"గంగవోలె నిర్మలం సాయినామం
యమునవోలె నిర్మలం సాయినామము
నదులన్నీ కలియుతావు సాయినామం
నవరత్న సాగరమే సాయినామం             :గంగ :
నమ్ముకొన్నవారి బ్రోచే సాయినామం
భువనములను శాంతి కూర్చు సాయినామం
సత్యమేదో తెలియచెప్పు సాయినామం
అను నిత్యమూ అండగా ఉండు సాయినామం
అర్ధవంతమైనది సాయినామం
యదార్ధమైన సౌఖ్యమొసగు సాయినామం
చక్కరకన్న తీయనిది సాయినామం
మన అక్కరలను తీర్చేది సాయినామం           ..గం ..
పాపములను బాపెడిది సాయినామం
మన తాపములను తీర్చెడిది సాయినామం
అద్భుతమగు మహిమ కలది సాయినామం
ఆనందపు అనృతజలధి సాయినామం      ..గం . .