గజానన విజయం
ఇరువైవా అధ్యాయం

 

శ్రీ గణేశాయ నమః జయ జయ హే రుక్మిణి వరా! హే చంద్రభాగాతటివిహారా! హే! భగవాన్ యీ దాసగణూ మస్తకంపైన నీ వరదహస్తా న్నుంచవయ్యా! నీవు రాజులకు రాజువు! విశ్వసించాలనం నీచేతనే వున్నది కదా! మరి నాకే అన్నిచోట్లా యీ దుర్గతి యేల? నీవు నీ కృపాదృష్టితో నా పాపతాపాన్ని దహించివేయవయ్యా! నీ సంకీర్తనం చేయటానికి నా మనస్సును ప్రముదితోత్సాహాలతో నిండనీవయ్యా అలా కాకున్నట్లయితే నీపై వృధా దోషారోపణం అవుతుంది స్వామీ! పెద్దలకు తమ పెద్దతనానికి కళంకం రాకుండా చూసుకోవాలి కదా! కాబట్టి హే శ్యామ సుందరా! రుక్మిణీ ప్రియపతి, పాండురంగా! విశాల అంతః కరణతో నా కోరికను పూర్తికానీయవే. అస్తు! శ్రీ గజాననులు సమాధిస్తులైన తరువాత స్త్రీ పురుషులంతా 'ఇంక యీ శేగాంవ్ లో ఏమి మిగిలింది?' అనుకున్నారు. శేగాంవ్ లోని జ్ఞానసూర్యుడు, అస్తమించిన తరువాత ఇంక అక్కడ వుట్టి మట్టే మిగిలింది. సాగరం నీరింకిపోయినప్పుడు, పుష్పతరువు పూయటం ఫలించటం మానిన తర్వాత వాటివైపు వుత్సుకతో చూసేదెవరు? ఇంక శేగాంవ్ కి ఎవరైనా ఎందుకు వస్తారు? మందిరంలో భగవంతుడే లేనపుడు మందిర గుమ్మాలకు పూలమాలలు వేయటం వ్యర్ధమే కదా! కొంతమంది హృదయాల్లో యిలాటి సందేహాలు మెదలసాగాయి. కానీ యీ సందేహాలన్నీ నిరర్ధకాలుగా నిరూపించబడినాయి. ఎందుకంటే శ్రీస్వామి దివ్యజ్యోతి నిరంతరంగా అక్కడ అదృశ్యరూపంలో వుండనే వుంది కదా! ఇంద్రాయణీ ఒడ్డున శ్రీజ్ఞానేశ్వరులు 'సజీవ సమాధి' పొందారు. ఐనా, భక్తిపూర్ణమైన అంతఃకరణ గలవారికి అక్కడ వారి దర్శనం కలుగుతూనే వుంటుంది! అలానే స్వామిపైన అత్యంత భక్తి శ్రద్ధలున్న వారికి శేగాంవ్ లో నేడు కూడా స్వామి గజాననుల దర్శనం. లభిస్తుంది. ఇది నిజమే అనటానికి తార్కాణంగా ఒక సత్సంఘటనను వివరిస్తాను. 'గణపత్ కోరాడే' అనే గృహస్తు ఒకడుండేవాడు. అతడు కంపెనీ' ఏజెంటు. శ్రీస్వామిజీ సమాధిని దర్శించటం అతనికి నిత్య నియమంగా వుండేది. అతడు ప్రతిరోజూ సాయంత్రం మఠానికి వచ్చి స్వామి సమాధిని దర్శించుకొని స్తోత్రం చేసి కొంతసమయం ఆనందంగా అక్కడ గడుపుతూ వుండే వాడు. ఒకరోజున గణపతికి యిలాటి ఆలోచన వచ్చింది. "రేపు విజయదశమి, సమాధిపైన అభిషేకం చేయించి. బ్రాహ్మణులకు యధాశక్తి భోజనం చేయిద్దాం!" అనుకున్నాడు. అభిషేకానికి కావలసిన వన్నీ సిద్ధంచేశాడు. భోజనం వండటానికి కావలసిన వస్తుసామగ్రిని మఠానికి పంపాడు. అప్పుడతని భార్య "స్వామీ! యిదంతా ఏమిటి. డబ్బు ఖర్చుపెట్టే సమయంలో మీరు ముందూ వెనకలు ఆలోచించటంలేదు. రేపు విజయదశమి ! సంవత్సరంలోని పెద్ద పండుగ! మీ పిల్లలకు కొత్తబట్టలూ, నగలూ తీసుకురండి. అభిషేకానికి, బ్రాహ్మణ భోజనాలకూ డబ్బు ఖర్చు చేయటం అంత మంచిది కాదు! భగవంతుని దయవలన మనకి నలుగురు కొడుకులు కలిగారు. కానీ నా ఒంటిమీద సౌభాగ్య లక్షణమైన ఒక్క వస్తువు కూడా లేదాయె! అలంకారా లేవి? పుని స్త్రీనే నేను! సంసారులకి వేం బుద్ధులు? గృహస్థులకు ధనసంచయం అవసరం!" అంది. తన పత్ని చేసిన హితోపదేశం గణపత్ కి మతరామూ రుచించలేదు. అతడు