శ్రీ కాత్యాయని దేవి వ్రతం

?? శ్రీ కాత్యాయని దేవి వ్రతం   click here for pdf

కుజ దోషం, వివాహ దోషాలు, వివాహమై సమస్యలు ఉన్న వారికొరకు శ్రీ కాత్యాయని దేవి వ్రతమ్ ?

?ముందుగా గణపతి పూజ చేసుకొని, తరువాత మండపముపై వున్న కలశముపైన ఒక పుష్పం తీసుకొని ఈ క్రింది మంత్రము చెప్పుతూ కాత్యాయని దేవిని కలశమందు ఆవాహన చేయవలెను. 

"అస్మిన్ కలశే సమస్త తీర్దాదివం వారున మావాహయామి" అని పుష్పం వుంచి మరల పుష్పం తీసుకొని

శ్లో: అస్మిన్ కలశోపరి సాంబ సదాశివ సహిత కాత్యాయనీం

మహా గౌరీం ఆవాహయామి స్థాపయామి పూజయామి. 

కలశము ముందు పుష్పమునువుంచి ఈశ్వరుని ఎడమతొడపై  కాత్యాయని దేవి కూర్చున్నట్లుగా భావించి నమస్కరించవలెను.

 

ధ్యానం:

శ్లో:  ధ్యాయామి దేవీం సకలార్ధధాత్రీంచతుర్భుజం కుంకుం రాగాశోనాం

ఈశాన వామాంక నివాసినీం శ్రీ కాత్యాయనీం త్వాం శరణం ప్రపద్యే.

కాత్యాయని మహాదేవి శంకరార్ధ స్వరూపిణి

కల్యాణం కురుమే దేవి శివశక్తి నమోస్తుతే .

శ్రీ కాత్యాయని దేవ్యై నమః ధ్యానం సమర్పయామి. ఎర్రటిపుష్పం అమ్మవారి ముందు వుంచవలెను.

 

 

ఆవాహనం:

శ్లో: సర్వదోష ప్రశమని సర్వాలంకార సంయుటే

యావత్వాం పూజయిష్యామి తావత్వాం సుస్తిరాభవ.

శ్రీ కాత్యాయని దేవ్యై నమః ఆవాహయామి.

 

రత్న సింహాసనం:

శ్లో:  భౌమవారే ప్రియే దేవి కుజదోష నివారణి,

స్కందమాత్రే స్వర్ణ రత్నమననం ప్రతిగృహ్యాతాం.

శ్రీ కాత్యాయని దేవ్యై నమః రత్న సింహాసనం సమర్పయామి.

 

 

పాద్యము:

శ్లో:  గంగాది సరస్వతీర్ధైశ్చ శోభితం చ సువాసితం,

పాద్యం గృహాణ వరదే హోవ్రి కళ్యాణ కారినీం.

శ్రీ కాత్యాయని దేవ్యై నమః పాదయో పాద్యం సమర్పయామి.

పుష్పముతో నీళ్ళు చల్లవలెను.

 

అర్ఘ్యము:

శ్లో:  శుద్దోదకం సువిమలం గంధ పుష్పాది మిశ్రితం,

అర్ఘ్యం దాస్యామితే దేవీ గృహ్యాతాం శివవల్లభే.

శ్రీ కాత్యాయని దేవ్యై నమః  హస్తయో అర్ఘ్యం సమర్పయామి.

 

ఆచమనీయం:

శ్లో:  సువర్ణ కలశానీతం చందనాగరు సంయుక్తం

గృహాణ ఆచమనీయం దేవి మయాదత్తం శుభప్రదే.

శ్రీ కాత్యాయని దేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి.

 

స్నానం:

శ్లో:  గంగా గోదావరి దివ్యై తీర్డైశ్చ మిళితం శుభం

శుద్దోదక స్నానమిదం గృహాణ పరమేశ్వరి.

శ్రీ కాత్యాయని దేవ్యై నమః  శుద్దోదక స్నానం సమర్పయామి.

 

వస్త్రం: 

శ్లో:  సురార్చితాంఘ్రే యుగళే దుకూల వాసనా ప్రియే,

రక్త వస్త్ర ద్వయం దేవి గృహ్యాతాం సురపూజితే.

శ్రీ కాత్యాయని దేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి.

 

మాంగళ్యం:

శ్లో:  తప్తహేమకృతం  దేవి మాంగళ్యం మంగళప్రదం

మయా సమర్పితం దేవి గృహ్యాతాం శివ వల్లభే.

శ్రీ కాత్యాయని దేవ్యై నమః మంగళ ప్రద మాంగళ్యం సమర్పయామి.

 

ఆభరణములు:

శ్లో:  సువర్ణ భూషణా దేవి నవరత్న మయానిచ

సమర్పయామి హి దేవి స్వీ కురుష్వ శుభప్రదే.

శ్రీ కాత్యాయని దేవ్యై నమః  సర్వాభరణాను  సమర్పయామి.

 

గంధము:

శ్లో:  కర్పూరాగరు కస్తూరి రోచనాది సుసంయుతం,

గంధం దాస్యామి శుభాగే స్వీ కురుష్వ శుభప్రదే.

