శ్రీ గజనన విజయం - ఆరవ అధ్యాయం

సర్వం శ్రీసాయి

శ్రీ గజనన విజయం - ఆరవ అధ్యాయం  Click here for pdf

 

శ్రీ గణేశాయ నమః, మంగళ ప్రదుడైన శ్రీహరీ! నీ కృపకలిగితే అశుభాలన్నీ నాశనమై పోతాయి. ఈ విషయాన్ని యోగులు తమ అనుభవం ద్వారా తెలుసుకొన్నారు. మహాత్ముని వచనాల పై దృఢవిశ్వాసముంచి ఓ శ్రీనివాసా! అంతా మంగళప్రదం కావాలనే ఆశతో నీ గడపదగ్గర కొచ్చాను. మరి నన్ను ఖాలీగా పంపితే ఆ కళంకం నీకే అంటుకుంటుంది. అంతేకాక సిద్ధుల వచనాలు అసత్యాలుగా రుజువవుతాయి అందుచేత ఓ మాధవా! యీ మూర్ఖబాలునిపై కినుక వహింపకు! బాలుని లోటుపాట్ల బాధ్యత తల్లిదండ్రులదే కదా! ఇది గుర్తుంచుకొని మీరేంచేసినా సరే! బంకట్ లాల్ ఇంటిలో స్వామి వున్నప్పుడు ఒక చమత్కారం జరిగింది. శేగాంవ్ కి దక్షిణానవున్న పాలం లోనికి స్వామి కొంత నుండితో కలిసి మొక్కజొన్న కంకులు: తినటానికై వెళ్ళారు. పాలంలో ఒక నుయ్యి వుంది. దాని దగ్గరే ఒక పెద్ద చింతచెట్టూ వుంది. ఆ చెట్టునీడలో మొక్కజొన్నలు కాల్చటానికి అంతా కూర్చున్నారు. క్రిందినుంచి పొగ చెట్టుపైకి వెళ్లగానే దాని మీదున్న తేనెటీగలన్నీ క్రిందున్న వారిపైకి వచ్చిపడ్డాయి నాలుగు వైపులా వున్న తేనెటీగలని చూసి అందరూ అటూయిటూ పారిపోయారు. ఆపద వచ్చినపుడు అందరికీ తమ ప్రాణమే చాలా ముఖ్యం అనిపిస్తుంది కదా! అందరూ పారిపోయారు. కానీ స్వామీజీ మాత్రం తమ ఆసనం మీద అలానే నిశ్చింతగా కూర్చుండి పోయారు. ఆయన ఏమాత్రం కదలలేదు! తమ ఆసనంమీద స్వస్థచిత్తులై కూర్చొని ఆ తేనెటీగల గురించే ఆలోచించసాగారు. 'నిజం చెప్పాలంటే, ఈ తేనెటీగలూ, తేనెపట్టూ, మొక్కజొన్న కంకులూ మరి నేనూ... అన్నీ ఒకటే కదా! వాడొక్కడే ఆ భగవంతుడే అనేక రూపాల్లో వున్నాడు! అనుకుంటూ భగవంతుని యీ లీలావిలాసాన్ని చూడడంలో ఆనందనిమగ్నులయ్యారు. ఇటు తేనెటీగలన్నీ వారిపై బడ్డాయి. చూడటానికి స్వామీజీ తేనేటీగల కంబళి కప్పుకున్నట్లుగా వుంది! సిద్ధ యోగుల మహిమను ఎవరు తెలుసు కోగలరు? తేనెటీగలు స్వామీజీని ఒళ్ళంతా కుట్టేశాయి. ఐనా స్వామీజీ శాంతంగానే వున్నారు. ఇలా ఒక జాము సేపు గడిచిపోయింది. అక్కడ సురక్షితులుగా నున్న భక్తులందరకు స్వామి గుర్తుకొచ్చారు. బంకట్ లాల్ దుఃఖంతో వ్యాకులుడయ్యాడు. "నేను స్వామి నిక్కడికెందుకు తీసుకొని వచ్చాను?' అని బాధపడ్డాడు. 'నా కారణంగానే స్వామికి యీ కష్టం కలిగింది. ఇది నా దౌర్భాగ్యం." అని మరింత బాధపడసాగాడు. చివరికి ఆపదను. ఎదుర్కొనటానికే నిశ్చయించుకున్నాడు బంకట్ లాల్ బంకట్ లాల్ మనసులోని మాటను స్వామీజీ తెలుసుకొని తన లీల'ను చూపించారు. 