులని విద్వాంసులు తెలుసుకున్నారు! పరీక్ష చేయకుండా ఎవరినీ చాలా పెద్దవారని (మహాత్ములని) నమ్మకూడదు. అని అన్నదమ్ములంతా కలిసి యీ స్వామిని నేడు ఎందుకు పరీక్షించకూడదు? అనుకొని, నిశ్చయించుకొని, చెరకుగడల కట్టను తీసుకొని గుడికి వెళ్ళారు. హరిపాటిల్ కిమ్మనలేదు సరికదా! జరిగే తమాషా అంతా చూస్తూ వుండి పోయాడు. పాటిల్ బంధువులు స్వామిని "అరే! పిచ్చివాడా!" చెరకుగడ తినాలని వుందా? ఐతే మాటొక షరతు. మేము ఈ గడలతో నిన్ను వీపుమీద కొడతాం. కానీ నీ శరీరం మీద దెబ్బ తగిలినట్టు ఒక్క గుర్తుకూడా కనపడకపోతే నిన్ను నిజమైన మహాయోగిగా గుర్తిస్తాం. ఇది నీకిష్టమేనా?” అన్నారు. వాళ్ళ షరతు వినికూడా స్వామి మారుపలుకలేదు. మౌనంగా కూర్చొని వున్నారు. పిల్లల కోతిచేష్టల్ని ఎవరు పట్టించుకుంటారు? ఇది గమనించిన మారుతి కొడతారని భయపడ్డట్టుగా వున్నాడు అన్నాడు. తరువాత గణపతి 'మౌనం అంగీకారం' కాబట్టి ఇంక ఆలస్యం ఎందుకు? అని అనటమే తడవుగా అంతా చెరకుగడలు తీసుకొని.....

 

స్వామిపై ఒకేసారి పడ్డారు. అక్కడున్న సజ్జనులంతా కిమ్మనకుండా పారిపోయారు. భాస్కరపాటిల్ ఒక్కడే అక్కడున్నారు. స్వామిని చెరకుగడలతో కొట్టకండి. ఇది మీరు చేయవలసిన పనికాదు. మీరంతా సదాచార సంపన్నమైన పాటిల్' వంశంలో పుట్టినవారు. మీ అంతఃకరణలు దయతో నిండి వుండాలి స్వామిని గొప్ప వానిగా మీరు నమ్మకపోయినట్లయితే హీనుడో, ధీనుతో అని విడిచి పెట్టేయండి! అదే మంచిది. శూరులు, వీరులూ పులులతో పోరాడుతారు కానీ క్షుద్ర జంతువులతో కాదు. మహా బలుడైన మారుతి రావణుని లంకను కాల్చాడు కానీ పేదల గుడిసెల్ని కాదుకదా! ఇది వినిన పిల్లలు మీరు చెప్పిందంతా విన్నాం. కానీ గ్రామంలోని వాళ్ళంతా వీణ్ణి మహాయోగీశ్వరుడని నమ్ముతున్నారు. మేము యీ రోజు వీణ్ణి పరీక్షించే వదులుతాము. పరీక్షించే అసలు బంగారాన్ని బయట పెడతాము. అందుచేత మధ్యలో వచ్చి మాపని కడ్డం తగలకు ఏమౌతుందో మాట్లాడకుండా చూడు" అని చెరకు గడలతో స్వామిని చితకామతకా బాదసాగారు. రైతు కళ్ళం పూడ్చేటప్పుడు ధాన్యపుకంకుల్ని ఎలా కొడ్తాడో అలా కొట్ల సాగారు. పిల్లల యీ కోతి చేష్టను చూసిన స్వామి నవ్వుతూ కూర్చున్నారు ఏమాత్రమూ కదల్లేదు. మెదలేదు! చివరికి ఆ పాటిల్ బంధువులు ఇంత కొట్టినా ఏమాత్రమూ ఆదరూ బెదరూ లేని స్వామి సహనశక్తిని చూసి ఆశ్చర్యపడి కొట్టటం ఆపేసి నోరు తెరుచుకొని చూస్తూ వుండిపోయారు. తరువాత వారి శరీరం మీద దెబ్బతగిలిన గుర్తు ఒక్కటికూడా కనిపించకపోవటం గమనించారు. ఇది చూసి వాళ్లంతా భయపడి సిగ్గుపడి స్వామి దగ్గర పడిపోయారు. వాళ్లంతా స్వామి నిజంగానే మహాయోగీశ్వరులని తెలుసుకున్నారు. పిల్లల యీ స్థితి చూసి స్వామి "మీరంతా నన్ను కొట్టటం వల్ల చాలా అలసిపోయివుంటారు. రండి, మీ అలసట తీర్చటానికి చెఱకురసం త్రాగిస్తారండి. నాదగ్గర కూర్చోండి! అని అక్కడున్న చెరకుగడ అన్నింటిని కలిపి వంచి మెలిబెట్టి, ఏ యంత్రసాయమూ లేకుండా చెరకురసం తీసి వాళ్ళకు త్రాగటానికిచ్చారు. వారు చేసిన యీ అలౌకిక కార్యాన్ని చూసి పాటిల్ బంధువులు ఆశ్చర్యంలో మునకేశారు. స్వామి మీదున్న అపనమ్మకం పోయింది. అంతా ఆనందించారు. యోగశక్తి యొక్క యీ ప్రభావం శంకాస్పదం ఏమాత్రం కాదు. యోగప్రభావం చేత యోగికి లభించే శక్తి అక్షయంగా వుంటుంది. పౌష్టిక ఆహార సేవనం వలన శరీరబలం, పెరుగుతుంది కానీ అది స్థాయీరూపంగా వుండజాలదు. కానీ యోగవిద్య యొక్క సామర్ధ్యం స్థాయీభూతమైనది మరి అక్షయమైనది. పిల్లలకూ