శ్రీ కాత్యాయని దేవ్యై నమః గంధం సర్పయామి.

 

అక్షతలు:

శ్లో:  అక్షతాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్

గోఘ్రుతాక్తాన్ రక్త వర్ణాన్ స్వీ కురుష్వ మహేశ్వరి.

శ్రీ కాత్యాయని దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి.

 

పుష్పములు:

శ్లో:  మందారై కరవీరైశ్చ  పాటలైశ్చ  సుశోభనై

పుష్పైస్త్వాం పూజయిష్యామి దేవి కాత్యాయనీ శివే.

శ్రీ కాత్యాయని దేవ్యై నమః పుష్పై పూజయామి.

 

నమః అన్న తరువాత ఎర్రటి పుష్పములతో, పసుపు, కుంకుమలతో  అమ్మ వారిని పూజింపవలెను. 

 

అధాంగ పూజ:

ఉమాయై నమః                 -            పాదౌ పూజయామి

పార్వత్యై నమః                  -            జానునీ పూజయామి

జగన్మాత్రే నమః                 -           ఊరూ పూజయామి

జగత్ప్రతిష్టాయై నమః          -           కటిం పూజయామి

మూల ప్రకృత్యై నమః          -            నాభిం పూజయామి

అమ్బికాయై నమః             -            ఉదరం పూజయామి

అన్నపూర్ణాయై నమః          -            స్థనౌ  పూజయామి

శివ సుందర్యై నమః            -            వక్షస్థలం పూజయామి

మహా బలాయై నమః          -            బాహూన్ పూజయామి

గౌర్యై నమః                       -            జంఘే పూజయామి

శ్రీ పాడాయి నమః               -            హస్తాన్  పూజయామి

కంభు  కంట్యై నమః            -            కంటం  పూజయామి

బ్రహ్మ విద్యాయై నమః         -            జిహ్వం పూజయామి

శాంకర్యై నమః                   -            ముఖం పూజయామి

శివాయై నమః                   -            నేత్రే పూజయామి

రుద్రాన్యై నమః                   -            కర్ణౌ పూజయామి

సర్వంన్గాలాయై   నమః        -            లలాటం పూజయామి

సర్వేశ్వర్యై నమః                -            శిరః పూజయామి

మంగళ గౌర్యై నమః            -            సర్వాణ్యంగాని పూజయామి

 