'ఇక..... మీరు మీ చోటుకు పొండి ! నా ప్రియభక్తుడు బంకట్ లాల్ నా దగ్గరకొస్తున్నాడు. అతనినేమీ చేయవద్దు. అక్కడున్న వారిలో బంకట్ లాల్ ఒక్కడే. నిజమైన భక్తుడు. పాపం వ్యాకులుడై నాదగ్గరకొస్తున్నాడు' అన్నారు స్వామి తేనెటీగలతో. తేనెటీగలు స్వామి మాటలు విన్న వెంటనే వెళ్ళిపోయాయి ఈ 'లీల'ను బంకట్ బాల్ తన కళ్ళతో స్వయంగానే చూశారు. ఎదుట నిలబడ్డ బంకట్ లాల్ ని చూసి 'బంకట్ బలే మంచి విందునిచ్చావు యీ వేళ తేనెటీగలు నా మీద పడగానే ఈ ప్రసాద భక్తులంతా పారిపోయారేం? అందుకే బంకట్!  ఆపద వచ్చినపుడు భగవంతుడు తప్ప మరెవ్వడూ నీకు సాయపడరని గుర్తుంచుకో! ప్రసాదభక్తులు ఆపదలొచ్చినపుడు పారిపోతారే గాని నిలబడలేరు. వారిని స్వార్ధభక్తులంటారు' అన్నాడు స్వామిజీ..  కొంత సేపయిన తరువాత బంకట్ లాల్ 'స్వామి' ఏ కంపాలివాడినైనా తోడుకొని వస్తాను. మీ శరీరంలో చిక్కుకున్న తేనెటీగల ముళ్ళను (కొందాలు) తీసివేస్తారు. ఓ గురుదేవా! నేను మహాపాపిని! మిమ్మల్ని ఆపదకు గురిచేశాను. ముళ్ళు ఎన్నో మీ శరీరంలోకి చొచ్చుకు పోయాయి. స్వామీ! యీ విపత్తునుండి బయటపడటం ఎలా?' అని బాదతో అన్నాడు. అపరాధిగా మాట్లాడుతున్న బంకట్ లాల్ ని చూసి స్వామీజి 'అరె! భయపడవలసినదేముంది? కుట్టటం అనేది తేనెటీగలకు స్వభావం కదా! దాని వలన నాకేమాత్రం బాధ కలగలేదు. తేనెటీగలు కూడా ఆ సచ్చిదానంద స్వరూపుని ఒక అభిన్న రూపమేనని తెలుసుకున్నాను నేను. వాటిలో వున్న దేవుడే నాలోనూ వున్నాడు! ఒక చోటి నీరు మరోచోటి నీటికి దుఃఖాన్ని కలుగజేస్తుందా? అన్న నగ్నసత్యాన్ని విన్న బంకట్ లాల్ మాట్లాడలేక పోయాడు. ఇంత అయిన తరువాత కూడా కొంతసేపటికి ఒక కంసాలి శ్రావణంతో తమ ముందు నిలబడి వుండటం చూశారు స్వామి. నీ యీ శ్రావణం ఎందుకు పనికివస్తుంది. చూడు యీ ముళ్ళని బయటకు తీయటానికి నేనేం చేస్తానో అని తమ శ్వాసను బంధించారు. మరుక్షణంలో శరీరంలో చొచ్చుకుపోయిన ముళ్ళన్నీ బయటికి వచ్చేశాయి. ఇదంతా తమ కళ్ళారా చూసిన వారందరికి శ్రీగజాననుల దైవశక్తిలో ఏమాత్రం సందేహం లేకుండా పోయింది. కొద్ది సేపటి తరువాత మొక్కజొన్న పొట్టలు కాల్చి అందరికీ యిచ్చారు. తిని సాయంత్రానికంతా తమతమ ఇళ్ళకు చేరుకున్నారు. ఒక సారి శ్రీ స్వామి తమ గురుబంధువు శ్రీ నరసింగస్వామిని చూడటానికి 'ఆకోట్' వచ్చారు. శ్రీ నరసింగస్వామి "కోతష్య ఆలీ' అనే పేరుగల మహాత్ముని శిష్యులు. వారు మరాఠా (క్షత్రియులైననూ) జాతి వారైనప్పటికీ భగవద్భక్తి బలంవలన....

