శ్రీ గజానన విజయం
పంతొమ్మిదవ అధ్యాయం

 

శ్రీ గణేశాయ నమః, జయ జయ హే ఆనందకందా! జయ జయ హే! అభేదా! నీ పాదపద్మాలందే నామనసెప్పుడూ అనన్యభక్తిభావంతో వుండుగాక! హే రాఘవా! హే రఘుపతీ! నా అంతం చూడకుండానే శీఘ్రంగా నాపై ప్రసన్నుడవుకమ్ము! నీవు ప్రసన్నుడవటంలో కాలయాపనెందుకు జరుగుతోందో నాకర్ధం కావటంలేదు. నిజంగా పెద్దలైనవారికి యింత కఠోరంగా వుండటం శోభించదుకదా! దీన్ని గురించి ఒక్కసారి మనస్సులో ఆలోచించు! జగదీశ! జగన్నాథా! నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానయ్యా! నన్ను మోసంచేయకు. దాసగణూని కృపజూడవయ్యా! అస్తు! స్వామీజీ శేగాంవ్ లోనే వున్నారు. ఒకనాడు 'కాశీనాథ్ ఖండేరావు గద్దె' అనే ఒక విప్రుడు స్వామిదర్శనార్ధం శేగాంవ్ కి వచ్చాడు.రాగానే అతడు స్వామికి నమస్కరించాడు. స్వామి ప్రసన్నవదనాన్ని చూసి అతడెంతో సంబరపడిపోయాడు. 'నా తండ్రి జీవన్ముక్తులైన సిద్ధయోగుల గుణగుణాలనెలా వర్ణించి వ్రాశారో సాక్షాత్తూ అలానే యీ స్వామి చరణాలను దర్శించటానికి రాగలిగేవాడినా? అని అనుకుంటూ వుండగానే స్వామి తమ మోచేతితో పొడిచి, ప్రేమగా వెళ్ళు! నీ మనోవాంఛితం ఫలిస్తుందిలే! వెంటనే యింటికి వెళ్ళు. టెలిగ్రాం వాడు యింటిగమ్మంలో నిలబడ్డాడు' అన్నారు. స్వామి మాటలు బోధపడలేదు. నాకిక్కడ పనిలేదు. మరి నేనేమీ కోరికతోనూ రాలేదు! మరి యీ టెలిగ్రాంవాడు గుమ్మంలో ఎదురు చూస్తున్నాడనటంలోని అంతర్యమేమిటో? దీని అర్ధమేమిటో అడగటానికి అతనికి ధైర్యం లేకపోయింది. స్వామికి నమస్కరించి వెంటనే ఖాంగాం వెళ్ళిపోయాడు. ఇంటి ఎదురుగా నిజంగానే ఒక టెలిగ్రాం వాడు నిలబడివుండటం కనబడింది. తొందరగా టెలిగ్రాంని చేతిలోకి తీసుకొనే సమయంలో గుండెలు దడ దడలాడ సాగాయి! టెలిగ్రాంలో యిలా వుంది "నువ్వు మోర్నీప్రాంతంలో మునసబుగా నియమించబడ్డావు" అని వుంది. అది చదివి చాలా సంతోషించాడు. శ్రీ స్వామి సంకేతానికి అర్ధం యిప్పుడు బోధపడింది. సిద్ధయోగులు అంతర్ జ్ఞానులనే విషయం అతనికి రుజువైంది. అస్తు! ఒకసారి 'గోపాల్ బూటీజీ' నాగపూర్ రమ్మని స్వామిని ఆహ్వానించాడు. అందువల్ల స్వామి నాగపూర్ వెళ్ళారు. నాగపూర్ పట్టణం మొదట రఘూజీ రాజా భోస్లేకి రాజధాని పట్టణంగా వుండేది. కానీ యిప్పుడు ఆపట్టణస్థితి చాలా పాడైంది. పరతంత్రం కావటంవలన స్వాతంత్ర్యరూపమైన ప్రాణం ఎగిరిపోయింది! దురదృష్టంవలన అసలైన ధనికుడు బిచ్చమెత్తుకోవలసి వచ్చింది. పట్టణంలో అంతా ఇతర దేశవాసులకే ఎక్కువ గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి. ‘యథా రాజా తథా ప్రజా' అన్నట్లుగానే వుంది! గజాలు, అశ్వాలూ, పల్లకీలూ యివన్నీ పోయి యిప్పుడు మోటార్లే తిరుగుతున్నాయి! ఇది కాలగతి మహిమేమరి! ఇందులో ఎవరిపైనన్నా దోషారోపణ చేయటం న్యాయవిరుద్ధమే ఔతుందికదా! సీతాబర్డీలో గోపాల్ భూటీగారి ఇల్లు వుంది. పెద్ద భవంతిలో శ్రీస్వామిని వుంచారు. పులిని కోటలో బందించినట్లుగా స్వామిని శేగాంవ్ వెళ్లనీయకుండా యిక్కడే యీ భవంతిలోనే వుంచేయాలని గోపాల్ బూటీ ఆలోచన. అక్రూరుడు శ్రీకృష్ణుణ్ణి తీసుకొచ్చినట్లుగానే యిక్కడా సరిగ్గా అలానే జరిగింది! స్వామీజీ లేకపోవటం వలన శేగాంవ్ విచారంగా కనిపించసాగింది! శేగాంవ్ నివాసులంతా విచారగ్రస్తులయ్యారు. శేగాంవ్ కి స్వామిజీని ఎలానైనా తీసుకొనిరమ్మని హరిపాటిల్ కి విన్నవించుకున్నారందరూ. శరీరంలో నుంచి ప్రాణం ఎగిరిపోయిన తరువాత నిష్ర్పాణ శరీరాన్నెవరాదరిస్తారు? ఇలానే స్వామి లేని శేగాంవ్ స్మశానంగా కనిపించసాగింది. మీరు గ్రామాధికారులు కాబట్టి దీనికేదైనా ఉపాయం చేయండి. 'బూటీ' చాలా పెద్ద షాహుకారు. అక్కడ మీ మాటెవరు వింటారు? ఒక ఏనుగు మరో ఏనుగుతో ఢీకొంటేనే అందంగా వుంటుంది! అక్కడ మాలాటి హీనులకు విలువ వుండదు. జంబుమాలితో తలపడటానికి హనుమంతుడే సమ ఉజ్జీమరి! కర్ణుని ఎదిరించటానికి అర్జునుడు ఉపాయం చేశాడు. కాబట్టి మిమ్ములను ప్రార్ధించే దేమంటే 'మీరు నాగపూర్ వెళ్ళి స్వామిని యిక్కడికి తీసుకొనిరండి. మనమంతా సుఖంగా వుండొచ్చు!" అన్నారు. బుటీజీ ఇంట్లో స్వామీజీ వున్నారు. కానీ హస్తినాపురంలో వున్నప్పుడు శ్రీకృష్ణుడు ఆనందంగా వుండగలిగాడా? అట్టిదే ఇప్పుడు స్వామీజీ స్థితి కూడా! వారు మాటిమాటికీ 'నన్ను శేగాంవ్ కి వెళ్ళనీ! యీ భవనంలో నన్నుంచకు' అనేవారు. కానీ స్వామి మాటల్ని విననేలేదు. బుటీజీ వారిని నాగపూర్ లోనే వుంచేశాడు. బూటీజీ భక్తి శ్రద్ధలు కలవాడే కాని ధనం, అధికారం వల్ల కలిగిన అహంకారం మితిమీరిపోయింది. ప్రతిరోజూ స్వామి వచ్చిన కారణంగా బ్రాహ్మణ భోజనాలు బ్రహ్మాండంగా జరుగుతూవుండేవి. కానీ శేగాంవ్ వారెవరైనా వస్తే వారిని లోపలికి వెళ్ళనిచ్చేవాడు కాదు. శేగాంవ్ వాళ్ళెవరైనా వస్తే అనుమతిలేనిదే లోపలికి పంపవద్దుఅని గుమ్మందగ్గరున్న 'దర్బాని'కి ఆజ్ఞలు యివ్వబడ్డాయి. అందుచేత శేగాంవ్ ప్రజల ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరైనాయి! - స్వామిని దర్శించకుండానే శేగాంవ్ తిరిగిపోయేవారు! తరువాత హరిపాటిల్ కొంతమంది భక్తులతో స్వామిని శేగాంవ్ కి తీసుకువచ్చే నిమిత్తం. నాగపూరకి బయలుదేరాడు. అతడు రైలుబండి ఎక్కగానే అంతర జ్ఞానులైన స్వామికి యీ విషయం తెలిసింది. అప్పుడు స్వామి గోపాల్ బూటీతో 'అరె! గోపాల్! హరిపాటిల్ నన్ను శేగాంవ్ తీసుకొని వెళ్ళటానికి వస్తున్నాడు. కాబట్టి అతడు ఇక్కడికి చేరటానికి ముందే నన్ను శేగాంవ్ వెళ్ళనీ! లేకుంటే వాతావరణం అంతా అశాంతితో నిండిపోతుంది! ఇక్కడికి వచ్చిన తరువాత తన బలంతో నన్ను ఇక్కడినుంచి తీసుకొని వెడతాడు. నీకున్న ధనశక్తి సమయంలో మాత్రం పనిచేయదు!" అన్నారు. అనుకున్న సమయానికి హరిపాటిల్ బూటీజీ ఇంటికి చేరాడు. దర్బార్ అతణ్ణి ఆపటానికి ప్రయత్నించాడు. వాణ్ణి ఒక్కతోపుతోసి హరిపాటిల్ 'బూటీజీ' సదనంలో ప్రవేశించాడు. గోపాల్ బూటీ ఇంట్లో బ్రాహ్మణ భోజనాలకై అంతా పంక్తుల్లో కూర్చున్నారు. భోజనాలకై చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి. కూర్చుంటానికి ఖరీదైన పీటలు, ప్రతిఒక్కరికి వెండికంచం, వెండికటోరీ (గిన్నె) వ్వబడ్డాయి. రకరకాలైన వంటకాలతో చక్కని ఏర్పాటు చేయబడింది. పంక్తులమధ్యలో శ్రీస్వామిగజాననుల ఆసనం వేయబడివుంది. ఇలా బూటీజీ చాలా గొప్పగా బ్రహ్మాండమైన భోజనాల ఏర్పాటు కావించాడు. ఇది అవర్ణనీయమే! అందుకే 'బూటీజీ'ని నాగపూర్ ప్రాంతానికి కుబేరుడంటారు! హరిపాటిల్ వచ్చాడని తెలియగానే స్వామీజీ తన ఆసనంనుంచి లేచి భవన ద్వారంవైపు పరిగెత్తారు. తన దూడను చూసి గోవు పరిగెత్తినట్లు, హరిపాటిల్ ని చూసి స్వామీజీ అలానే పరిగెత్తారు! వారు అతనితో 'వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం! ఇంక నేనిక్కడ వుండదలచుకోలేదు. నువ్వు నన్ను తీసుకొని వెళ్ళటానికొచ్చి మంచిపనే చేశావు!' అని హరిపాటిల్ తో అని వెళ్ళటానికి ఒక అడుగు ముందుకు వేయబోయారు. గోపాల్ బూటీజీ ఇది అంతా చూశాడు. అతడు స్వామి చరణాలపై పడ్డాడు. వినయంగా "హే! గురురాజా! సమయంలో నన్నవమానించకండి! రెండు ముద్దలు తిని ఆపైన మీయిష్టం వచ్చిన చోటికి తప్పకుండా వెళ్ళండి!" అని పాటిల్ ని కూడా యిక్కడి ప్రసాదాన్ని తీసుకొని తరువాత స్వామీజీని వెంటతీసుకొని వెళ్ళమని కోరాడు. 