శ్రీ కాత్యాయని దేవ్యై నమః అష్ట్తోత్తర శతనామావళి

ఓం గౌర్యై నమః     

ఓం గిరిజాతనుభావాయై నమః

ఓం జగన్మాత్రే నమః 

ఓం వీరభద్ర ప్రసువే నమః

ఓం విశ్వరూపిన్యై నమః

ఓం కష్ట దారిద్రషమన్యై నమః

ఓం శామ్భావ్యై నమః

ఓం బాలాయై నమః

ఓం భాద్రదాయిన్యై నమః

ఓం సర్వ మంగలాయై నమః

ఓం మహేశ్వర్యై నమః

ఓం మంత్రారాధ్యై నమః

ఓం హేమాద్రిజాయై నమః

ఓం పార్వత్యై నమః

ఓం నారాయణంశాజాయై నమః 

ఓం నిరీశాయై నమః

ఓం అమ్బికాయై నమః

ఓం ముని సంసేవ్యాయై నమః

ఓం మేనకాత్మజాయై నమః

ఓం కన్యకాయై నమః

ఓం కలిదోష నివారిన్యై నమః

ఓం గణేశ జనన్యై నమః

ఓం గుహామ్బికాయై నమః

ఓం గంగాధర కుతుమ్బిన్యై నమః

ఓం విశ్వా వ్యాపిన్యై నమః

ఓం అష్టమూర్తాత్మికాయై నమః

ఓం శివాయై నమః

ఓం శాంకర్యై నమః

ఓం భావాన్యై నమః

ఓం మాంగల్య దాయిన్యై నమః

ఓం మంజు భాశిన్యై నమః

మహా మాయాయై నమః

ఓం మహా బలాయై నమః

ఓం హేమవత్యై  నమః

ఓం పాప నాశిన్యై నమః

ఓం నిత్యాయై నమః

ఓం నిర్మలాయై నమః

ఓం మ్రుదాన్యై నమః

ఓం మానిన్యై నమః

ఓం కుమార్యై నమః

ఓం దుర్గాయై నమః

ఓం కాత్యాయిన్యై నమః

ఓం కలార్చితాయై నమః

ఓం క్రుపాపూర్నాయై నమః

ఓం సర్వమయి నమః

ఓం సరస్వత్యై నమః

ఓం అమర సంసేవ్యాయై నమః

ఓం అమ్రుతెశ్వర్యై నమః

ఓం సుఖచ్చిత్పుదారాయై  నమః

ఓం బాల్యారాదిత భూతదాయై నమః

ఓం హిరణ్మయై నమః

ఓం సూక్ష్మాయై నమః

ఓం హరిద్రా కుంకుమా రాధ్యాయై నమః

ఓం సర్వ భోగాప్రదాయై నమః

ఓం సామ శిఖరాయై నమః

ఓం కర్మ బ్రమ్హ్యై నమః

ఓం ఓం వాంచితార్ధ యై నమః

ఓం చిదంబర శరీరిన్యై నమః

ఓం దేవ్యై నమః

ఓం కమలాయై నమః

ఓం మార్కందేయవర ప్రదాయి నమః

ఓం పున్యాయై నమః

ఓం సత్యధర్మరతాయై నమః

ఓం శశాంక రూపిన్యై నమః

ఓం భాగాలాయై నమః

ఓం మాత్రుకాయై నమః

ఓం శూలిన్యై నమః

ఓం సత్యై నమః

ఓం కల్యాన్యై నమః

ఓం సౌభాగ్యదాయిన్యై నమః

ఓం అమలాయై నమః

ఓం అన్నపూర్ణాయై నమః

ఓం అఖిలాగమ సంస్తుతాయై నమః

ఓం అమ్బాయై నమః

ఓం భానుకోటి సముద్యతాయై నమః

ఓం పరాయి నమః

ఓం శీతాంశు కృత శేఖరాయై నమః

ఓం సర్వ కాల సుమంగళ్యై నమః

ఓం సామ శిఖరాయై నమః

ఓం వేదాంగ లక్షణా యై  నమః

ఓం కామ కలనాయై నమః

ఓం చంద్రార్క యుత తాటంకాయై  నమః

ఓం శ్రీ చక్ర వాసిన్యై నమః

ఓం కామేశ్వర పత్న్యై నమః

ఓం మురారి ప్రియార్దాన్గై నమః

ఓం పుత్ర పౌత్ర వర ప్రదాయి నమః

ఓం పురుషార్ధ ప్రదాయి నమః

ఓం సర్వ సాక్షిన్యై నమః

ఓం శ్యామలాయై నమః

ఓం చంద్యై నమః

ఓం భాగామాలిన్యై నమః

ఓం విరజాయై నమః

ఓం స్వాహాయై నమః

ఓం ప్రత్యంగి రామ్బికాయై నమః

ఓం దాక్షాయిన్యై నమః

ఓం సూర్య వస్తూత్తమాయై నమః

ఓం శ్రీ విద్యాయై నమః

ఓం ప్రనవాద్యై నమః

ఓం త్రిపురాయై నమః

ఓం షోడశాక్షర దేవతాయై నమః

ఓం స్వధాయై నమః

ఓం ఆర్యాయై నమః

ఓం దీక్షాయై నమః

ఓం శివాభిదానాయై నమః

ఓం ప్రణ వార్ధ స్వరూపిన్యై నమః

ఓం నాద రూపాయి నమః

ఓం త్రిగునామ్బికాయై నమః

ఓం శ్రీ మహాగౌర్యై నమః

ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయామి.

 

 

ధూపం:

శ్లో:  దశాంగం గగ్గులోపెతం సుగంధంచ సుమనోహరం

ధూపం దాస్యామి తే దేవి గృహాణ త్వం సురేశ్వరి.

శ్రీ కాత్యాయని దేవ్యై నమః దూపమాఘ్రాపయామి.

 

 

దీపం:

శ్లో:  కాత్యాయని మహాదేవి సర్వాలంకార సంయుతే

దీపం దాస్యామి భో మాతః స్వీకురుష్వ సుశోభనే.

శ్రీ కాత్యాయని దేవ్యై నమః దీపం దర్శయామి.

దూపదీపానంతరం శుద్ధ ఆచా మనీయం సమర్పయామి.  పుష్పముతో కలశంలోని నీళ్ళు చల్ల వలెను.

 

 

నైవేద్యం: 

శ్లో:  అపుపాన్ లవణ సంయుక్తాన్ ఇక్షు ఖండైశ్చ  సంయుతాన్

భక్ష్యాన్ ఘుతాక్తాన్ హి దేవి! స్వీ కురుష్వ మహేశ్వరి.

శ్రీ కాత్యాయని దేవ్యై నమః ఇక్షు ఖండ సహిత లవణాన్ అపుపాన్ నివేదయామి.

ఒక పళ్ళెములో 7 ఉప్పు వేసి వండిన అప్పాలు, చెరుకు గడలోని 7 ముక్కలు అమ్మ వారి ఎదుట వుంచి ఆమెకు నైవేద్యం సమర్పించ వలెను. 

 

తాంబూలం:

శ్లో: యాలా లవంగ కర్పూర ఫూగీఫల సుశోభితం

తాంబూలంచ ప్రదాస్యామి స్వీకురుష్వ శివప్రియే.

శ్రీ కాత్యాయని దేవ్యై నమః తాంబూలం సమర్పయామి.

 

నీరాజనం: 

శ్లో:  ఘ్రుత వర్తి త్రయోపెతం నీరాజన మిదం శివే

స్వీకురుష్వ మహాదేవి పాపం నాశయ సత్వరం.

శ్రీ కాత్యాయని దేవ్యై నమః మంగళ నీరాజనం సర్పయామి.