`విర్ధల' దేవునికి కంఠహారమే అయ్యారు. ఈ నరసింగస్వామి యొక్క చరిత్రగానాన్ని నా 'భక్తలీలామృతమనే గ్రంథంలో సవిస్తరంగా గానం చేసాను. మరి ఇప్పుడిక్కడ చెప్పదలచుకోలేదు. 'ఆకోట్' అనే గ్రామం శేగాంవ్ కు సుమారుగా పద్దెనిమిది కోసుల దూరం వుంటుంది. ఆశ్రిత వత్సలుడైన శ్రీగజాననులు తమ మనోవాంఛితంగా ఆకోట్ గ్రామం వచ్చారు. దానికి దగ్గరలోనే వున్న ఒక అడవిలో శ్రీ నరసింగ వుండేవారు. వారు తమ సాధనకోసం జనానికి దూరంగా ఏకాంతవాసం చేయటానికి యిష్టపడేవారు. ఆ ఘోరారణ్యం నిర్జన ప్రదేశం అవటం వలన చాలా భయంకరంగా వుండేది. అందులో వేపచెట్లూ, వటవృక్షాలూ, 'రాతాంజన' వృక్షాలూ (వృక్షవిశేషం దీని పూల కాటుక పెట్టుకున్నట్లైతే రాత్రిపూట స్పష్టంగా కనిపిస్తుంది) మొదలైన వనవృక్షాలెన్నో వున్నాయి. ఈ చెట్ల నాధారం చేసుకొని నానారకాలైన లతలూ వల్లరులూ వున్నాయి. నేలమీద గడ్డి మొలిచివుంది. రకరకాలైన పాములు ముక్తసంచారం చేస్తూండేవి. అలాటి ఘనారణ్యంలో వున్న గురుబంధువును చూడటానికి తిన్నగా శ్రీస్వామి వచ్చారు. ఒకేరకమైన మనః ప్రవృత్తులు కలవారే ఒకరినొకరు కలుసుకుంటారు. నీరు నీటితోనే కలుస్తుంది. విజాతీయ ద్రవ్యాలు మరోవాటితో కలియటం అసంభవం కదా! గజాసనులను చూడగానే స్వామి నరసింగులు ఎంత ఆనందం పొందారో వర్ణించటం కష్టం ఒకరు హరి (విష్ణువు) మరొకరు హరుడు (శివశంకరులు) వీరు తిరుగాడే పరమేశ్వరులే! ఒకరు దశరథ తనయులైన శ్రీరాముడైతే మరొకరు వసుదేవ తనయులైన శ్రీకృష్ణులే! ఒకరు వశిష్ఠులైతే మరొకరు మునిశ్రేష్ఠులైన పరాశరులే మరి! ఒకరు గంగాతటమైతే మరొకరు గోదావరి పవిత్రతటమే! ఒకరు వజ్రమైతే మరొకరు కౌస్తుభమణి ఒకరు వైనతేయులైతే మరొకరు అంజనీ పుత్రులు! అట్టివారిద్దరూ కలుసుకొనటం వలన ఇద్దరికీ అత్యంతానందం కలిగింది. ఇద్దరూ ఒకే ఆసనంమీద అంతరంగికంగా మాట్లాడుకో సాగారు. తమ తమ అనుభవాలు చెప్పుకోసాగారు. శ్రీ గజాననులు శ్రీ నరసింగస్వామితో యిలా అన్నారు. "ఓ నరసింగజీ! నువు చాలా మంచిపని చేశావు. యీ ప్రపంచంలో వుండే లోకకల్యాణం చేశావు. నేనంతా వదిలేసి యోగవిద్య నాధారంగా ఆ వచ్చిదానంద తత్వాన్ని తెలుసుకొనటానికి ప్రయత్నించాను. ఈ యోగవిద్య ఎంత గూఢమైందో సామాన్యుడు తెలుసుకొనటం కష్టం. ఇందులో ఎన్నో విచిత్ర సంఘటనలు ఎదురౌతూ వుంటాయి. అవన్నీ సామాన్యుడికి తెలిసేవి కావు. యోగ విద్యలోని అంతర్ తత్వాన్ని దాచటానికి నేను పిచ్చివాడి  .... వేషాలు వెయ్యాల్సివస్తోంది. సామాన్యుల నుండి తప్పించు కోవటానికి నేను పిచ్చి వాడినయ్యాను. ఈశ్వరతత్వాన్ని తెలుసుకొనటానికి శాస్త్రకారులు మూడు మార్గాలు చూపారు. అవి కర్మ, భక్తి, యోగము అనేవి. మార్గాలు వేరైనా లక్ష్యం ఒక్కటే అదే భగవత్ర్పాప్తి! యోగియైనవాడు తన యోగవిద్యపై పున్న అహంకారాన్ని మనసులో వుంచుకున్నట్లయితే చరమలక్ష్యాన్ని చేరలేదు. తామరాకుపై నీటి బిందువువలె యోగి నిరాసక్తుడుగా వుంటేనె సాధించడంలో తప్పక సఫలీకృతుడౌతాడు. ఓ నరసింగ స్వామీ! యీ ప్రపంచంలో యిలాటి స్థితే వుంటుంది. పతి పత్ని, కొడుకూ కూతురూ వీరి విషయంలో కూడా పూర్తిగా ఆనాసక్తులుగానే వుండాలి. నీటిలో వున్న రాయి నీటిని తనలోకి చేరనివ్వదు. అలానే యీ లోకంలో వుంటూనే నిరాసక్తులుగా వుండాలి మరి ఇలానే యీ లోకంలో వుంటూ ఏమాత్రం