'ఇంక స్వామి యిక్కడ వుండరని తెలిసింది. కానీ నా గౌరవమర్యాదలు మీచేతిలో వున్నాయి. ప్రసాదం తీసుకోకుండా స్వామీజీ యిక్కడినుంచి వెళ్ళిపోయినట్లైతే మిగతా వారంతా భోజనం వదలి వెళ్ళిపోతారు. నాగపూర్ లో నాకు అవమానం జరుగుతుంది!" అని వేడుకున్నాడు. చివరికి స్వామీజీ, హరిపాటిల్ బూటీజీ ప్రార్ధనని మన్నించారు. భోజనాలయ్యేవరకూ వారక్కడే వున్నారు. శేగాంవ్ వారంతా భోజనాలకు కూర్చున్నారు. భోజనానంతరం స్వామి తన భక్తులతో కలిసి వెడుతున్నారు. స్వామికై 'బూటీ సదనంలో' ఎంతో మంది వచ్చారు. గోపాల్ బూటీజీ పత్ని జానకాబాయి స్వామిపాదాలమీద పడి "హే! గురురాజా నాకోరికను తీర్చండి" అంది. దాని మీదట స్వామి "నీ కోరిక నేను తెలుసుకున్నాను. అని ఆమెకు కుంకుమ తిలకాన్ని దిద్దారు. నీకు మరొక సద్గుణుడైన పుత్రుడు కలుగుతాడు. బాలా! నువ్వు సౌభాగ్యవతిగానే వైకుంఠానికి చేరుకుంటావు!" అని ఆమెను ఆశీర్వదించి సీతాబర్డీ నుంచి బయలు దేరి స్వామి రఘూజీ భోస్లే యింటికి వచ్చారు. రాజా రఘూజీ భోస్లే భక్తితో కూడిన అంతఃకరణ కలిగినవాడు. ఇతడు తన పవిత్ర ఆచరణ చేత రాముణ్ణి తనవైపు త్రిప్పుకున్నాడు. ఇతని అశాశ్వతమైన లౌకిక రాజ్యమైతే పోయింది కానీ సద్గురు భక్తి యొక్క శాశ్వత రాజ్యం మాత్రం యితనింటిలో నిరంతరం వుండేది. రాజు శ్రీ స్వామికి యధోచిత గౌరవ మర్యాదలు చేశారు. దానితో స్వామి ప్రసన్నులై అక్కడి నుండి 'రాంటెక్' వెళ్ళారు. అక్కడ రామదర్శనం చేసుకొని హరిపాటిల్ తో కలిసి స్వామి శేగాంవ్ చేరారు. 'ధార్ కల్యాణ్' నివాసి 'రంగనాథస్వామి' 'ముగలయీ'లో గొప్ప ప్రసిద్ధ సాధువులు వారు శ్రీస్వామిని దర్శించటానికి శేగాంవ్ వచ్చారు. వారిద్దరూ ఆధ్యాత్మిక విషయాలపైన సాంకేతిక భాషలో చర్చించుకోవటం వలన యితరులెవరికీ అర్ధం కాలేదు. శ్రీ వాసుదేవానంద సరస్వతి అనే ఒక కర్మయోగి వున్నారు. ఆయన రావటానికి ముందుగానే స్వామీజీ బాళాభావూతో "అరె! భళా! రేపు నా గురు బంధువు నన్ను చూడటానికి వస్తున్నాడు. వారిని ఉచితరీతిని గౌరవించాలి సుమా! అతడు అత్యంత కర్మనిష్ఠుడు. కాబట్టి అతడు వచ్చే మార్గ మధ్యంలో ఎలాటి గుడ్డ పేలికలూ మొదలైనవి. కనపడకుండా వుండాలి! గుర్తుంచుకో! మన ప్రాంగణాన్ని శుభ్రంగా వుంచు. దారిలో గాని, ప్రాంగణంలో కానీ అతనికి గుడ్డ పేలిక కనపడిందా మండిపడతాడు. అతడు జమదగ్ని రెండవ అవతారమే అనుకో! అతడు కాన్హడా బ్రాహ్మణుడు, శుచిర్భూతుడు, జ్ఞాన సంపన్నుడూ అయినా కర్మనిష్ఠయే అతనికి పైకవచం అనుకో' అన్నారు. ఇలాటి పూర్వ సూచనని బాలాభావూకి ముందే చేశారు స్వామి. రెండవరోజు మొదటి జాముకే స్వామి గురుబంధువు స్వామి వాసుదేవానంద సరస్వతి మఠానికి వచ్చారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని మందహాసం చేశారు. ఇద్దరూ కలియటం వలన అమితానందాన్ని పొందారు, ఒకరు కర్మ నిష్ఠగరిష్టులైతే మరొకరు యోగ యోగేశ్వరులు! ఒకరు అందమైన మల్లెపూవైతే మరొకరు ఆశలు రేకెత్తించే గులాబీ పువ్వు ఒకరు గంగా భగీరథులైతే మరోకరు గోదావరి గౌతమి నది! ఒకరు సాక్షాత్తూ పశుపతియైతే, మరొకరు శేషశాయి నారాయణులే! వామదేవానంద సరస్వతి మఠంలో ప్రవేశించినప్పుడు స్వామిజీ మంచం మీద కూర్చొని చిటికెలు వేస్తున్నారు. స్వామిని ఎదుట చూడగానే పై గజననులు చిటికెలు వేయటం మానేశారు! ఇద్దరూ ఒకరివైపొకరు చూడసాగారు. ఒక్క క్షణం చూసిన తరువాత స్వామీజీ కళ్ళతోనే వెళ్ళిపోవటానికి అనుమతి కోరారు. 'మంచిది' అని శ్రీగజాననులు తల పంకించారు. స్వామి వాసుదేవానంద సరస్వతి వెళ్ళిపోతున్నారు. వారిద్దరి నయన సంకేతాలూ చూసి బాలాభాపు చకితుడైపోయాడు. 'మీ కలయికే చూసి నా మనసులో కొంచెం సంశయం కలుగుతోంది. నా సంశయాన్ని తీర్చండి!' అన్నాడు. మీ ఇద్దరి సాధన మార్గాలూ వేరుగా కనిపిస్తున్నాయి కదా! మరి వారు మీ గురుబంధువెలా? అన్నాడు. అది విని స్వామి అరె! బాలా! నీకొచ్చిన సంశయం సరియైనది ఇది ఎంతో గహనవిషయం అరే! ఈశ్వరుణ్ని చేరటానికి మూడు మార్గాలున్నాయి. మూడూ చివరికి 'జ్ఞాన' సాగరంలోనే కలిసి ఒకటౌతాయి. సామాన్య దృష్టితో చూసేవారికి వాటి రూపాలు వేరువేరుగా కనిపిస్తాయి అందుకే జనం అసమంజసంలో (సందిగ్ధంలో) పడుతూవుంటారు. ధర్మ మార్గంలో అంటు, ముట్టు, సంధ్యా స్నానాలు, వ్రతాలు, అనుష్టానాలూ, ఉపవాసాలూ, మొదలైన వాటికి ప్రాధాన్యం ఎక్కువ వీటిని జాగ్రత్తగా అనుసరించాలి. వీటిని పాటించే సాధకుని 'బ్రహ్మవేత్త' అంటారు. ఇది కర్మ మార్గం. మార్గంలోని విశేషమేమంటే ఇందులో ఏదైనా తగ్గినా లేక అధికమైనా చేతికొచ్చేది ఏమీ వుండదు. కాబట్టి సాధకుడి మార్గంలో అడుగు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వుండాలి! మార్గంలో ఇతరులతో అసభ్య ప్రవర్తన కఠోర వచనాలు ఆడడం వర్ణింపతగినవి.ఇక రెండవది 'భక్తిమార్గం', భక్తిమార్గంలో నడిచేవారికి అతి పవిత్రమైన మనస్సు, పవిత్ర అంతఃకరణా వుండాలి. మనస్సు ఏకొంచెం మలినమైనా యీ మార్గంలో బాధే! చేతికొచ్చేది ఏమీ వుండదు! ఇదే భక్తిమార్గంలో విశేషం! దయ, ప్రేమ తత్పరత (లీనమవటం) ఇవి జీవితంలో పెనవేసుకొని పోయే అంగాలుగా వుండాలి! శ్రవణంలోను (వినటం), పూజనంలోను. పూజచేయటం, అత్యంత భక్తిశ్రద్ధలు కలిగివుండాలి. ఇవన్నీ భక్తి మార్గపు విశేషాలు! సాధకుడైతే యీ అంగాలన్నింటితో భక్తిమార్గాన్ని అవలంబిస్తాడో అతనికి తప్పకుండా శ్రీహరి దర్శనం కలుగుతుంది! భక్తిమార్గం చూడటానికి చాలా సులభంగా కనిపిస్తుంది. దీని సాధన మార్గం