 ఆవునేతితో తడిపిన మూడు వత్తులను హారతిగా అమావారికి చూపవలెను.

మంత్ర పుష్పం:

శ్లో:  శివే హరిప్రియే దేవి! కాత్యాయని వరప్రదే

పుష్పాంజలి మిదం తుభ్యం దాస్యామి సురపూజితే.

శ్రీ కాత్యాయని దేవ్యై నమః సువర్ణ పుష్పాంజలిం సమర్పయామి.

 

ప్రదక్షిణ నమస్కారములు:

శ్లో:  గౌ భవాని రుద్రాణి శర్వాణి శంకర ప్రియే

ప్రదక్షిణం కరిష్యామి పాపాన్నాషయ సత్వరం.

శ్రీ కాత్యాయని దేవ్యై నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. 

 

ప్రార్ధన:

దేవ దేవి మహాదేవి శంకరార్ధ స్వరూపిణి

కాత్యాయని మహాదేవి కైలాసాచల వాసిని

తవపూజా భక్తి యుక్త చేతసాహం సదాముదా

కరిష్యామి తవప్రీత్యై మమాభీష్టం ద్రుతం కురు

గ్రహదోశాది దుర్దోశాన్ క్షిప్రం నాశయ శాంభవి

కల్యాణం కురుమే దేవి సౌభాగ్యంచ ప్రయశ్చమే .

శ్రీ కాత్యాయని దేవ్యై నమః ప్రార్ధన నమస్కారాన్ సమర్పయామి. 

అని పుష్పముగాని, అక్షతలుగాని అమ్మవారి ముందు వుంచి ఆమెను ప్రార్ధించ వలెను.

 

అనయా ధ్యాన ఆవాహనాది ఏకవింశత్యుపచార  పూజయా భగవాన్ సర్వాత్మికా శ్రీ కాత్యాయని దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు. 

అని చెప్పి అక్షతలు చేతిలోనికి తీసుకొని నీరు పోసుకొని అమ్మవారి ముందు విడువవలెను.  ఆ తరువాత అక్షతలు చేతిలో పట్టుకొని కథను చదువుకొని కతాక్షతలు అమ్మవారి మీద వేసి పిదప శిరస్సుమీద వేయించు కోవలెను.

 

శ్రీ కాత్యాయని దేవి వ్రత కథ

          పూర్వకాలమున పరమ పవిత్రమగు నైమిశారన్యమున శౌనకుడు మొదలగు మహామునులందరూ బహుపురానములు ఎరిగిన వ్యాస శిష్యుడగు సూత మహర్షిని గాంచి భక్తితో ప్రణమిల్లి ఓ మహర్షి! నీవెన్నియో పురానములను వినిపించిటివి మరియు సందర్భానుసారముగా వ్రతములను, వ్రత మహాత్యములను తెలిపితివి.  అయ్యా! ఇప్పుడు మాకొక ధర్మసందేహము తీర్చవలెను అని కోరగా అందుకు సూత మహర్షి సమ్మతించెను.  ఈశ్వరుని మొదటి భార్యయగు సతీదేవి తన తండ్రి యగు దక్షప్రజాపతి యజ్ఞ కుండమున  పడి దేహ త్యాగామోనరించెను గదా!  ఆ విధముగా, జరుగుటకు కారణమేమిఈశ్వరుడు ఆమెను రక్షిమ్పలేక పోయేనాలేక  సతీ దేవి యందు అనురాగాములేక మౌనముగా ఊరకుండెనఈశ్వరునకు భార్యా వియోగము యెట్లు సంభవించెనుమా సందేహములను తొలగించుము అని సూత మహర్షిని వేడుకొనిరి.  అప్పుడు సూత మహర్షి ఓ మునులారా!  మీ సందేహమును తప్పక పోగొట్టేడను.  సావధానముగా వినుడు అని ఇట్లు చెప్పసాగెను.

 