అపేక్ష లేకుండా వుంటూ భగవంతుణ్ణి నీ చిత్తాన్నుంచి ఏమాత్రం వేరుకానీయకు! అప్పుడు నీ కసంభవమైనది ఏదీ వుండదు నీవూ, నేను, శేషశాయియైన ఆ భగవంతుడూ అంతా ఒకటే అభిన్నులం. ఆద్వైతజ్ఞానం వల్ల జనానికి జనార్ధమునికి మధ్య ఎప్పుడూ అభిన్నత్వం వుంటుంది. ఈ విషయాన్ని తెలుసుకొన్న నరసింగజీ 'హే బంధూ! మీరు నన్ను చూడటానికి స్వయంగా రావటం నా సర్భాగ్యం! మీరు నాపై ఎంత దయ జూపారో చెప్పటానికి నా దగ్గర పదాలే లేవు. ఆకాశ్వతమైనది నష్టమైపోవటమే. యీ లోకపు అసలైన రూపం! దీని మూల్యమెంత? మధ్యాహ్నపు నీడల్ని శాశ్వతమని ఎవరనుకుంటారు? మీరు సెలవిచ్చినట్లే చేస్తాను. తమరు అప్పుడప్పుడూ ఇక్కడికి వస్తుండ గలందుకు ప్రార్ధిస్తున్నాను. ఈ లోకంలో ప్రారబ్దాన్ననుసరించే మంచి చెడులను అనుభవించాల్సి వస్తుంది. మిమ్మల్ని నన్నూ ఏకారణంగా భగవంతుడు యీ లోకానికి పంపాడో ఆ కార్యాలు తప్పక పూర్తిచేద్దాం. నేను మీకు చిన్నసోదరుణ్ణి ఇక ముందు కూడా మనం ఇలానే కలుసుకుంటామని మాటివ్వండని ప్రార్ధిస్తున్నాను. శ్రీరాముని రాక కోసం నందిగ్రామంలోని భరతుడు ఎదురు చూసినట్లుగా నేను. ఆకోట గ్రామంలో వుండి మీకోసం ఎదురుచూస్తూ వుంటాను. యోగ క్రియ ద్వారా మీరు నన్ను కలియటానికి ఒక్క క్షణమాత్రంలో రాగలుగుతారు. యోగులు కాలికి నీరు కూడా తగలకుండా క్షణమాత్రంలో మూడు లోకాల్లోనూ ముక్తసంచారం చేసిరాగలుగుతారు ఇట్టివేయోగవిద్య మరి అని వేడుకున్నారు. ఇలాటి ఆధ్యాత్మిక చర్చలతోనూ స్వవిషయాలతోనూ ఆ రాత్రంతా గడిపేశారు. ఇద్దరూ ప్రసన్న చిత్తులే! నిజానికి నిజమైన మహాత్మల ...... మధ్యనే యిలాటి చర్చలు జరుగుతూంటాయి మరి! కపటయోగులైతే ఒక చోటికి రాగానే వాదవివాదాలూ, దెబ్బలాటలు మొదలు పెడతారు. అందుచేతనే కపట సాధువులకు ఆమడ దూరంలో నిజమైన యోగులుండాలి మరి! లేకుంటే కపటులు తాము పట్టిన కుందేటికి మూడేకాళ్ళని నిరూపించటంలో ఏమైనా చేయగల సమర్థులు! ఏమైనా చిల్లుపడిన నావ, వారిలోని వారిని దరికి చేర్చగలదా? జనసామాన్యం అసలైనవాటివైపుకన్నా కపటమైనవాటివైపే ఎక్కువ మొగ్గుతుంది. మహత్తత్వం ఆశ్రమాల్లోను, జ్ఞానంలోను, కవిత్వంలోను లేదు. అది స్వానుభవంలోనే వుంది. అనుభూతిని పొందినవాడు. దొంగ బంగారానికి యిష్టపడడు. వాడు వేశ్యను గృహిణిగా చేసి కూర్చోబెట్టడు! గజాననులు నరసింగులూ ఇద్దరూ సాక్షాత్కారాన్ని పొందటం వలన తాంభికాన్ని అసహ్యించుకొనేవారు. ఎవరో ఒక పశువుల కాపరి ద్వారా మహాత్ములైన శ్రీగజాననులు నరసింగజీని చూడటానికి 'అకోట్' గ్రామం వచ్చారని జనానికి తెలిసిపోయింది. జనం ఆనందంతో నారికేళాలు పుచ్చుకొని స్వామి దర్శనార్ధం పరిగెత్తసాగారు. త్వరగా నడవాలి. గోదా భాగీరధీ నదుల సంగమం యీ అరణ్యంలో జరిగింది మరి! ఈ సంగమ ప్రయాగలో స్నానమాడి తరిస్తాను. ఈ వుత్సవాన్ని చేజేతులా జారవిడువకూడదు. అనుకుంటూ ఒకరితో నొకరు నడువసాగారు. కానీ వారి దౌర్భాగ్యంవల్ల శ్రీగజాననులు శ్రీనరసింగుల వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. శ్రీస్వామీజీ ఒకసారి తమ శిష్యులతో కలిసి సంచారం చేస్తూ 'ధరియాపూర్' అనే గ్రామాన్ని చేరారు. దానికి దగ్గరలోనే 'శివర్' అనే ఒక చిన్నపల్లె వుంది. అది చంద్రభాగానది ఒడ్డున వుంది. అక్కడ ప్రజభూషణుడనే ఒక సజ్జనుడుండేవాడు.