 

యీ సత్యసత్వాన్ని బోధించటానికి స్వామి ఇట్టి లీలను చేసివుండవచ్చు. పిల్లలు స్వామికి సాష్టాంగపడి వారివద్దనుండి సెలవు తీసుకున్నారు.

 

ఖండపాటిలో అన్ని విషయాలూ వివరించారు. వారు "అన్నా! నిజంగా శ్రీగజాననులు తిరుగారే ఈశ్వరులు! దీనిని యీనాడు మేము. అనుభవంద్వారా తెలుసుకున్నాము అన్నారు. ఖండూపాటిల్ కూడా తరువాత శ్రీస్వామి దర్శనార్ధం వెళ్ళసాగాడు. కానీ అతని మాటల్లో మార్షవం లేదు. ఖండూపాటిల్ స్వామిని 'గణ్యా "గణా' అనే పేర్లతో పిలిచేవాడు. 'అరే, ఒరే' అనే ఏకవచన ప్రయోగాలు రెండుచోట్ల ప్రయోగింప బడతాయి. ఒకటి అత్యధిక ప్రేమవున్నచోట తల్లీ బిడ్డల మధ్య 'నేను నువ్వు' అనే భాషే వుంటుంది. రెండోది ఎక్కడ ప్రయోగింపబడుతుందో వినండి వయోవృద్ధులై నపుడు, లేక ధనంచేత గానీ, అధికారంచేతగానీ పెద్దలైనవారు తమ నౌకర్లనీ, ధీనుల్ని, హీనుల్నీ 'అరే, ఒరే' అనటం కద్దు. ఈ పాటిల్ గ్రామాధికారి ఆవటంచేత అందరికీ ఏకవచన ప్రయోగమే చేసేవాడు. స్వామీజీని కూడా అతడు 'గణ్యా' అనే పేరుతోనే పిలిచేవాడు. అలవాటు చొప్పున అలా ప్రవర్తించేవాడు కానీ మరోభావంతో కాదు! అతడు 'గణ్యా, గణా' అనే పిలిచినా ఆస్వామియందు మనస్సులో ఎంతో ఆదరాభిమానాలు కలవాడు. కొబ్బరి కాయకు పైపెంకు ఎంతో కఠినంగా వున్నా లోపలమాత్రం ఎంతో మధురంగా వుంటుంది కదా! ఇలా మనసులో మంచి భావంపున్నా పైకి మాత్రం కఠినంగా వున్నట్లు కన్పించటం అతని అలవాటు వల్లనే. అందుకే అతని నోటివెంట అలాటి మాటలు వచ్చేవి! పినతండ్రి వృద్ధులైన కారణంగా ఖండూపాటిల్ ఆపని అంతా చూస్తూవుండేవాడు. పినతండ్రి నువ్వు రోజూ స్వామి దర్శనానికి వెళ్తున్నావు కదా! ఆయన మహాయోగి అని నువ్వు నమ్మావు కదా! ఐనా ఆయన్నేమీ కోరలేదేమి? నీకు సంతానం లేదుకదా! నేనా ముసలివాణ్ణయ్యాను నాకు ఒక మనుమడు కావాలి. అని ఎందుకు అడగవు! కాబట్టి యీ రోజు సమర్ధ గజాననులను ఒక పుత్రుణ్ణమ్మని వినమ్రుడవై కోరుకో! నిజానికి ఆయన అసలైన సాధువైతే నీకోరికా. నా కోరిక కూడా తీరుతాయి! సాధువులు. మహాత్ములగు వారు తలుచుకుంటే యిదేమీ అంత పెద్దపనికాదు! అసంభవమైనదికాదు! నీ అదృష్టం వల్ల సాధుసాంగత్యం లభించింది. కాబట్టి దానివల్ల లాభాన్ని పొందు! అన్నాడు. ఖండూ పాటిల్ కూడా మనస్సులో ఆలోచించుకోగా నిజమేననిపించింది. ఒక రోజు మారుతి మందిరానికి వెళ్ళినపుడు యీ మాటే అన్నాడు. ఖండూపాటిల్ తన అలవాటు ప్రకారం 'అరే గణ్యా! నా పిన తండ్రి