          దక్ష ప్రజాపతి తన కుమార్తెయగు సతీదేవి ఈశ్వరునకు భార్యగా నోసంగెను.  సతి దేవి పరమేశ్వరునితో కలిసో కైలాసమున సుఖముగా  ఉంది కృతయుగము అంటాయి గడిపెను.  త్రేతాయుగమున ఒకనాడు ఈశ్వరుడు సతిదేవితో మాట్లాడుచుండగా అకస్మాత్తుగా ఈశ్వరుడు అంతర్దానము అయ్యెను.  సతి దేవిఈశ్వరుడు మాట్లాడుచూ మాయమైనందుకు పరిపరి విధములుగా ఆలోచిన్చుచుండగా పక పకా నవ్వుతూ ఈశ్వరుడు సాక్షాత్కారించెను.  సతీదేవి పరమేశ్వరుని గాంచి ఓ నాదా! మీరు ఎక్కడకు వెళ్ళినారుఏదులకు నవ్వుతున్నారునేనేమైనా తప్పుమాట్లాడితినా? అని ప్రశించెను.  వెంటనే పరమేశ్వరుడు ఓ సతీ!  నాకు విశునువు తండ్రివంటివాడు నేను అతనికి తండ్రివంతివాడను, మా యిరువురకు ఏ విధమగు అంతరమును లేదు.  ప్రస్తుతము మహావిష్ణువు భూలోకమున శ్రీ రామునిగా అవతరించి పితృవాక్య పరిపాలనకై తన భార్యయగు సీతతోను, సోదరుడగు లక్ష్మణుడి తోనూ  వనవాసమునకు వెడలి పంచవటి తీరమున పర్ణశాల నిర్మించుకొని నివసించుచుండెను.  మన భక్తుడగు రావణుడు మాయోపాయముచే సీతను అపహరించి లంకకు గొనిపోయెను.  పర్ణశాలలో సీతను గానక శ్రీరాముడు ఆమెను వేద్దకుచూ ఆ అడవింతయు గాలించెను.  సీత ఎక్కడను గానరాక, శ్రీరాముడు సీతా వియోగాభాదచే కుమిలి మతిదప్పి ఆ అడవిలో కనబడ్డ పక్షిని, మృగమును, చెట్టును, పుట్టాను, రేమ్మను సీతను చూసినారా? అని అడుగుతూ పోవుచుండెను.  ఒక చోట పాడుబడ్డ శివలింగమును చూసి శ్రీరాముడు ఎలుగెత్తి ఓ పరమశివా, నాసీతను జూచితివా? అని ప్రశ్నించెను.  ణా తండ్రియగు విష్ణువు కేక విన్నవెంటనే నేను అచ్చటకు వెళ్లి శ్రీ రాముని ఎదుట నిలబడితిని.  కాని మానవరూపములో నున్న ఆ మహానీయుడు నన్ను చూడనట్లు గానే ముందుకు బోయెను.  అందుకే నీను నవ్వుచుంటిని.  ఇంతే తప్ప మరియొక కారణము లేదుసుమా! అని ఈశ్వరుడు పలికెను. 

          

                  ఆ మాటలు విన్న సతి ఓ నాదా!  మీ మాటలు నమ్మ శక్యముగాలేవు మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించి భార్యావియోగముచే మతి దప్పుతఎమిసీతకోసమని  రాముడు పిచ్చివానిగా సంచరించునాఇవి నమ్మ శక్యముగాలేవు మీరు పరిహాసమాడుచున్తిరి.  మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించినంత మాత్రమున మిమ్ము చూడలేక పోవుటయాఅని పల్కెను.  వెంటనే శివుడు సతీ నీవు ణా మాటలు నమ్మని యెడల స్వయముగా నేవే అచటకుబోయి  ఆ రాముని సీతా వియోగ బాధను కన్నులారా చూడుము.  నీకు అంతయు బోధపడగలదని పలికెను.  వెంటనే సతీ దేవి ఓ నాదా! నేను రాముని పరీక్షించి రాగలనని పలికి అదృశ్యమై పంచవటి తీరమున శ్రీరాముడున్న ప్రాంతమునకు వెళ్లి అచట శ్రీ రామ చంద్రుడి సీతా వియోగ బాధను కన్నులారా చూసి, చెవులారా విని అతని ఆక్రందనను విని సందేహాస్పదయై రాముని పరీక్షించదలచి "నేను సీతగా మారిపోవలేయునని" తలంచెను.  వెంటనే సతీదేవి సీతగా రూపమును పాడెను.  అదే సమయమునకు కైలాసమండున్న శివుడు సతీదేవి శ్రీరాముని ఏవిధముగా పరీక్షించునో అని తలంచి రహస్యముగా ఆ ప్రాంతమునకు చేరి సీతా మహాదేవిని గాంచి కనులుమూసుకొని చేతులోగ్గి నమస్కారము గావించి మరల చూడగానే ఆమె అభిముఖముగా పోవుచుండెను.  అప్పుడు శివుడు నాతల్లి నా తండ్రి చెంతకు పోవుచుండెను అని సంతోషించాసాగెను.  ఇంతలో శ్రీరాముడు ఆమెను గాంచి వెంటనే ఆమెకు నమస్కరించి ఓ జగన్మాతా! నన్ను మోసగిమ్పదలచితివానాకు నాభార్య తప్ప మరియొక స్త్రీ నిజస్వరూపములో కనపడును.  అని పలికిన వెంటనే సతీదేవి తన నిజరూపమున ఓ శ్రీరామా! నిన్ను పరీక్షించుటకై నేను సీతారూపమును దాల్చితిని.  నీ సీత ఎచ్చట నున్నను మహాసాద్వియై యున్దగలదు.  అని పలికి అదృశ్యమయ్యెను.