శ్రోతలారా! ఈ చంద్రభాగానది ఆ పండరిపురంలో వున్నదే! ఇది ఒక స్థానీయ నది మాత్రమే. ప్రజభూషణుడు నాలుగు భాషల్లో పండితుడు. అతని కీర్తి విదర్భదేశం అంతా పాకింది. ఇతడు సూర్యభక్తుడు. అతడు రోజూ చంద్రభాగానదిలో స్నానమాడి సూర్యునికి అర్ఘ్యం సమర్పించటానికి వచ్చేవాడు. ఉషః కాలంలో మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసేవాడు. ప్రజభూషణుడు చన్నీళ్ళ స్నానమే చేసేవాడు. అత్యంత నిష్ఠగలవాడైనప్పటికీ పండితులలో మంచి గౌరవం వుంది. ప్రజభూషణునికి అతని తపఃఫలాన్ని ప్రసాదించటానికే బహుశా స్వామీజీ వచ్చారేమో! స్వామి నది ఒడ్డున గల ఒక ఖాళీ ప్రదేశంలో మౌనంగా కూర్చొన్నారు. అదే సమయంలో ప్రజభూషణుడు స్నానానికి వచ్చాడు. అది ఉదయ సమయం. అరుణోదయకాంతులు నాలుగువైపులా  ప్రసరిస్తున్నాయి. కోడికూతలు వినవస్తున్నాయి. చాతక భరద్వాజ పక్షులు సూర్యునికి స్వాగతం పలకటానికా అన్నట్లు తూర్పుది శవైపు సాగిపోతున్నాయి.