కష్టమేమీకాదు కాని భక్తిమార్గం, కర్మమార్గానికంటే కష్టమైంది! ఆకాశం కంటికి చాలా దగ్గరగా కనిపిస్తుంది. కానీ ఎంతదూరాన వుంటుందది! అలాటినే యీ భక్తిమార్గం కూడా! ఇక మూడవది యోగమార్గం! యీ యోగమార్గం రెండు మార్గాలకంటే భిన్నమైనది. దీని విధి విధానం కూడా చాలా 'పెద్దదే' మార్గంలో బయటి వస్తువులేవీ అక్కరలేదు. అన్ని వస్తువులూ సాధకుని దగ్గరే వుంటాయి. బ్రహ్మాండంలో వున్నదే యీ పిండంలో వుంది! పిండంలో వున్న సాహిత్యంతోనే యోగసాధన చేయబడుతుంది! యోగమార్గానికి ఆసనం, రేచకం, కుంభకం, ఎలా అవుసరమో అలానే ఇడా, పింగళా భేదాలు, దౌతి, ముద్ర, త్రాటక మొదలైన అనేక రకాలైన జ్ఞాన ప్రాప్తి చాలా అవసరం! కుండలినీ శక్తి, సుషుమ్నా నాడి వీటిని గురించి అభ్యాసం చేయవలసి వుంటుంది! సాధకుడు యీ శక్తిని గూర్చి చక్కని పరిచయమున్న వారైతేనే యీ యోగసాధన సాధ్యపడుతుంది! మూడు మార్గాల వలన కలిగే ఫలితం ఒక్కటే అదే జ్ఞాన ప్రాప్తి! కానీ, యీ విషయంలో యీశ్వరుని పైన ప్రగాఢమైన ప్రేమ వుండటం అత్యావశ్యకం ప్రేమలేకుండా చేసిన 'కృతి' నిప్పులమే ఔతుంది. ఎందుకంటే యీ మూడు మార్గాల్లోనూ, ప్రేమ, శ్రద్ధ అత్యంత ఆవశ్యకం అవుతాయి! నలుపూ, ఎరుపూ, పొట్టి, పొడుగూ అనాకారం సుందరం ఇవన్నీ శరీరపు భేదాలు. ఆత్మకు వీటితో ఏమాత్రం సంబంధం లేదు. కానీ అందరిలోని ఆత్మ ఒకేలా వుంటుంది. ఇందులో భేదమేమీ వుండదు. లౌకిక దృష్టిలో శరీరభేదం తప్పకుండా వుంటుంది. కానీ అది పెద్ద విశేషమేమీ కాదు! ఇలానే యీ మూడు: మార్గాలూ మూడూ వేరు వేరు మార్గాలైనా, వాటి ఉద్దేశ్యం, లక్ష్యం ఒక్కటే! అదే జగదాత్మని లేక పరమాత్మని పొందటం! అంటే పరమాత్మ. సాక్షాత్కారమే! అనుకున్న చోటికి చేరినప్పుడు ఇక యీ మార్గాల ఆలోచనే వుండదు. ఎందుకంటే చేరవలిసింది ఒకే చోటుకి కాబట్టి, మార్గాలు భిన్నమైనవే! స్వరూపాలు భిన్నమైనవే! ఇవన్నీ ప్రధానమైనవి కావు! ఎందుకంటే ధ్యేయము, లక్ష్యమూ ఒక్కటే! తాము పయనించే మార్గం గొప్పదనే గర్వం కలుగుతుంది ఒక్కో మార్గంలో నడిచే వారికి కానీ యీ అహంకారాన్ని సాధకుడు విడిచి పెట్టాల్సిందే! అది ఉండకూడదు సాధకునికి లక్ష్యాన్ని చేరనివాడు పంధాభిమానులై (మార్గాభిమానులై) సామాన్యంగా కలహాలు తెస్తూ వుంటారు! 'సాధన' చేసి తమ లక్ష్యాన్ని చేరిన వారిని 'సిద్ధయోగులు' | (సంత్) అంటారు. వారికిక ద్వైతభావం వుండనే వుండదు! కర్మయోగాభ్యాసం ద్వారా తమ లక్షాన్ని చేరిన వారిలో వసిష్ఠులు, నామదేవులు, జమదగ్ని,అగ్ని, పరాశర, శాండిల్యులు ప్రముఖులు ఇక భక్తి మార్గాన్ననుసరించి తమ లక్ష్యాన్ని చేరిన వారిలో మహర్షి వ్యాసులు, నారదుడు, కాయాధూ కుమారుడు, హనుమంతుడు, శబరి, అక్రూరుడు, ఉద్దవుడు, సుధాముడు (కుచేలుడు), పార్ధుడు, విదురుడూ మొదలైనవారు ముఖ్యులు. అదేవిధంగా యోగమార్గాన్ననుసరించిన వారిలో శ్రీశంకరాచార్యులు, మచ్చింద్రనాధులు, గోరఖ్ నాధులు, జలంధరనాధులు మొదలైనవారు. ప్రముఖులు. వసిష్ఠులు పొందిన లాభాన్నే, విదురుడూ, మచ్చింద్రనాధుడూ పొందారు! అక్కడ ఫలంలో భేదమేమీ వుండదు. కేవలం మార్గాలే వేరు! అంతే! అదే పరంపర నేటికీ వస్తున్నది. ఆధునిక కాలంలో కర్మయోగులలో 'గాణగాపుర' నివాసి 'శ్రీపాద వల్లభ', 'ఔదుంబరీ నరసింహా సరస్వతిజీ' లు విఖ్యాతులు, నామదేవుడు, సావతామాలి, జ్ఞానేశ్వరులూ, సేనానాయీ, చోఖామేలా, రామాజీపంత్ భక్తిమార్గంలోని అగ్రగణ్యులు! యోగ మార్గ వాంఛితులలో, 'శ్రీ గొందా ''షేక్ మహహ్మద్', 'జాలన ఆనందస్వామి' అంజన గ్రామం దేవనాద్'లు ప్రముఖులు. అలానే నేడు స్వామి వాసుదేవానంద సరస్వతి కర్మమార్గంలోని శ్రేష్ఠులు. నేను స్వయంగా భక్తిమార్గాన్ని ఎంచుకున్నాను. ఇంకా ఎందరో యీ మార్గంలో సఫలురయ్యారు.'పలుసగ్రామ 'ధోండబూవా' సోనగిరి గ్రామ 'నానాబరవా', 'జాలన' గ్రామపు 'యశ్వంతరావు' మొదలైనవారికి భక్తి మార్గమే వారి లక్ష్యాన్ని సాధింపజేసింది. 'ఖాల్లా అమ్మా', శిర్డీ సాయిబాబా' 'గులాబ్ రావు' మొదలైనవారికి 'జ్ఞానదృష్టి' వుండేది! 'చాందూర్' తహసిల్లో వున్న 'వరఖేడే' గ్రామంలోని 'ఆడ్ క్కూజీ' కూడా యీ మార్గాన్నే అనుసరించారు. 'ముర్హగాం'' లోని యోగేశ్వరులు 'ఖుంగాజీ', నాగపూర్ లోని 'తాజుద్దీన్' భక్తిమార్గాన్నే కోరుకున్నారు! యోగుల ఆచరణ వేరువేరుగా వున్నప్పటికి వీరందరికీ 'కైవల్యప్రాప్తి కలిగింది. సాధనమార్గం ఏది? అనేది అప్రధానం! కానీ, సాధకుడు తన చరమలక్ష్యాన్ని చేరాడా లేదా అనేదే మహత్వపూర్ణమైన విషయం. మేమంతా యీ లోకంలోని శ్రద్ధాభక్తులు కలిగిన జనాన్ని ఉచితమార్గాన నడిపించటానికి వచ్చిన వారమే! ఎవరి కిష్టమైన మార్గాన్ని వారనుసరించి తమ మోక్షాన్ని చరమ లక్ష్యాన్ని సాధిస్తారు. ఇప్పుడు నేను చెప్పినదంతా గుర్తుంచుకో! ఇక ముందు ఏమిటి అని అడగవద్దు! నేనీ 'పిచ్చివాని బురఖా వేసుకున్న దానిని అలానే వుండనీ! శ్రద్ధా నిష్టులు కలవారే వావారు! అట్టి వారికే ఫలితం దక్కుతుంది. మరొకళ్ళ అవసరం నాకులేదు! అనుతాపం (పశ్చాత్తాపం) కలిగిన వాడికే బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించటం యోగ్యం! వ్యర్ధ ప్రలాపాలు చేసేవారికి యీ 'జ్ఞానోపదేశం' వ్యర్ధమే! ఎవరేమన్నా సరే, మనం అహర్నిశలూ భగవద్ సంకీర్తనం చేస్తూ వుండినట్లయితే, నిశ్చయంగా జగద్గురువు, జగదాత్మా అయిన పరమేశ్వరుని దర్శనం లభిస్తుంది' అని ఉపదేశించారు. శ్రీస్వామిజీ వుపదేశామృతాన్ని వినిన బాలాభావు నేత్రాలనుంచి ప్రేమాశ్రువులు ఏకధాటిగా ప్రవహించసాగాయి! వాటిని ఆపేశక్తి అతనిలో లేనే లేకపోయింది. బాళాలాపూలో అష్టభావాలూ కలిగినాయి. (అష్టభావాలు- స్తంభము, స్వేదమూ, రోమాంచమూ, స్వరం భగమూ, వైస్వర్యమూ, కంపమూ, వైవర్ధ్యమూ, అశ్రుపాతము). శరీరం రోమాంచితమైంది. అతని వాక్చాతుర్యం పనికిరాలేదు. అతడు మౌనంగా వుండిపోయి స్వామి గజాననులకు, వర్హడప్రాంతా న్నుద్దరించటానికి అవతరించిన స్వామికి నమస్కరించాడు. కణ్వశాఖకు చెందిన 'సాళూబాయి' అనే పేరుగల ఒక స్త్రీ స్వామి భక్తురాలు! ఆమెతో మఠానికి వచ్చిన వారిలో భోజనం చేయని వారెవరైనా వుంటే వారికి భోజనం వండి వడ్డించటం నీపని' అని అన్నారు స్వామి. ఇదే నీవు చేయవలసిన నిజమైన సేవ, దీని వల్లనే నువ్వు భగవంతునికి ప్రీతికరమైనదాని వవుతావు!" అన్నారు. 'సాళూబాయీ' చివరివరకూ మఠంలోనే వుండిపోయింది. 'ప్రహ్లాదబువాజోషీ' శ్రీ స్వామి కృప కలిగే సమయం వచ్చింది. కాని అతని దౌర్భాగ్యం వలన అతనికి స్వామి కృప లబించలేదు! 'ఖాంగాం' సమీపాన 'జలంచ్' మనే మరో గ్రామం వుంది. అక్కడ తులసీరాం అనే స్వామీజీ భక్తుడొకడున్నాడు. అతని పుత్రుడు 'ఆత్మారాం' గుణఖని, కుశాగ్రబుద్ది అతనికి వేదవిద్య అంటే: ఎంతో యిష్టం! అందుచేత ధర్మపీఠంలో అధ్యయనంతో చేయటానికి కాశీ వెళ్ళాడు. ప్రతిరోజూ భాగీరధిలో స్నానమూ, మధూకరంలో దొరికిన దానితో భోజనం చేయటం, గురువుగారిదగ్గర శాస్త్రాధ్యయనం చేయటం ఇదే ఇతని దినచర్యగా వుండేది. శ్రోతలారా! సామాన్యంగా శాస్త్రాధ్యయనం కోసం విద్యార్థులు యింటినుంచి బయటికి వెడతారు. కానీ అధ్యయనానికి బదులుగా విషయాసక్తులవుతూ వుంటారు. దీని కలవడిన విద్యార్ధి వల్ల అధ్యయనం ఎలా అవుతుంది? మామిడిపండులో పురుగులు పడినప్పుడు అది మధురంగా ఎలా వుంటుంది? 'ఆత్మారాం' ఇలాటి దారి తప్పిన విద్యార్ధి మాత్రం కాదు. ఇతడు వివేకసంపన్నుడూ, సదాచారుడూ అవటం వలన అనుకున్న సమయానికి వేదవిద్యా సంపన్నుడై తన గ్రామానికి తిరిగి వచ్చాడు. తన గ్రామం రాగానే శ్రీ గజాననుల దర్శనానికై శేగాంవ్ వెళ్ళాడు. అతడు వేదవిద్యా పారంగతుడైతే, స్వామీజీ జ్ఞాన సముద్రులు! స్వామి