 

            శివుడుకూడా జరిగినదంతయు తెలుసుకొని సతీదేవి కంటే ముందుగానే కైలాసమునకు చేరి ఏమియు తెలియనివానివలె మౌనముగా నుండెను.  ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి ఓ నాదా! నేను పోయి శ్రీరాముని పరీక్షించితిని, నిజముగా అతడు మహావిష్ణువై ఉండికూడా మానవునివలె, పామరునివలె నటించుచుండెను అని పలికెను.  వెంటనే శివుడు ఓ సతీ నీవు అతనిని యెటుల పరీక్షించితివిఅని ప్రశ్నించెను.  వెంటనే ఆమె ఓ నాదా! నీవు పరీక్షినిచిన విధముగానే నేనుకూడా పరీక్షించితిని అని చెప్పెను.  అప్పుడు శివుడు, నీవుదాల్చిన ణా తల్లి రూపము ఇప్పటికి నాకన్నులకు కనబడుచున్నది.  నీవు నాతల్లివి, అని ఆ సతీ దేవికి నమస్కరించి వెళ్లి పోయెను.  అంతట ఆ సతీదేవి జరిగిన తప్పును తెలుసుకొని, నేను సందేహించుట ఒకతప్పు, దానిని కప్పిపుచ్చుటకు అబద్దమాడుట మరియొక తప్పు. దీనిచే నేను కళంకము నోదితిని.  ఈ కళంకిత దేహముతో ఈశ్వరుని అర్ధాంగిగా ఉండు అర్హత కోల్పోతిని.  అందుచే దయామయుడగు పరమేశ్వరుడు నన్ను తల్లిగా జూతునని శిక్షించెను.  అని అనేక విధములుగా ఆలోచించి, కళంకితమైన తన దేహమును త్యజించుటకు నిశ్చయించెను.  తన దేహమును విడిచిపెట్టుటకు పలువిధములుగా యోచించి చివరకు తను ఏ ఇంట పుట్టెనో అచ్చటనే తన దేహమును వదులుత యుక్తమని సతీదేవి నిశ్చయించుకొనెను.  సతీదేవి తన మాయచేత తన తండ్రికి ఈశ్వరుడన్నాద్వేషము కలిగించి ఈశ్వరుని పిలవకుండా యగ్నమోనరించు కోరికను కలిగించెను. 

 

            ఆమె నిర్ణయానుసారముగా దక్షుడు  శివుని అవమానింప దలచి శివునకు హవిర్భాగమివ్వకుండా యజ్ఞమును తలపెట్టెను.  దేవతలందరూ ఆ యాగామునకు వెళ్ళుచుండగా సతీదేవి కూడా ఆ యాగామునకు పరమేశ్వరునితో కలిసి వెల్లుదుమని ఈశ్వరుని కోరెను.  ఆ యాగామునకు వెళ్ళుట యుక్తముగాదని పరమేశ్వరుడు చెప్పినను ఆమె వినిపించుకొనక ఆ యాగమునకు వెళ్లి తీరవలేయునని మంకు పట్టు పట్టేను.  దానితో శివుడు చేయునది లేక నందీశ్వరుడు, బృంగీశ్వరులను సాయమిచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపెను. 

 

            దక్షుని యాగామందపములోనికి సతీదేవి ప్రవేశించి అచట తనవారేవ్వారు పలకరింప పోవుటచే అవమానముగా భావించి రాగులుచున్న అగ్ని గుండముచెంతకు  చేరి చేతులు జోడించి "ఓ అగ్ని దేవా! నేనొక అబద్దము ఆడుటచే ఈశ్వరునకు దూరమైతిని.  ఇచ్చట అవమానము నొంది ఈశ్వరుని చూడలేను.  కావున కళంక మొందిన  ణా దేహమును బూడిద చేసి చల్లని హృదయము కలిగినవాడును, నిర్మలమగు మనసున్న ధీరహృదయుని కుమార్తెనై జన్మించి తిరిగి పరమేశ్వరునే భర్తగా పొందునట్లు చేయుము".  అని ప్రార్ధించి భగ భగ మండుచున్న అగ్నిగుండము లోనికి దుమికెను.  దేవతలందరూ హాహాకారాలు చేయుచుండగా నందీశ బృంగీశ్వరులు ఒక్క క్షణములో శివుని చెంతకు చేరి జరిగినదంతయు తెలిపిరి.  సతి మరణవార్త విన్నంతనే శివుడు మహారౌద్రాకారామును దాల్చి  వీరభద్రుని సృష్టించెను.  ఆ వీరభద్రుడు దక్షవారికకు చేరి తనవంటి కోటానుకోట్ల  మహావీరులను సృష్టించి దక్షవాతికను స్మశాన వాటికగా మార్చెను. 

 