అరుణోదయం కాగానే తమస్సు అంటే ఆంధకారం పండితులనుంచి, ఆపండితులు ముఖం చాటేసినట్లు తన ముఖం చాటేసింది. అలాంటి ప్రభాత వేళలో స్వామికి బ్రహ్మానందమగ్నులై నది తటాన కూర్చొన్నారు. వారి శిష్యులంతా మండలాకారంలో కూర్చొని వున్నారు. వారంతా చూడటానికి గజానను భాష్కరుని కిరణాలవలె వున్నాడు సూర్యునికి అర్ఘ్యమివ్వటానికి వచ్చిన ప్రజభూషణుడు ఎదుట కనిపించిన జ్ఞాన సూర్యుణ్ణి చూశాడు. సూర్యుని బొలిన ఆ మహాత్ముడు ఆకర్షణీయమైన కాంతితో, ఆజానుబాహులైన శరీరము కలిగి నాసికాగ్రాన తమ దృష్టిని కేంద్రీకరించి వుండడాన్ని అతడు చూశాడు. అట్టి మహాపురుషుని చూచిన ప్రజభూషణుడు అమితానందభరితురై పూజాసామగ్రిని తీసుకొని స్వామివైపు పరిగెత్తాడు. అతడు అర్థ్యాన్ని స్వామి పాదారవిందాలకర్పించి ప్రదక్షిణకూడ చేశాడు. మిత్రాయ నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగయ నమః అంటూ సూర్యస్తవనం చేసి పన్నెండుసార్లు ప్రణామం చేశాడు. తర్వాత స్వామికి హారతి పట్టాడు. సాష్టాంగ ప్రణామం సమర్పించాడు. తరువాత స్వామిని స్తోత్రం చేయటం ప్రారంభించాడు. వినమ్రుడై "నేటివరకూ నేజేసిన కొద్దిపాటి తపశ్చరణ ఫలితం తమ సాక్షార్దర్శనంవలన పొందాను. నా జీవితం ధన్యమైంది. నేటి వరకూ సూర్యమండలంలోనే వున్న సూర్యునికి అర్ఘ్యమిస్తూ వచ్చాను. కానీ నేడు అదే సూర్యభగవానునికి (జ్ఞానయోగికి) ప్రత్యక్షంగా ఆర్ఘ్యం ఇచ్చే సౌభాగ్యం కలిగింది.