ఎదుట ఆత్మరాం వెడవిధ్యగానం చేయటం మొదలు పెట్టాడు. అక్కడక్కడా పొరపాట్లు దొరుతూవుంటే, స్వామి వాటిని సరిదిద్ద అతనతో పాటుగా వేదఋచలను పరించేవారు.ఈతని వేదపఠనాన్ని స్వామిజీ, విద్వాంసులూ తమ్మయులై వినేవారు.ఆత్మారాం యొక్క విద్య అక్కడ వినిపించటం వలను సార్దకమే అయింది. వజ్రాల నిపుణుడు లేకుంటే వజ్రాన్ని పరీక్షించ గలిగే దెవరు మరి? ఆత్మారాం అన్నిటిని వదిలేసి మఠంలోనే వుండసాగాడు. మదువున్న చోటుని విడిచి మక్షికం (తేనెటీగ) యితరత్రా కు తిరుగుతుంది. స్వామి సేవలలో ఒక్కటికూడ ఏమరకుండా చేసే ఏకవిస్థా భక్తుడయ్యాడతడు. స్వామి తరువాత, సమాధికి పూజ, అర్చన కలైనవి అతడు నిర్వహిస్తూ చివరివరకూ అక్కడే వుండిపోయాడు. ఏఆశా లేకుండా స్వామి సేవను ఏకనిష్టతో చేశాడు. చివరికి అతని 'ఎస్టేటంతా' మఠానికే సమర్పించాడు? అతనికున్న సంపద కొంచెమే! ఒక యిల్లు కాస్త పొలమూను. ఇక్కడ సంపద విలువ యెంత అని కాదు సమర్పించే భావానికే ప్రాధాన్యం! అదే అమూల్య సంపద, శబరి అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీరామునికి ఎంగిలిపండ్లను మనస్ఫూర్తిగా సమర్పించి ఆయన్ను వశపరచుకుంది కదా! ఆత్మారాముని విషయంలో కూడా సరిగ్గా యిలానే జరిగింది. కాబట్టి ఇక్కడ యీ ప్రసంగ వర్ణన చేయడమైంది! శ్రీ స్వామికి అతడు సర్వస్వం అర్పించిన భక్తాగ్రణి, ఇలానే తమ సర్వస్వం అర్పించిన భక్తులు దత్తాత్రేయ. కేదారుడూ, నారాయణ జాంకర్, మారుతి పట్వారీ అనేవారు కొందరున్నారు. ఇందులోని నారాయణ జాంకర్ కేవలం దుగ్ధాహారి మాత్రమే. అతడు పాలను మాత్రమే త్రాగి జీవించేవాడు. ఇక మారుతీ పట్వారీ యొక్క వృత్తాంతాన్ని వినండి! శ్రోతలారా! మారుతి పొలంపని చేసేవాడు. పొలాన్ని జాగ్రత్తగా చూడటానికి 'తిమాజ్' అనే మాలిజాతి నౌకరు నౌకణ్ణి పెట్టుకున్నాడు. ఒకసారి అతడు పాలంలో మంచి నిద్రపోయాడు. మధ్యాహ్న సమయంలో 'కుమ్హార్' (కుమ్మరి) వి పది పదిహేను గాడిదలు పాలంలోకి చొరబడ్డాయి! నౌకరు నిద్రిస్తూండటం వలన వాటిని అడ్డగించే. వారెవరూ లేరు. అందువల్ల అవి చాలా ఆనందించాయి. అవి పాలంలోకి పోయి అక్కడున్న జొన్నపంటనంతా చక్కగా తినసాగాయి. మారుతి స్వామియొక్క అసలైన భక్తుడు. కాబట్టి స్వామిజీ యీలీలను చూపించారు! వారు క్షణంలో 'మోర్ గాం' వచ్చి 'తిమాజీ' తో 'అరె! తొందరగా లే! పొలంలో గాడిదలు పడ్డాయి!' అని తిమాజీని లేపి పొలంలోనే స్వామి అంతర్ధానమయ్యారు. తిమాజీ లేచి చూసేసరికి పదిపదిహేను గాడిదలు