           ఈశ్వరుడు సతీ వియోగముచే కలిగిన కోపమును భరింపలేక హిమాలయ శిఖరములకు చేరి అచట విశ్రాంతి నొందుచుండెను .  ఆ సమయమున పరమేశ్వరుని లలాతమునుంది చెమట బిందువొకటి భూమిపై బడెను.  శివలీలచే వెంటనే ఆ చెమట బిందువు చూచుచుండగానే నాలుగు భుజములు కలిగి ఎర్రని రంగుతో దివ్య తేజముతో వెలుగు శిశువుగా మారెను.  ఆ శిశువు భూన భువనాన్తరములు ప్రతిద్వనించునట్లు  రోదన చేయసాగెను.  శివుని భయముచే భూదేవి స్త్రీ రూపమునోంది ఆ శిశువును ఒడిలోనికి జేర్చుకొని స్థన్య మోసంగెను.  అప్పుడు రుద్రుడు ఆమెతో "ఓ భూదేవి నీవు చాలా పున్యాత్మురాలవు. ఈ ణా శిశువును నీవు పెంచుకొనుము.  ఇతడు నీయందు పుట్టుటచే కుజుడు, భౌముడు అను పేర్లతో సార్ధకనాముడు కాగలదు.  ఎర్రని రంగుతో  నుండుటచే అంగారకుడు అనికూకా పిలిచెదరు.  నవగ్రహములలో ఇతడు ఒక గ్రహముకాగలదు.  ఇతడు ఇంట కాలము నన్నాశ్రయించి ఉండుటచే నాకు భార్యా వియోగము కలిగినది.  ఈ కుజుని పుట్టుక ఎవరు విన్డురో వారికి కుజదోష పరిహారముఅగును". అని శివుడు పలికి వెడలి మరియొక చోట సమాధి నిష్టాగరిష్టుడయ్యేను. 

 

             హిమవంతుడు ఒక పర్వత రాజు.  అతడు నిర్మలమైన, చల్లనైన ధీర హృదయుడు.  అతని భార్య మేనాదేవి.  ఆ మేనాదేవి గర్భావాసమున సతీదేవి ప్రాణములు ప్రవేశించి నవమాసములు నిండగానే ఒక శుభదినమున జన్మించెను.   హిమవంతుడు పూర్వజన్మలో కతియను ముని.  అందుచే అతనికి పుత్రికగా జన్మించుటచే "కాత్యాయని" అనియు, పర్వతరాజు కుమార్తె అగుటచే "పార్వతి" అనియు మహర్షులు ఆమెకు నామకరణము చేసిరి.  ఆ కాత్యాయని శుక్ల పక్షములోని చంద్రునివలె దినదిన ప్రవర్ధమానమై బాల్యములోనే సర్వవిద్యా కలాకోవిదయై వెలుగొందెను .  మరియు అఖండ మగు ఈశ్వరాధన ఆమెతో పెల్లుబికసాగెను.  క్రమముగా నారదుని ప్రోత్సాహముతో పరమేశ్వరుని సన్నిధానమున శుశ్రూష చేయు అవకాశము లభించెను.  పార్వతికి యుక్తవయసు రాగానే, దేవేంద్రుడు శివుని సమాధిని భగ్న మొనరించుటకు మన్మధుని బంపేను.  మన్మధుడు దేవకార్యమును కాదనలేక శివునిపై తన బాణములను ప్రయోగించెను.  ఆ బాణ ప్రభావముచే శివుడు సమాధిని  వీడి మహా సౌందర్య రాశియగు పార్వతిని చూసి వెనువెంటనే తన సమాధిని భగ్న పరచిన మన్మధుని మూడవ నేత్రముతో భాస్మీపతలము గావించి వెడలిపోయెను. 

 

           పార్వతి తన కన్నుల యెదుట జరిగిన సంఘటన గాంచి భయపడక, ధైర్యముతో తన తపముచే ఈశ్వరుని వశము గావిన్చుకోదలచి కటోరమైన తపము సలిపెను. ఆ తపస్సు చే ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను భార్యగా స్వీకరించుటకు అంగీకరించెను.  సప్త మహర్షులను హిమవంతుని చెంతకు కన్యావరనకై శివుడు పంపెను.  ఆ మహర్షులు హిమవంతుని చెంతకు పోయి పరమశివునికి పార్వతిని ఇచ్చుటకు సంసిద్దము గావించిరి.  ఒక శుభలగ్నమున అత్యంత వైభవో    పేతముగా  శివపార్వతి  కళ్యాణము  బ్రహ్మ   స్వయముగా  జరిపించెను. 

 

            శివుడు పార్వతిని వివాహమాడి ఎనలేని ఆనందముతో వుండగా మన్మధుని భార్యయగు రతీదేవి శివుని పాదములపై బడి తన భర్తను బ్రతికింపమని ప్రార్ధింపగా శివుడు సంతోషముతో మన్మధుని బ్రతికించి రాతీదేవికి మాత్రమె కనిపించునట్లు చేసి ఆమెకు సంతోషము కలిగించెను.   దేవతలందరూ పరమేశ్వరుని దయా దృష్టికి మహదానందము నొంది ఆ దంపతులపై పూలవర్శము కురిపించిరి.  ఆ సమయమున పార్వతి పరమేశ్వరునితో "ఓ నాదా! కుజుడు నిన్ను ఆశ్రయించిన దోషముచే గతజన్మలో నేను సందేహాస్పదనై అసత్యమాడి నీకు దూరమై శరీర త్యాగమోనరించితిని.  తిరిగి అతడు నీ లలాటమునుంది చెమట బిందువు రూపములో నీకు దూరము కావడమువలన మరల నేను నీకు దగ్గరైతిని.  కాని ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు గూడా బాధలేకుండా చేయగలరు అని ప్రార్ధించెను.  వెంటనే శివుడు ఆమెతో "ఓ పార్వై! కుజుని జన్మకతను విన్నవారికి కుజదోష పరిహారము అగునని ఆనాడే వరమిచ్చితిని.  ఎప్పుడు నీకోరిక ననుసరించి లోకములోని జనులకు కుజదోషపరిహారమై శీఘ్రముగా వివాహమగుటకు, వివాహ ప్రతిబంధక దోషములు నివారణ అగుటకు ఒక వ్రతమును నీ నామాంకితముగా స్థాపన చేయు చుంటిని.  ఆ వ్రాతమునకు నీవే ప్రధానాంశము.  భౌమవారముచే కుజుడు, ప్రదోషకాలమగుటచే  నేనునూ అందు భాగాస్వాములమైతిమి.  "కాత్యాయనివ్రతము" అను పేరుతొ భూలోకములో సుస్తిరముకాగలదు.  అని పలికెను.  ఆమాటలు విని పార్వతి ఎటో సంతోశాపడెను.  పిదప పరమేశ్వరుడు పార్వతితో ముక్కోతిదేవాతలు వెంటరాగా కైలాసమునకు చేరెను.  అని సూత మహర్షి శోవ్నకాడులకు వినిపించెను. 