 (శ్లోకం) - ఓ పూర్ణ బ్రహ్మవై జగత్తును పరిపాలించే జ్ఞానమూర్తీ! ఇలా ప్రతియుగంలో మీరెన్ని సార్లు అవతరిస్తారో? అట్టి అవతారాన్ని

దర్శించనివారు భవరోగ చింత యుక్తులౌతారు. హే గజానన గురువర్య! నాపై ప్రసన్నులై కృపాకటాక్షాన్ని ప్రసాదించు', అని స్తుతించి వారి పాదాలను స్పృశించాడు. మహాత్ములు అతనిని లేపి తన అక్కున చేర్చుకున్నారు. తల్లి బిడ్డను అక్కున చేర్చుకున్నట్లు ప్రజభూషణుణ్ణి ప్రేమా, వాత్సల్యాలతో ఆలింగనం చేసుకున్నారు. అతని మస్తకంపైన తమ కృపాహస్తాన్నుంచి 'ప్రజభూషణ్! నీకెప్పుడూ జయమగుగాక! కర్మమార్గాన్ని ఎప్పుడూ. విడువకూడదు. కర్మవిరిని ఎప్పుడూ నిరర్ధకమని అనుకోవద్దు కూడ! తామరాకుపై నీటి బిందువువలె నీవెప్పుడూ ఆసక్తిరహితుడవై వుండాలన్నది.గుర్తుంచుకో!

కర్మలు చేస్తూ ఫలాన్ని త్యాగం చేసే వానికే భవవత్ర్పాప్తి కలుగుతుంది. నిరాసక్తుడై కర్మను చేసినట్లయితే దాని ఫలితాన్ని అనుభవించనక్కరలేదు. ఇక నీవు ఇంటికి వెళ్ళు. నేజెప్పినది శ్రద్ధగా గుర్తుంచుకో. నువు ఆర్తి, పిలిచినపుడెప్పుడైనా సరే నీకు తప్పక నా దర్శనమౌతుంది అని ఉపదేశం చేసి ఒక శ్రీఫలాన్ని ప్రసాదించి శేగాంవ్ వెళ్ళిపోయారు. నిజానికి శేగాంవ్ పేరు 'శివగ్రామం' అయినా తర్వాత తరతరాలవాడుకలో ''శేగాంవ్''వాడుకలో అనే అపభ్రంశనామం దానికి మిగిలిపోయింది. అదే ఇప్పుడు విదర్భప్రాంతంలో వాడబడుతోంది. ఆ ఒక్క గ్రామంలోనే పదిహేడుగురు పాటిల్ లు (మునసబులు) వుండేవారు. స్వామీజీ శేగాంవ్ వచ్చారు కానీ, స్థిరంగా ఎప్పుడూ అక్కడ వుండనేలేదు. ఎప్పుడూ తమ ఇచ్ఛానుసారం భ్రమించేవారు.ఆకోట్, ఆకోబా,మలకాపూర్ ఎన్నెన్నో వూళ్ళు తిరిగారు నక్షత్రాలనెన్ని లెక్కించగలం? జ్యేష్ఠమాసం వెళ్ళిపోయింది. శ్రావణమాసంలో ఆంజనేయస్వామి కోవెలలో ఉత్సవాలు ప్రారంభమైనాయి. శేగాంవ్ లో ఉన్న ఆంజనేయస్వామి కోవెల చాలా ప్రాచీనమైన విశాల మందిరం. శేగాంవ్ లో వున్న మునసబులంతా ఆంజనేయస్వామి భక్తులు! మునసబు గ్రామపెద్ద అవటం వలన ఆయన ప్రభావం ఆవూరిమీదెంతైనా వుండేది. మునసబు ఏది చెయ్యమంటే వూళ్ళ వాళ్ళందరూ అదే చెయ్యాల్సి వచ్చేది. ఈ వుత్సవం ఒక మాసంరోజులు జరుగుతుంది. నిత్యమూ అభిషేకాలు, పురాణ పారాయణాలు, హరికథలూ, అన్నదానం మొదలైన ధార్మిక కార్యాలు జరిపిస్తూ భక్తులు సంతుష్టులయ్యేవారు. ఈ వుత్సవానికి ముఖ్య నిర్వాహకుడు ఖండూ పాటిల్ అనేవాడు వుండేవాడు. అతడు సజ్జనుడు.