పోలంలో జొన్నకంకులు తింటూ కనిపించాయి. అదిచూసి మనస్సులో యిలా అనుకున్నాడు "యజమాని కోప్పడతాడు. యీ పంటని రక్షించటానికే కదా నన్ను నౌకరుగా పెట్టుకున్నాడు మరి! అతడు నన్ను విశ్వసించినందుకు నేను యిప్పుడు విశ్వాస ఘాతకుణ్ణయ్యాను! నామీద నమ్మకంతో యజమాని నిశ్చింతగా వుంటే నేనిక్కడ హాయిగా నిద్రపోయాను. గాడిదలు పంటని చాలాభాగం తినేసి పాడుచేశాయి. ఇంక యజమానికి నేనేం చెప్పగలను" అని అనుకుని తిమాజీ దుఃఖించసాగాడు. తిమాజీ పాపం న్యాయంగా వుండే మనిషి ఈనాటి నౌకర్లు లాటివాడు కాదు! నేటి నౌకర్లకు డబ్బుగొడవే కానీ మరొకటి వుండదు. యజమానికి ఎంతనష్టం వచ్చినాసరే వానికేమీ పట్టదు. కానీ తిమాజీ తిన్నయింటి వాసాలు లెక్క పెట్టే వాడు కాదు. జరిగిన దానికి అతడెంతో బాధపడ్డాడు. యజమాని కేమిచెప్పాలో అతనికి అర్ధం కాలేదు. ఏమైనా సరే జరిగినదంతా వివరించి యజమానిని క్షమించమని అడగాలనుకున్నాడు. యజమాని మంచి స్వభావం కలవాడే కాబట్టి బహుశా క్షమించవచ్చు అనుకున్నాడు. మరునాడు తెల్లవారగానే తిమాజీ గ్రామంలోకి వచ్చి యజమాని కాళ్ళమీద పడి 'రాత్రి నాకు నిద్ర పట్టటం వలన పొలంలో గాడిదలు పడి పంటను నాశనం చేశాయి. ఎంత నష్టమో మీరే స్వయంగ వచ్చి చూడండి' అని విన్నవించుకున్నాడు. అది విన్న మారుతి 'ఇప్పుడు నాకు సమయం లేదు, నేను శేగాంవ్ వెడుతున్నాను. స్వామీజీని దర్శించిన తరువాత రేపు వచ్చి చూస్తాను. అని స్వామి దర్శనార్ధమై ఉదయం పదిగంటలకి శేగాంవ్ చేరాడు. సమయాన స్వామి ఆసనంపై కూర్చునివున్నారు. ఎదురుగా జగూపాటిల్, బాళాభావూ కూర్చొని వున్నారు. మారుతి స్వామిజీని దర్శనం చేసుకున్నపుడు 'నీకోసం రాత్రి కష్టపడాల్సి వచ్చింది! నువ్వు నా భక్తుడివి కాబట్టి మెలకువగా ఉండాల్సి వస్తుంది. నువ్వు నౌకరు మీదున్న విశ్వాసంతో హాయిగా నిద్రిస్తావు. కానీ నౌకరు కూడా నిద్రించినపుడు, ఆపొలాన్ని కాపాడటానికి నేను మెలకువగా వుండాల్సి వచ్చింది. గాడిదలు జొన్నపంట తింటున్నపుడు తిమాజీని అక్కడికి వెళ్ళి లేపాల్సివచ్చింది!" అన్నారు స్వామిజీ. అది విన్న మారుతి మీరే మా రక్షకులు! మీరే మాకు ఆధారం. బిడ్డకు ఆధారం తల్లేకదా వీరి మధ్య మరెవరి అధికారమూ ఉండదు. పొలమూ, దానిలోని పంటా వీనికి యజమాని మీరేకదా! లౌకిక దృష్టిలో నౌకరు పెట్టబడుతాడు కానీ, రక్షించేవాడు ఇంకొరుకదా! బ్రహ్మాండాన్ని మీరిక్కడుండే రక్షిస్తూ వుంటారు. బిడ్డకోసం తల్లి మాటిమాటికి వచ్చే బాధల్ని సహించాల్సివస్తుంది. నేను మీ భక్తుణ్ణి అందుచేతనే మీరు 'మోర్ గాం' వెళ్ళి అక్కడి పొలంలోని పంటను కాపాడారు. ఇలానే మీ కృప ఆశీర్వాదాలు మాకెప్పుడూ ప్రసాదించండని ప్రార్దిస్తున్నాను. నేనిప్పుడే వెళ్ళి తిమాజీని (నౌకరి నుంచి) ఉద్యోగంలోంచి తీసేస్తాను. అన్న మారుతి వినయ పూర్వకమైన ఆత్మనివేదనాన్ని విని స్వామి: ఎంతో సంతోషించారు. వెంటనే 'అరే! తిమాజీని ఉద్యోగంలోంచి తీసెయ్యకు దానికి కారణంవుంది. అతడు చాలా విశ్వాసపాత్రుడు గాడిదలు పంటను తినేస్తే అతని కేమీతోచక దుఃఖితుడయ్యాడు. ఇది నేనిప్పుడే తెలుసుకున్నాను. రాత్రి జరిగిందంతా చెప్పటానికి రెండవ రోజు భయపడుతూనే నీ దగ్గరికి వచ్చాడుకదా! అప్పుడు వాడి మాటలు వినకుండా రేపు వస్తానని మాటిచ్చావు. ఔనా! అన్నారు. విధమైన స్వామి పలుకులు విని మారుతి సంగతంతా గ్రహించాడు. సిద్ధయోగుల చేతలు అద్భుతాలని చక్కగా తెలుసుకున్నాడు. గాడిదలు పొలంలోకి వెళ్ళినట్లుగా స్వామి అంతర్ జ్ఞానంవలన తెలుసుకోగలిగారు! శక సంవత్సరం పద్దెనిమిది వందల పదహారులో స్వామిజీ బాలాపూర్ లో వున్నారు. అప్పుడు జరిగిన సంఘటన గురించి ఆలకించండి. బాలాపూర్లో సుఖలాల్ బింసీలాల్ దుకాణంలో నలుగురూ కూర్చుండే చోటు ఒకటుంది. దాని కెదురుగా స్వామి ఆత్మానందంలో మునిగి కూర్చొనివున్నారు. వారు సంపూర్ణ దిగంబరులుగా వున్నారు. శరీరం మీద అచ్చాదన ఏమాత్రం లేదు. ఐనా శ్రద్ధాభక్తులుగల భక్తులు స్వామికి నమస్కరించి ముందుకు సాగిపోతున్నారు. ఆదారి బజారులోని పెద్దదారి అవటం కారణంగా అక్కడ ఎక్కువ రద్దీగా వుంటుంది. ఆధారి వెంట ఒక పోలీసు హవల్దారు వెడుతున్నాడు. అతని పేరు ' నారాయ అసరాజీ' స్వామిని చూడగానే అతడు మండిపడ్డాడు. 'ఆయన్ని నిందిస్తూ' దిగంబర సాధువు కావాలనే యీ వచ్చే పోయే మార్గంలో కూర్చున్నాడు. వీడు సాధువూ కాదు, ఎవరూ కాదు. ఒట్టి మోసగాడు. వీణ్ణి దయతలచటం మంచిదికాదు', అని అంటూ వారిదగ్గరికి వెళ్ళి నానా దుర్భాషలాడసాగాడు. 'అరే! పిచ్చివెదవా! వీధిలో గుడిప్పుకొని తిరగటానికి సిగ్గూ బిడియం. లేదా? నీ పిచ్చివేషానికి బహుమతి! అని తన చేతనున్న కర్రతో వారిని కొట్టసాగాడు. దెబ్బలు వీపుపైన తగిలి గుర్తులు కనిపించ సాగాయి. ఐనా హవల్దార్ కొట్టటం మానలేదు. ఇది చూసి 'హుండీవాలా' అనే ఒక సజ్జనుడు హవల్దార్ ముందుకొచ్చి నిలబడ్డాడు. 'అరె! నారాయణా! సత్పురుషులపైన చెయ్యి చేసుకోవటం మంచిది కాదు. యోగులను తరింపచేసే వాడు స్వయంగా శ్రీహరియే ! తెలుసా? స్వామి వీపుపైన తేలిన దెబ్బలు నీకు కనపడటం లేదా? నీ అమానుష కృత్యంవల్ల నీకు అంత్యకాలం సమీపించినట్లుగా వుంది? ఎందుకంటే చనిపోయే రోగియే, డాక్టరూ, వైద్యులూ చెప్పిన పథ్యం చేయడు. అదే వృత్తినిలో కనిపిస్తోంది. ఇదేమీ మంచిదికాదు. ఐనా దీని నుంచి రక్షింపబడటానికి వుపాయం వుంది చేసిన తప్పును క్షమించమని స్వామిని వేడుకోవటమే! అన్నాడు. ఇది విన్న హవల్దార్ ఇలా అన్నాడు "నన్ను క్షమించమని అడగవలసిన అవసరం నాకేమి వుంది. కాకులు శపిస్తే జంతువులు మరణిస్తాయా? గుడ్డ విప్పుకున్న పిచ్చోడు దారి మధ్యగా కూర్చుని ఏదో వాగుతూ కూచున్నారు. ఇలాటి మోసగాణ్ణి దండించటం పరమాత్ముని దర్బారులో దోషమైతే, ఇంక ఆవలైన న్యాయానికి తావెక్కడ?" అని హేళన చేశాడు. దీని ఫలితాన్ని హవల్దార్ పొందాడు. తరువాత కొద్ది రోజులకే హవల్దార్ మరణించాడని తెలుసుకున్నారందరూ. తరువాత పదిహేను రోజుల్లోనే అతని కుటుంబం అంతా అంతరించింది. సాధువులపై చేయి చేసుకున్న దానికి ఫలితం వెంటనే లభిస్తుంది? ఆకారణంగా ఒక సాధువును బాధిస్తే ఎంతటి భయంకర పరిణామం కలుగుతుందో ప్రజలు తమ కళ్ళతో ప్రత్యక్షంగా చూశారు! కాబట్టి సిద్ధయోగుల ఎదుట మర్యాదగా ప్రవర్తించాలి. 'అహమ్మద్ నగర్ తహసీలులోని ప్రవరానది ఒడ్డున సంగమే నేర్ అనే సుందరమైన ఒక చిన్న గ్రామం వుంది. అది ఎంత అందమైనదో నేను వర్ణించలేను! అనంతఫందీ అనే పేరు గల (సాయర్) కవి యీ గ్రామం వాడే గ్రామంలో 'హరిజాఖడ్యా' అనే పేరుగల వ్యక్తి వృత్తాంతాన్ని ఇక వినండి. 'హరిబాఖడ్యా' యజుర్వేద బ్రాహ్మణుడు. పొట్టకూటి కోసం యితడు తిరగాల్సి వచ్చేది. ఇలా తిరుగుతూ తిరుగుతూ అతడు శ్రీస్వామిజీ దర్శనార్ధంగా వచ్చాడు. దర్శనం చేసుకొని అతడు స్వామి ఎదుట కూర్చున్నాడు. దర్శనం కోసం అక్కడ భక్తులు గుంపులుగా వుండనే వుంటారు. కొందరు బ్రాహ్మణులకు భోజనాలు వడ్డించి తమ మొక్కు తీర్చుకుంటే కొందరు చక్కెర ప్రసాదాన్ని పంచుతారు. ఇదంతా చూసిన 'హరి' మనస్సులో ఇలా అనుకున్నాడు. "ఇంతటి మహాజ్ఞాని చరణ కమలాలను చేరకుండా నేను వట్టిగానే తిరిగి పోవాల్సి వుంటుంది. ఎందుకంటే నా ప్రారబ్ధం చాలా కష్టాలతో నిండివుంది మరి! ఎండిన భూమిలో గింజని పాతితే దాంట్లోమంచి మొక్క ఎలా వస్తుంది? ఇవాళ అన్నం దొరికింది. కానీ రేపు దేవునిదే భారం! అనుకుంటూ నేటివరకు జీవితం దొర్లిపోయింది. నేటి వరకూ నేను ధన సంగ్రహం చేయలేదు. నా దగ్గర పాలం కానీ, లేక ఉదర పోషణార్ధం