 

ముసలివాడౌతున్నాడు. మనుమన్న చూడాలని ముచ్చట పడుతున్నాడు. అంతా నిన్ను సాధువు అంటారు కదా నీదర్శనం వల్లనే మనసులోని కోరిక తీరుతుందని ప్రజల విశ్వాసం! దానికి నిదర్శనం ఇప్పుడు చూపించు! నా శిరస్సు నీ చరణాలపై వున్నపుడు నేను అపుత్రుణ్ణెట్లా కాగలను?" అన్నాడు. ఖండపాటిల్ మాటలు విన్న స్వామి నువ్వు నన్ను యాచించటం మంచిదే అయింది! అధికారం, ధనంతో పాటుగా నీవు ప్రయత్న వాదివి కూడా అయినపుడు నీకోరిక తీర్చమని నన్నెందుకు ప్రార్ధిస్తున్నావు? ధనం సంపదల ముందు మిగతావి ఏవీ పనికిరానివని నీ వాదం కదా! ధనబలాన్నే నువ్వు సర్వస్వం అని నమ్ముతావు కదా! మరి అలాంటప్పుడు ఆధనబలంతో నీ కోరిక ఎందుకు తీరదు? అరె! నీదగ్గర పొలాలున్నాయి. వ్యాపారం అపారంగా వుంది! విదర్భ ప్రాంతంలో ఎక్కడైనాసరే నీనోటి మాటకు తిరుగులేదు! ఈ సామర్థ్యంతో భగవంతుని దగ్గర నుండి ఏమీ పొందలేవా? దీనికి గల కారణమేదో నాకు అర్ధంకాకుండా వుంది సుమా!" అన్నారు. దాని మీదట ఖండూపాటిల్ ఇది ప్రయత్నం వల్ల లభించేది కాదన్నాడు. దానికి భగవత్కృప కావాలన్నాడు. లోకంలో నీరున్నట్లయితే ప్రయత్నం చేత, కష్టం చేత పంటలు పండించవచ్చు. కానీ వర్షాలు కురియటం మానవుని చేతిలో లేదు! ఆ కాలంలో నీరు లేకుండా ఏమీ పండించలేము. ఔను. వర్షం కురిసినప్పుడే మానవప్రయత్నం సఫలమౌతుంది. నా ప్రార్ధన విషయంలో కూడా సరిగ్గా యిలాంటిదే ఇందులో మనుష్య ప్రయత్నంతో పాటుగా భగవత్కృపకావాలి! అన్నారు. ఖండూపాటిల్ మనసులోని మాట నెరిగి స్వామీజీ మందహాసం చేసి పుత్రునికోసం నువ్వు నన్ను యాచించావు! యాచించటమంటే ఒకరకమైన బిక్ష అడగటమే కదా! అదియీనాడు అడిగావు. ఏ కొడుకు పుడతాడు. వాడికి 'భిక్కా' అని పేరు పెట్టు! కానీ, పుత్రప్రాప్తి నాచేతిలోనే వుందని మాత్రం అనుకొని కూర్చోకు! నీకోసం నేను భగవంతుణ్ణి ప్రార్ధిస్తాను. భగవంతుడు నా ప్రార్ధనను తప్పక వింటాడు. ఇందులో అసంభవమేమీ లేదు. నీయింటి పరిస్థితి మంచిదే! కాబట్టి మామిడిపండ్ల రసంతో పూరీల భోజనం బ్రాహ్మణులకు వడ్డించు! నీకు తప్పకుండా పుత్రప్రాప్తి కలుగుతుందని నామాట నమ్ము! కానీ, ప్రతి సంవత్సరం బ్రాహ్మణులకు రస పూరీల భోజనం వడ్డించాల్సి వుంటుంది సుమా! అన్నారు. శ్రీస్వామి గుళ్ళో చెప్పిన మాటలన్నీ ఖండూపాటిల్ ఇంటికెళ్ళి చెప్పాడు. పినతండ్రి యీ శుభవార్తవిని ఆనంద భరితుడయ్యాడు. కొద్దిదినాలకు స్వామి అమృతవాక్కులు నిజమయినాయి! గంగాభాయి ఖండూపాటిల్ ధర్మపత్ని. సరిగ్గా