 శ్రోతలూ యీ 'పాటిల్' బిరుదు దొంగ పులిచర్మం కప్పుకున్నటువంటిది సుమా! అందుచేత గ్రామముఖ్యుడైన పాటిలంటే గ్రామప్రజ భయపడేవారు. "గ్రామాన్నుంచి సాధించగలిగేది రావుగారివల్ల కాదుమరి!" అనే నానుడొకటి భాషలో వుంది శ్రావణమాసంలోని వుత్సవాన్ని చూడటానికి శ్రీస్వామీజీ విచ్చేశారు. స్వామి 'నేనిక యీ ఆంజనేయస్వామి కోవెలలోనే వుంటా'నన్నారు.బంకట్ లాల్ తో దీనికి నువ్వు బాధపడవద్దు, సాధువులు, యోగులు, మహత్ములు, ఫకీరులు, ఈ సంసార బంధనమైన ఇళ్ళలో వుండరా మరి! నేను పరమహంసనైన పరివ్రాజకుణ్ణయ్యే! అందుకని నేనిక యీ ఆలయంలోనే వుండదలిచాను. నువు కోరినపుడు వస్తానులే! ఈ అంతర్భావాన్ని ని నొక్కడికే చెప్పాను. జగద్గురు శంకరాచార్యుల వారు లోక కళ్యాణం కోసం ఎప్పుడూ భ్రమణం చేస్తూ వుండేవారు. మహాయోగులు మచ్చింద్రనాదులూ, జలంధరనాధులూ ఎల్లప్పుడూ అడవుల్లోని చెట్లనీడల్లోనే వుండేవారు. మహావీరుడైన రాజా శివాజీ దుష్టులైన యవనులను ధిక్కరించి హిందూసామ్రాజ్య స్థాపనం కావించాడు.శివాజీ సమర్ధ రామదాసు అతన్నెంతో ప్రేమించేవారు. ఐనా సమర్థులు శివాజీకి దూరంగా 'సజ్జనగడ్' లో నివసించేవారు.ఇవన్నీ చక్కగా విచారించిన తర్వాత గూడా నన్నింటికి రమ్మని మొండిపట్టు పట్టకు. నే నిదంతా నీ శ్రేయస్సు కోసమే. చెప్పేది! అన్నారు. వివశుడైన బంకటాల్ స్వామి మాటలకు తలఒగ్గాడు. శ్రీస్వామీజీని ఆలయంలో చూసినవారంతా ఎంతో ఆనందించారు. భాస్కర పాటిల్ ఎప్పుడూ స్వామి నంటి పెట్టుకొని వుండి వారి సేవ చేయసాగాడు. 'దాసగణూ' విరచితమైన ఈ 'గజానన విజయమనే గ్రంధము" ముముక్షువులకు యోగిపుంగవుల పాదారవిందముల సేవచేసే సన్మార్గాన్ని చూపించుగాక!

॥ శుభం భవతు ॥

॥ శ్రీ హరి హరార్పణమస్తు ॥

॥ఇది షష్టాధ్యాయము సమాప్తము ॥

 

యే మనుష్యః మాం ఆశ్రతః!

తాన్ సర్వేస్యః కర్మ వినాశనః