 

మరే సాధననైనా వుందా అంటే అదిలేదు. విద్యార్దన చేసి నేను విద్వాంసుణ్ణి కూడా కాలేకపోయాను. ఇలాటి దురవస్థలో తమ కన్యనెలా నాకిస్తారెవరైనా?" అనుకొని తన మనస్సులోనే స్వామిని ప్రార్ధించాడు. "హే! గజాననా! సచ్చిదానంద!దయాఘనా! నా మనస్సులో సంసార సుఖాన్ని పొందటానికి కోరిక తీవ్రమౌతోంది. దాన్ని మీరు ఫలింపచేయండి! నాకు ఒక సుందర స్త్రీ లభించేటట్లూ, పిల్లలు కలిగేటట్లు చేయండి' అనే ' ఆలోచనలు అతని మనసులోకి వస్తూవుండగానే స్వామి వారిమీద ఉమ్మేసి పిచ్చివాడా! జనం నన్ను యీ సంసారం నుంచి తరింపచేయమని కోరతారు. నువ్వు సంసారసుఖాన్నివ్వమంటున్నావా! చూడు, లోకరీతి ఎంత విచిత్రమైందో! అంతా సంసారసుఖాన్నే కోరుకుంటారు. మరి సచ్చిదానందుడైన శ్రీహరిని పంచే కొరిక నెవ్వరూ కోరరు!" అని, ఒకసారి జాకడ్యా కేసి చూసి, 'నీ మనసులో వున్న కోరిక తీరుతుందిలే! నీకు పుత్రులూ, పౌత్రులూ కూడా కలుగుతారు. కొద్దో గొప్ప ధనం కూడా నీ దగ్గర వుంటుంది. ఇక యింటికి వెళ్ళి ఆనందంగా సంసారం చెయ్యి! కానీ భగవంతుణ్ణిప్పుడూ మరువకూడదని గుర్తుంచుకో!" అని వుపదేశించి స్వామి అతనికి వివాహం చేసుకోవటానికి కొంత ధనాన్ని కూడా ప్రసాదరూపంలో యిచ్చారు. 'సంగమ నేర్' లో 'హరిజాకడ్యా' యొక్క సంసారం సుఖపూర్వకంగా వుండేది. విధంగా శ్రీస్వామి 'సిద్దవాణి' నిజమేనని రుజువు చేయబడింది. 'రామచంద్ర నిమోణ్ కర్ అనే సజ్జనుడు 'ఓవర్ సిర్' గా వుండేవాడు. అతనితో వసుదేవ్ బెంద్రే అనే ఒక సర్వేయరు వుండేవాడు.. వారిద్దరూ సహ్యాద్రిపర్వతం యొక్క 'ముకనా' నది దగ్గరకొచ్చారు. 'ముకనా' కాలువ సహ్యాద్రి పర్వతం మీద వుంది. ఇది నాసిక్ జిల్లా 'ఇగత్ పూరీ' తహసిల్లోనికి వస్తుంది. 'ముకనా' నదీ ప్రాంతంలోని వన్యశ్రీ ఎంత రమణీయంగా వుంటుందో ఎంతని, ఎలా వర్ణించటం? హరిణాలు నిర్భయంగా వనంలో పరిగెత్తుతూ వుంటాయి. ఫలభారం వలన వృక్షాలు వంగివున్నాయి. వన్య పక్షిగణాలు కాశంలో ముక్త సంచారం చేస్తున్నాయి. 'మునకా'' కాలువ దగ్గర ఒక చిన్న సెలయేరు వుంది. దానిని 'కపిలధారా ప్రవాహ' మంటారు. ప్రతి పండుగకూ దీన్ని పవిత్ర తీర్ధంగా తలచి, భక్తి శ్రద్ధలున్న వారంతా స్నానాలు చేయటానికి వస్తూవుంటారు. ఇదే విధంగా ఒక పర్వదినాన 'నిమోణ్ కర్' అక్కడికి స్నానం చేయటానికి వెళ్ళాడు. అతడు కొన్ని యౌగిక క్రియలు తెలిసినవాడు. యోగవిద్య పూర్తిగా అవగతం చేసుకోవాలనే కోరిక అతని మనసులో వుండేది అతడు చాలామంది సాధువులూ,  బైరాగులూ, మహాత్ములనూ దీన్ని గురించి అడిగాడు. కానీ అతడికి సరియైన మార్గదర్శనం ఎవ్వరూ యివ్వలేక పోయారు. దానివలన 'నిమోణ్ కర్' హతాశుడయ్యాడు. అతడు మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్ధించసాగాడు. "హే భగవాన్! ఇక నేనేమి చెయ్యను? నాకు యోగాభ్యాసం నేర్పే సద్గురువు ఎక్కడ లభిస్తారు? దయచేసి దీన్ని గురించి చెప్పు" అన్న ప్రార్ధన పూర్తవనే లేదేమో! ఇంతలోనే 'కపిలధార' దగ్గర ఒక వ్యక్తి కూర్చుని వుండటం చూశాడు. వ్యక్తి చేతులు మోకాళ్ళంత పొడుగునా వున్నాయి. (ఆజానుబాహువు) ఆయన శరీరం ఎత్తైనది. వారు శాంతంగా ధ్యానములై కూర్చుని 'వున్నారు. వారిని చూడగానే 'నిమోణ్ కర్' వెళ్లి సాష్టాంగ ప్రణామం చేశాడు. చాలా సమయం గడచిపోయింది. అస్తమయ సమయం కూడా కావచ్చింది. ఐనా యోగిరాజు మౌనంగానే కూర్చుని వున్నారు. 'నిమోణ్ కర్' ఇప్పటి వరకూ ఏమీ తినలేదు. అతడు మకాంచేసిన చోటు అక్కడికి చాలా దూరం కూడా! సాయంకాలం అవటం వల్ల కమండలంతో 'కపిలధార జలాన్ని తీసుకొని వెళ్ళసాగారు. అప్పుడు నిమోణ్ కర్ ముందుకి వెళ్ళి "సమర్థ స్వామీ! నన్నింకెంతవరకూ పరీక్షిస్తారు? మీకు యోగవిద్యాజ్ఞానం వున్నట్లయితే నాకు నేర్పండి!" అని ప్రాధేయపడ్డాను. తరువాత సూర్యాస్తమయ సమయంలో కైవల్యాన్ని ప్రసాదించే స్వామి చిత్ర పటాన్ని తీసుకో! దీనితో నీపని పూర్తి కాగలదు. దీని పైన షోడశాక్షరీ మంత్రం లిఖించబడింది. దీన్ని నిరంతరం జపించు. యీ మంత్ర ప్రభావం వలన నీకు కొద్దిగా యోగవిద్య వస్తుంది. కానీ అన్ని సాధనలలోన యోగసాధన చాలా కష్టమైంది. నత్తగుల్ల హిమాలయాన్ని ఎక్కుగలరా? సముద్రంలో వున్న ముత్యపు చిప్పలో వుండే పురుగు మేరుపర్వతాన్ని దాటగలవా? బ్రహ్మచర్యం పాటిస్తూ, కఠోర పరిశ్రమ చేస్తే ఒక అయిదో పదో ఆనవాలు వేయవచ్చు. ఇంక అనుమానాలు అడగకుండా ఇంటికి వెళ్ళు! ఇది తీసుకో, ప్రసాదం" అని అంటూ ఒక ఎర్రరాతిని తీసి అతనికిచ్చాడు స్వామిజీ. ఎర్రరాతిని అతనికిచ్చి స్వామి అదృశ్యులయ్యారు! వారి తిరిగి నాసిక్ లోని గంగానదీ తటాన కలిశారు. నిమాణ్ కర్ వారిని నాసిక్ చూసినప్పుడు, పరిగెత్తిపోయి స్వామి పాదాలపై పడ్డాడు. హే స్వామీ! మీరు నాపై ఎందుకు కినుక వహించారు. మీ పేరూ ఊరూ చెప్పకుండా ఎందుకలా వెళ్ళిపోయారు? అన్నాడు. అతనివైపు కోపంగా చూస్తూ 'అవాడు ఎర్రరాతినిచ్చి నా పేరు నీకు చెప్తాను కదా! నర్మదా. నీ దగ్గరున్న గణపతి ఎర్రరంగువాడు. కానీ నువ్వు మూర్ఖుడవు కాబట్టి దీని అర్ధం నీకేమీ తెలియలేదు! నేను శేగాంవ్ లో ఉంటాను. నా పేరు గజాననుడు. నాతో 'దూమార్ సదనం'లోకి రా అక్కడ మళ్ళీ కలుసుకుందాం!" అని స్వామిజి అదృశ్యులయ్యారు. పాపం నిమోణ్ కర్ దారంతా వెతుకుతూనే వున్నాడు. చివరికి విసిగి అలసిపోయి, ధుమార్ సదనం లోకి రాగానే స్వామి వరండాలో కూర్చుని ఉండటం చూశాడు. ఏమీ మాట్లాడకుండా స్వామికి సాష్టాంగపడ్డాడు. తరువాత 'ధుమార్'కి జరిగినదంతా వివరించాడు. ఇది విని ధుమార్ చాలా ఆనందించారు. తిరిగి ఉత్సాహంగా యోగీశ్వరునిలో లేనిదేముంది? వీరు సామర్థ్యాల గనియే అనుకో! వీరికి సార్వభౌమ పదవంటేకూడా ఏమాత్రం విలువలేదు! నీకు. లభించిన ఎర్రరాతిని పీటమీదుంచి పూజ, అర్చనలు చెయ్యి! రాతి ఎదుటనే శ్రద్ధా భక్తులతో యోగాభ్యాసం చెయ్యి ఇలా చేయటం వలన నీకు ఫలితం తప్పక కలుగుతుంది" అన్నాడు. ఇదే నిజమైంది ముందు ముందు! శ్రీ గజాననస్వామి కృపవలన నిమోణ్ కర్ యోగవిద్యా రహస్యాలు: తెలుసుకోసాగాడు. తుకారాంకోకాలే అనే సజ్జనుడొకడు శేగాంవ్ లో వుండేవాడు. అతని సంతతి బ్రతికేది కాదు. అందుచేత అతడు 'నా సంతతి బ్రతికి దీర్ఘాయుష్కులైనట్లయితే అందులో ఒకరిని శ్రీస్వామి సేవ చేయటానికి అర్పిస్తాను' అని మొక్కుకున్నారు. స్వామిజీ అతని మనోవాంఛితాన్ని అనతికాలంలోనే ఫలింపచేశారు. తుకారాంకి ఇద్దరు ముగ్గురు పుత్రులు కలిగారు. కానీ పుత్ర వ్యామోహంలో అతనికి తన మ్రొక్కుబడి విషయం. గుర్తులేకుండా పోయింది. ఒక రోజు అతని పెద్ద కొడుకు 'నారాయణ' అస్వస్థుడయ్యాడు. అనేకరకాలైన ఉపచారాలు చేయబడినాయి. కానీ అంతిమ శ్వాసల్లో ఉన్నాడు. కొడుకు యీ దుస్థితిని చూసిన 'తుకారాం'కు తాను చేసిన వాగ్దానం, మ్రొక్కుబడి గుర్తుకొచ్చాయి. అప్పుడు తుకారాం ' గురురాయా! వీడు బ్రతికి బయట పడ్డట్లయితే వీణ్ణే నీ చరణాలకు, సేవకై ఆర్పిస్తాను' అని మనస్ఫూర్తిగా అన్నాడు. ఇలా తుకారాం తిరిగి వచన బద్ధుడవటం వలన శ్రీస్వామి కృపచేత అతని కొడుకు మెల్లిగా కోలుకోసాగాడు. వ్యాధి ముక్తుడైన తరువాత తుకారాం' తన కుమారుని నారాయణుని మఠానికి, తీసుకొనివచ్చి శ్రీస్వామి చరణాలకు ఆర్పించాడు. విధంగా తన మాటను నిలబెట్టుకున్నాడు. నారాయణ, స్వామి సేవలో చివరి వరకూ ఉన్నాడు. స్వామికి చేసిన మ్రొక్కులేవైతే ఉంటాయో వాటిని ఎంత విలువైనా సరే వెచ్చించి భక్తులు తీర్చవలసిందే! 'నారాయణ వృత్తాంతం' ఉదాహరణగా సిద్ధయోగుల కిచ్చిన మాటలను ప్రతివారూ నిశ్చయంగా పూర్తిచేయవలసిందే! అని రుజువవుతోంది! ఎందుకంటే సిద్ద యోగుల చరిత్ర