 

నవమాసాలూ నిండినై. పుత్రప్రాప్తి కలిగింది.ఖండూపాటిల్ పినతండ్రి, మర్రి పాటిల్ కుటుంబం వారంతా ఆనందంతో మునిగిపోయారు! ఖండూపాటిల్ యీ సందర్భంగా ఎన్నో దానధర్మాలు చేశాడు. బీదసాదలకు గోధుమలు, బెల్లం మొదలైనవి పంచాడు. గ్రామంలో చిన్న పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టాడు. బ్రహ్మాండంగా నామకరణ మహోత్సవం ముగిసింది. పుత్రుడికి 'బిక్కు అని నామకరణం చేశారు. శుక్ల పక్షచంద్రుడిలా బిక్కూ పెరగసాగాడు. బ్రాహ్మణులకు ఆమ్రరస భోజనం వడ్డించారు. శేగాంవ్ లోని 'పాటిల్ వంశంలో యీనాటికి యీ ఆచారం కొనసాగుతూనే వుంది! ఒక పుణ్యపురుషుని వాక్కు అసత్యమవదుకదా! పుత్రుని బాలలీలల వలన ఇంటి వాతావరణమే మారిపోయింది. ఒక క్రొత్త కాంతి వచ్చింది. ఖండూపాటిల్ యీ విధంగా అభివృద్ధి చెందటం ఆవూరి దేశముఖ్ కి కంటకమైంది. శేగాంవ్ లో రెండుపక్షాలు ఎప్పుడూ వుండేవి. ఒకటి దేశములది. రెండవది పాటిల్ ది. ఇద్దరి అంతఃకరణలూ ద్వేషంతో నిండివుండేవి. ఇద్దరూ ఒకరిపై ఒకరు కత్తులు నూరుతూ వుండేవారు. ఇద్దరిలో ప్రేమాంకానికి తావేలేదు! ఇద్దరిదగ్గరా ఇద్దరిద్దరు మంత్రులు, శాస్త్రులూ! రెండు కుక్కలు ఎదురుపడ్డపుడు ఊరుకోవు కదా! అలానే శేగాంవ్ లో దేశ్ ముఖ్. పాటిళ్లు ఒకరి ముఖాలొకరు చూసుకొనే వారు కాదు. పౌత్రుని చేసిన తరువాత పండరిపురంలోని భీమాతటం వద్ద వినతండ్రి స్వరవాసుడయ్యాడు. పినతండ్రి పోవటం ఖండూకు చాలా దుఃఖం కలిగించింది. ఆయన ఆధారంగానే విధులు సక్రమంగా నిర్వర్తించేవాడు. ఖండూపాటిల్. ఇప్పుడా ఛత్రరాయలేదు .ఖండూ భగవంతునిలో నేనెవరి ఆధారంగా జీవిస్తున్నానో వారిని నానుండెందుకు దూరం చేశావు? అనేవాడు. ఇట్టి పరిస్థితిలో వున్న పాటిల్ వివశత్వాన్ని అదనుగా తీసుకొని అనుచితకార్యానికి పాలుపడ్డాడు దేశముఖ్ దాని గురించి ముందు అధ్యాయంలో వివరిస్తాను, ఒకరిపై నోకరికి వుండే ద్వేషం వినాశానికి దారితీస్తుంది. శ్రీదాసగణూ రచించిన శ్రీగజానన విజయమనే గ్రంథాన్ని కుతర్కమాన సావధానులై వినండి.

 

౹౹శుభం భవతు.౹౹

౹౹శ్రీ హరి హరార్పణ మస్తు౹౹

౹౹ఇది సప్తమాధ్యాయము సమాప్తము౹౹

 

 

యే మనుష్యః మాం ఆశ్రతః!

తాన్ సర్వేస్యః కర్మ వినాశనః