 

వ్రత విధానము: 

     వివాహ ప్రతిబంధక దోషములున్ననూ నివారణ అగుటకు, శీఘ్రముగా అనుకూలమగు భర్తను పొందుటకునూ  కాత్యాయని వ్రతముతో సాతియైనది మరియొకటి లేదు.  ఈ వ్రతమును ఆచరిన్చువారికి భక్తి విశ్వాసములు ముఖ్యము.  తారాబల చంద్రబలయుక్తమైన మంగళవారమున ఈ వ్రతమును ఆరంభించవలెను.  ఆ రోజు ఉదయము కాళ్ళకృత్యములు, తీర్చుకొని భక్తి శ్రద్దలతో గౌరీదేవికి ప్రణమిల్లి ఉపవాసముండి సాయంకాలం ప్రదోషకాలమున ఈ వ్రతమును ప్రారంభించవలెను.  ముందుగా గణపతిపూజచేసి ఆపిదప ఒక కలశమును ఏర్పాటుచేసి అందు సగమువరకూ పవిత్రోదకము పోసి మామిదిచిగుళ్ళనుంచి, ఒక కొబ్బరికాయను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కలశముపై వుంచి, ఎర్రని రవికల గుడ్డను ఆ కొబ్బరికాయపై వుంచి, అందు పరమేశ్వరుని నామంకమున  వున్న కాత్యాయనిదేవిని ఆవాహన గావించి భక్తి శ్రద్దలతో ఇరవదిఒక్క ఉపచారములతో ఆ దేవిని పూజించావలేయును.  ఎర్రని పుష్పములతో, పసుపు, కుంకుమ లతో పూజించవలెను.  బంగారముతోగాని, పసుపుకోమ్ముతోగాని వారి వారి శక్తానుసారము మంగళ సూత్రములను కలశామునకు అలంకరించవలెను.  కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను ఏడింటిని మరియు చేరుకుగాడతో కోసిన ఏడు చేరుకుముక్కలను కలిపి నైవేద్యము చేయవలెను.  భక్తి శ్రద్దలతో వ్రత సమాప్తి చేసి కథను విని, ఆ అక్షతలను అమ్మవారిమీది వుంచి పిదప ఆ అక్షతలు శిరస్సుపై పెద్దలచే వేయించుకొని రాత్రి భోజనము జరుపవలెను.  ఈ విధముగా ఏడు వారములు వ్రతము భక్తితో జరుపవలేయును.  మధ్యలో ఎవారమైన అద్దంకి వచ్చినచో ఆపై వారము జరుపుకోవలెను.  ఏనామిదవ మంగళవారము ఉద్యాపన జరుపవలేయును.  ఆ రోజు ఏడుగురు ముత్తైదువులను పిలిచి తలంటుపోసి వారినే గౌరీదేవిగా భావించి పూజించి ఏడు అప్పాలను, ఏడు చేరుకుముక్కలను శక్త్యానుసారముగా చీర, రవికలగుడ్డ వాయనమిచ్చి వారినుండి ఆశీస్సులు పొంది, వారికి భోజనము పెట్టవలెను. ఈ విధముగా జరిపిన కన్యలకు కుజదోష పరిహారము, ఇతర వివాహ ప్రతిబంధక దోషములు నివారణ జరిగి, శీఘ్రాముగా వివాహమగును.  మరియు ఆ కన్యలు సుఖ సౌభాగ్యములతో వర్ధిల్లును.  పూర్వము దమయంతి ఈ వ్రతమును ఆచరించి నలుని చేపట్టెను, రుక్మిణి ఈ వ్రతమాచరించి వుద్యాపననాడే శ్రీకృష్ణుని చెంతకు చేరెను.  ఈ వ్రత కథను విన్నవారికి, చదివిన వారికి కుజదోష మరియు సకల వివాహ ప్రతిబంధక దోషములు తొలగిపోవును అని సూత మహర్షి శౌనకాది మహామునులకు వివరించెను.

?????????