సాయి గురుబంధువులకు ...విన్నపము . పవిత్రమైన సాయిసచ్చరిత్ర అక్షరరూపములోనూ శ్రవణ పారాయణము చేసివుంటాము .సాయి సచరిత్రలలో మనకు కనిపించే వివిధ భక్తుల గళములతోగల ఈ సచ్చరిత్ర శ్రవణ పారాయణము విని ఆనందించండి .ఈ సచ్చరిత్ర శ్రవణ పారాయణము విన్నంతసేపు మనమూ కూడా ఆ షిరిడీలో సాయినాథుని సన్నిధిలో ఉన్నట్లు ఆ భక్తుల సన్నిహితంతో వున్నట్లు ఒక అనుభూతి కలుగుటలో సందేహం లేదు .
సంభాషన సహిత శ్రీసాయి సచ్చరిత్ర శ్రవణ పారాయణము భక్తుల గళములతోగల పాత్రధారుల గళములతో-వినండి
సాయి సచ్చరిత్ర కధలో పాత్రధారుల గళములతో
సాయిసచ్చరిత్ర మొదటి రోజు పారాయణం వినండి
సాయిసచ్చరిత్ర శ్రవణ పారాయణములో రెండవ రోజు పారాయణము. పాత్రధారుల గళములతో
శ్రీ సాయిసచ్చరిత్ర శ్రవణ పారాయణం పాత్రల గళములతో అందరినీ అలరించుట
శ్రీ సాయినాథుని కృపావిశేషం .ఈ మూడవ రోజు పారాయణం వినండి .
శ్రీ సాయిసచ్చరిత్ర శ్రవణ పారాయణం విభిన్నంగా కథలో పాత్రధారుల గళములతో గత మూడు రోజులగా సాయి గురుబంధువులందరినీ విశేషముగా ఆకట్టుకున్నది .ఇది విన్నవారి స్పందన అద్భుతం .ఈ నాల్గవ రోజు పారాయణం మీకోసం .వినండి .
సాయిభక్తులందరూ మెచ్చిన ,నచ్చిన ,శ్రావ్యమైన గళములతో శ్రీ సాయిసచ్చరిత్ర శ్రవణ పారాయణం ఐదవరోజు పారాయణము మీకోసం ,మన అందరికోసం శ్రద్దగా వినండి .
శ్రీ సాయిసచ్చరిత్ర శ్రవణ పారాయణం 6 వ రోజు పారాయణం .వినండి ,వినిపించండి .ఆనందించండి .విన్నంతసేపూ మీరు ద్వారకామాయి సాయి సన్నిధిలో ఉన్నట్లుగా అనుభవం పొందండి
శ్రీ సాయి సచ్చరిత్ర శ్రవణ పారాయణం చివర 7 వ రోజు శ్రవణ పారాయణము
'సద్గురువు సిద్దుడై ఉండికూడా సాధకుని వలె ప్రవర్తించాలి '.అని శాస్త్రం చెప్పుచున్నది .
సాయి బాబా ఆ థర్మాన్ని అక్షరాలా పాటించాడు . జవహర్ ఆలీ వద్ద శిష్యునిగా ,సంత్ తుకారాం , సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ వంటి మహనీయుల హారతి గీతాలు ఆలపించినప్పుడు ,రెండు చేతులూ జోడించి భక్తితో నమస్కరించెడి వారు .
ద్వారకామాయిలో నేలపై గోనె పరచుకొని కూర్చోండిడివారు .పల్లకీ ,శ్యామకర్ణ పేరుగల గుర్రం ఉన్నా వాటిని అధిరోహించలేదు .ఇలా ఏన్నొ ఎన్నేన్నో .......... నిరంతరం శ్రీ సాయినామాన్ని జపిస్తూ ,వారి బోధలు గూర్చి చింతన చేస్తూ ,వారి రూపాన్ని ధ్యానిస్తూ వుంటే సంపూర్ణ శాంతిని పొందుతాం . (సాయిసచ్చరిత్ర -49 వ అధ్యాయము -23 వ ఓవి

పెద్దలు మూడు సాధనా పద్దతులు గూర్చి చెప్పారు .

1 నిరంతరం సాయినామ స్మరణం .
2 సాయీబోధలు గూర్చి ఆలోచించడం .
3 సాయి సగుణ రూపాన్ని ధ్యానించడం .
రెండవ సాధనా పద్ధతి అయిన సాయినాధుని ఉపదేశాలను గూర్చి ఆలోచించడం గొప్ప సాధన .
ఈ అపూర్వ సాధన ద్వారా బాబా బోధనలను కొన్నింటినైనా ఆచరించే అవకాశం ఉన్నది .
దాని ద్వారా సాయిమార్గములో నడిచి ధన్యత పొందవచ్చు .