మామూలు కధలు కావుమరి తరువాత 'విఠ్ఠల పాండురంగ' దర్శనాలు చేసుకోవటానికి ఆషాడ మాసంలో స్వామిజీ పాటిల్ తో కలిపి పండరిపూర కు బయలుదేరారు. విఠ్ఠల భగవానుడు సిద్దయోగు లందరికీ ఇష్ట ధ్యేయ విషయమైనవాడు. భక్తులకు కల్పతరువు కమలనాభ సర్వేశ్వరుడు. జగదాధారుడు జగత్పతి. ఎవరి గుణగణాలని వేదాలు గానం చేశాయో, రుక్మిణీపతి, దయాఘనుడు సిద్ధయోగులు మన మందిరాల్లోనే నివాసం ఏర్పరచుకుంటారు. పండరీపురం రాగానే చంద్రభాగా నదిలో స్నానంచేసి, స్వామిజీ పాండురంగని దర్శించేందుకు మందిరంలోకి వెళ్లారు. దర్శనం. చేసుకొని యిలా ప్రార్ధించారు. హే! పండరినాధా! హే అచింత్య! అద్వయ సమర్థ! హే భక్త పఠేశ! రుక్మిణీ కాంతా! నీ ఆనతిచేత యీ భూమిలో భ్రమించి శ్రద్ధా భక్తులున్న భక్తుల మనోరధాల నన్నింటినీ పూర్తిచేశాను. హే! పుండరీక వరద విఠ్ఠల! నా అవతార కార్యం పూర్తయిందని నీకు తెలుసుకదా! ఇంక నేను నిజధామాన్ని చేరటానికి అనుజ్ఞ యివ్వు! హే! భగవాన్! నేను భాద్రపద మాసంలో చిరంతనం అక్కడే ఉండటానికి వైకుంఠంలోని నీ చరణ సన్నిదిని చేరాలని కోరుకుంటున్నాను" అని ప్రార్ధించి శ్రీస్వామి చేతులు జోడించారు! నేత్రాలు అశ్రుపూరితాలయ్యాయి. అంతటి మహా సిద్ధయోగికి కూడా 'హరివిరహం' సహించరాని దయింది! స్వామి కన్నులలోని ఆశ్రువులను చూసిన హరిపాటిల్ "హే! సద్గురునాథా! మీ కన్నులలో యీ అశ్రువులకు గల కారణమేమిటి? యీ సమయంలో? మీ సేవలో నానుండి అపచారమూ జరగలేదుకదా! మీ యీ కినుక ఎందుకు? దీనికి కారణమేమిటి? అని అడిగాడు. దానిమీదట శ్రీస్వామీజీ హరపాటిల్ చేతిని తన చేతిలోనికి తీసుకొని "దీని కారణాన్ని నువ్వు తెలుసుకోలేవు! ఇది చాలా గహనవిషయం! దీన్ని తెలుసుకో గలందుకు గాను నువ్వు పట్టుపట్టకు. ఇక నా సహవాసం కొద్ది దినాలే! అని మాత్రం చెప్పగలను పద! మనం శేగాంవ్ వెళ్ళిపోదాం! నీ పాటిల్ వంశానికి పెట్టి లోటూ వుండరు" అన్నారు. శేగాంవ్ వచ్చిన తరువాత పండరిపూర్ నుంచి వచ్చినందుకు సమారాధన చేశారు. స్వామిజీ పండరిపూర్ లో చేసిన సంకేతానికి హరిపాటిల్ చాలా చింతితుడయ్యాడు. అతడు అతని తోడి వారితోనూ భక్తులతోనూ 'పండరిపురంలో స్వామి ఇక కొద్ది రోజులే సహవాసమని చెప్పారు' అని చెప్పసాగాడు. తరువాత శ్రావణమాసం గడిచింది. స్వామిజీ శరీరం క్రమక్రమంగా క్షీణించసాగింది. భాద్రపదమాసం వచ్చింది. ముందేమైందో ఇది వినండి. వినాయక చవితి (గణేశ చతుర్ది) నాడు స్వామిజీ భక్తులతో " గణపతి విసర్జనానికి అంతాలమఠానికి రండి! " అన్నారు. భక్తులంతా వచ్చిన తరువాత స్వామి "పార్థవ గణపతిని తయారుచేసి దాన్ని పూజించాలి. నైవేద్యం మొదలైనవి సమర్పించాలి. దాని తరువాత రెండవనాడు దాన్ని నిమజ్జనం చేయాలి అని గణేశ పురాణంలో వ్రాయబడి వుంది! నేడు అదేరోజు యీ పార్ధివదేహాన్ని ఉత్సాహంతో విసర్జనం చేయండి! కొంచెంకూడా శోకం, దుఃఖం కలగకూడదు సుమా! చోట మీరక్షణ కోసం నా అస్తిత్వం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. భక్తుల్ని మరచిపోయే ప్రశ్న ఉండదే ఉండదు. జీర్ణవస్త్రాన్ని మార్చినట్లుగా, యీ శరీరాన్ని కూడా మార్చాల్సి వుంటుంది. ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించినది? బ్రహ్మవేత్తలయిన వారంతా యిలానే చేశారు! సరియైన సమయంలోనే శరీర వస్త్రాన్ని మార్చాలి? విషయాలను ఎప్పుడూ మరువకండి అని వుపదేశించారు. వినాయక చతుర్ధి రోజు స్వామి ఎంతో ఆనందంగా గడిపారు. బాళాభావూ చేతిని పట్టుకొని స్వామి అతణ్ణి తన ఆసనంపై కూర్చుండబెట్టారు. తర్వాత యిలా అన్నారు. "నేను వెళ్ళిపోయానని ఎప్పుడూ అనుకోవద్దు. భక్తిలో ఏమాత్రం లోపం రానీకు, నన్నెప్పుడూ మరువవద్దు. ఎందుకంటే నేనెప్పుడూ యిక్కడే వుంటాను. అని వుపదేశించి స్వామిజీ తమ శ్వాసను యోగ సామర్ధ్యంతో ఆపుచేసి, తమ ప్రాణజ్యోతిని తమ మస్తకంలో కేంద్రీకరించారు. శకసంవత్సరం పద్దెనిమిదివందల ముప్పైరెండు, సాధారణనామ సంవత్సర భాద్రపద శుద్ధ పంచమీ గురువారం మొదటి జాములో ప్రాణాన్ని నిలుపు చేసే సమయంలో వారినోటినుండి జయ గజానన!' అనే పదాలు వెలువడ్డాయి! శ్రీ గజాననులు శేగాంవ్ లో సచ్చిదానంద స్వరూపంలో విలీనమై పోయారు! శరీరం చలనం ఆగిపోయింది. స్వామీజీని సమాధి స్థితిలో చూసి భక్తులందరూ శోకతప్తులయ్యారన్న విషయం వాయువేగంతో నలుదిక్కులా పాకిపోయింది! స్త్రీలూ, పురుషులూ అంతా తమ గుండెలను కొట్టుకుంటూ ఎంతో ఆక్రోశించారు. "సాక్షాత్కారియై, మా సౌఖ్యనిధి మానుండి లాగుకొనబడింది. కాలరూప పవనం జ్ఞానజ్యోతిని ఆర్పేసింది! హే! గజాననస్వామీ! హే! సమర్ధ! ఇక మాకు దిక్కెవరు? మమ్ములను విడిచి వెళ్ళటానికింత తొందరెందుకు పడ్డావు?" అని ఎంతో దుఃఖించటం మొదలు పెట్టారు. మార్తాండ పాటిల్, హరిపాటిల్, విష్ణుసా, బంకట్ లాల్, తారాచంద్, శ్రీపతిరావు కులకర్ణి మొదలైన వారంతా పోగయ్యారు మఠంలో! వారంతా "ఈనాడు పంచమి. నేడు స్వామిని సమాధి చేయవద్దు. చుట్టు ప్రక్కలున్న భక్తులంతా అంతిమదర్శనం చేసుకునేందుకు వస్తారు. ఇక యీ మూర్తి కనిపించదు కదా! కాబట్టి సాయంత్రం వరకూ భక్తుల రాకకోసం ఎదురుచూద్దాం! స్వామి యొక్క అంతిమ దర్శనం ఎవరెవరికి రాసి పెట్టి వుందో వారిని రానీయండి!' అని నిశ్చయించి వెంటనే అన్ని చోట్లకూ సందేశాలు పంపారు. 'డోణగాం'లోని పండితుడు గోవిందశాస్త్రి ఉపిస్థితులైనవారితో "స్వామి తమ భక్తులకు దర్శనం అవశ్యం యిస్తారు! అప్పటి వరకూ వారు తమ ప్రాణాన్ని మస్తకంలోనే వుంచుతారు. దీని నిదర్శనాన్ని చూడాలని వుంటే కొంచెం వెన్న తీసుకొనిరండి" అన్నాడు. వెన్నను మస్తకంపైన పెట్టగానే కరిగిపోసాగింది. ఇది చూసిన వారంతా ఆశ్చర్య చకితులయ్యారు. యోగశాస్త్రం యొక్క శక్తిని భక్తులు తమ కళ్ళతో చూశారు. గోవిందశాస్త్రి యింకా యిలా అన్నారు ఇది ఒక్క రోజునే కాదు సిద్ధయోగులు ఒక సంవత్సరం వరకూ ఇదే స్థితిలో వుంటారు! కానీ, ఎక్కువకాలం ఆపటం మంచిదికాదు. స్వామి ప్రియభక్తులు దర్శనం చేసుకున్న తరువాత స్వామిని సమాధి చేద్దాం" అన్నారు. ఆలోచనే అందరికీ నచ్చింది. భక్తులు భజనలు చేయటం ప్రారంభించారు. వేలకొద్దీ కరతాళాలు మ్రోగుతూ భజనలు మొదలైనాయి! సుదూరంగా వున్న భక్తులందరికి శ్రీస్వామి కలలో దర్శనమిచ్చి తమ సమాధి విషయాన్ని వారందరికి తెలిపారు. ఋషిపంచమి నాడు శ్రీస్వామి వారి అంతిమ దర్శనం కోసం భక్తులు తండోప తండాలుగా వచ్చారు. ఆకులూ, పూవులతో రధం అలంకరింపబడింది. భజనలు చేసేవారు. (జుట్లు) సమూహాలు వచ్చిచేరినాయి పేడకళ్ళాపులతో మార్గాల్ని స్త్రీలు పవిత్రం చేశారు. రధం వెళ్ళి మార్గమంతా రంగవల్లులతో సుందరంగా అలంకరించబడింది. ఆరోజు శెగాంవ్ అంతా చూడటానికి వాయుమండలంగా కనిపించసాగింది. స్వామిజీ కళేబరాన్ని రథంలో వుంచి మొత్తం వూరంతా ఒకసారి పరిక్రమ చేయించి తీసుకొనివచ్చాడు. దీని వర్ణన చేయటం చాలా కష్టం మరిగి రాత్రి అంతా జనం గులాల్ (బుక్క), పూనవులు వర్షంగా స్వామి పైన కురిపిస్తూనే వున్నారు? భజన మండళ్లు స్వామి నామాన్ని ఉచ్చరిస్తూనే వున్నాయి. ప్రతిధ్వనులు ఆకాశాన్నంటుతున్నాయి. తులసిదళాలూ, పుష్పాలూ, అబీర్ గులాల్ మొదలైనవన్నీ స్వామిపైన వర్షస్తూనే వున్నాయి. పూలమాలతో స్వామీజీ కళేబరం కప్పబడింది. అది చూడటానికి స్వామి పూలమాలల దుప్పటి కప్పుకున్నట్లుగా వుంది! మిఠాయిలు ఎన్నో రాకాలు ప్రసాదరూపంలో పంచి పెట్టబడుతున్నయి. కొందరు భక్తులు స్వామి రథం పైన రూపాయిలు పైసలు వర్షన్నే కురిపించారు. ఇలా రాత్రంతా ఊరేగింపు చేసి, రెండవరోజు ఉదయాన్నే సమాధి స్థానం..

దగ్గర స్వామి కళేబరాన్ని వుంచారు. రుద్రాభిషేకం చేయబడింది! విధి విధానంగా పంచోపచార పూజ చేయబడింది. హారతులివ్వబడ్డాయి! 'గజానన' నామపు జయఘోష అంతా చేశారు. వారి ఆశీస్సులు కోరుకుంటూ జనం అంతా "జయ జయ అవిలయ గజాననా! హే! నరదేహధారీ! నారాయణా అవినాశరూపా! ఆనందఘనా! పరాత్పర జగత్పతే!" అని ప్రార్ధనలు చేశారు. శాస్త్రమార్గాన్ననుసరించి శ్రీస్వామీజీని సమాధిస్థితిలో ఉత్తరాభిముఖంగా వుంచారు. శ్రీస్వామీజీ అంతిమ దర్శన సమయంలో భక్తులంతా "జయ స్వామీ! గజాననా!" అని పెద్ద పెట్టున జయజయధ్వానాలు చేశారు. ఉప్పు, (కశరి, చందనం, కస్తూరీ మిశ్రణం) అరగజా అబీర్ లతో సమాధి నింపబడింది. శోకతప్తులైన అంతఃకరణతో శిలను పెట్టి (రాతిని) ద్వారం మూసేశారు. పదిరోజుల వరకూ 'సమారాధన జరుగుతూనే వుంది. ఎందరు ప్రసాదం పొందారో చెప్పటం కష్టం! నిజంగానే సిద్ధయోగుల అధికారం చాలా పెద్దదిగా వుంటుంది! వీరి ఎదుట సార్వభౌములైన రాజుల గొప్పతనం ఎందుకూ పనికిరానిదే!

స్వస్థి శ్రీ దాసగణూచే విరచితమైన శ్రీగజానన విజయమనే యీ గ్రంధం హరిభక్తిని చేయటానికి శ్రద్ధాళువులకు సత్పథాన్ని చూపించటంలో సమర్థవంతమగుగాక !

శుభం భవతు

||శ్రీ హరిహరార్పణమస్తు

|| ఇది ఏకోనవింశాధ్యాయము సమాప్తము

 

యే మనుష్యః మాం ఆశ్రతః!

తాన్ సర్వేస్యః కర్మ వినాశనః లభై!!