ప్రపంచానికన్నా, పరమార్ధాన్నే మిన్నగా ఎంచేవాడు కదా మరి! అదే సమయంలో అతని భార్యకు ఒక కల వచ్చింది. కలలో స్వామీజీ యిలా అన్నారు. "నీ పతిని బాధించకు. అతను చేసేది చెయ్యనీ! ఒసే! పిచ్చిదానా! అశాశ్వతమైన వాటికోసం ప్రాకులాడటం అవివేకం! నీడని పట్టుకొనే ప్రయత్నం వ్యర్ధమేగా! భూమిమీద పుట్టిన ప్రతివాడు ఇక్కడి వస్తువుల్ని ఇక్కడే వదలిపోవాల్సి వుంటుంది. కూడా వచ్చేవి కేవలం పాప పుణ్యాలు మాత్రమే! అభిషేకం, బ్రాహ్మణ భోజనాలు చేయించటం యివి పారమార్ధిక పుణ్య సంచయన కార్యాలు. వీనికోసం ఖర్చుపెట్టేది వ్యర్ధం కాదు. ఇది పోలంలో విత్తులు నాటినట్లే సుమా! కాబట్టి కన్యా! పతి మార్గానికి అడ్డురాకు!" అన్నారు స్వామీజీ. తెల్లవారగానే ఆమె తన పతికి కలలోని వృత్తాంతాన్నంతా చెప్పింది. అంతా విని గణపత్ రావు హర్షితుడయ్యాడు. "చూశావా! స్వామీజీ చమత్కారం! నేటినుంచి మనస్సులోనుంచి వికల్పాన్ని వదిలెయ్యి. సంతతి, ధనం మొదలైన ప్రాపంచిక విషయాలను గురించిన ఆలోచన మనస్సులో నుంచి దూరం చేసుకో వీటి యజమాని శ్రీస్వామీజీయే! ఆస్తు! గణపతిరావు స్వామీజీని భక్తితో పూజించాడు. దీనికోసం చాలా ఖర్చుచేశాడు. గణపతిరావుకు శ్రీస్వామి అంటే ముందునుంచే ఎంతో భక్తిశ్రద్ధలు వున్నాయి. 'లక్షణ హరిజాంజుళ్'కి కూడా ఇలానే నమ్మకం కుదిరింది స్వామిమీద, 'బోరీబందర్ స్టేషన్'లో యిలా జరిగింది. లక్షణ్ స్వామికి భక్తుడే! పనిమీద బొంబాయి వెళ్ళివున్నాడు. ఇంటి పరిస్థితుల వలన అతడెంతో దుఃఖితుడై వున్నాడు. పని అయిన తరువాత ఇంటికి రావటానికి 'బోరీబందర్' స్టేషనుకు వచ్చాడు. అప్పుడతనికొక 'పరమహంస' కనిపించారు. ఆయన ఆజానుబాహుడు! ఎత్తయిన విగ్రహం. దృష్టిని నాసికాగ్రానే కేంద్రీకరించి నోటితో ఓంకారాన్నుచ్చరిస్తున్నారు. ఆయన లక్ష్మణ్ "నీవు గజాననుల శిష్యుడివి కదా మరి అలా ఎందుకు దుఃఖితుడవౌతున్నావో నా కర్ధం కావటంలేదు! అమరావతిలోని నీ యింటిదగ్గర పుణ్యతిథి రోజునే నాలుగు వందల బ్రాహ్మణులకు భోజనాలు పెట్టడానికి సిద్ధంచేశావు. సమయంలో 'గోపాలరావు పేఠ్ కర్', 'బాపట్ మాస్టర్'లకు ఏమైందో దాన్ని గురించి కొంచెం యోచించు! బాపటికి పుత్రశోకం కలిగినా నియింట ప్రసాదం కోసం వచ్చారు. నిజమే కదా! 'పేరకర్' బ్రాహ్మణ భోజనాలనెందుకు చెయ్యలేకపోయారు? అరే! స్వామీజీ వారిద్దరికీ కనిపించారు. ఇద్దరికీ కలలోనే వుపదేశం చేశారు. అందుకే వారిద్దరూ ప్రసాదం స్వీకరించటానికొచ్చారు. విషయం ఇంత త్వరగా ఎలా మరిచిపోయావు? అన్నారు. ఇన్ని సత్యాలనూ కళ్లతో చూచినట్లు చెపుతున్న యీయన ఎవరై వుంటారు? అన్న సందేహం కలిగింది లక్ష్మణికి ఏమీ అర్ధంకాలేదుకూడా! సన్యాసికి లక్ష్మణ్ వినమ్రుడై నమస్కరించాడు. ఏమి ఆశ్చర్యం! వారు కళ్ల ఎదుటే బోరిబందర్ స్టేషన్లో అదృశ్యమయ్యారు! సంఘటన తరువాత 'లక్ష్మణ్ ఇంట్లో ఎప్పటిలా కలిసిమెలిసి వుండసాగాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరమూ పుణ్యతిథి'ని జరపటం ప్రారంభించాడు. అవధూతలైన 'జయరాం షేడ్ కర్'కి 'రాహేత్ గాం' అనే గ్రామంలో శ్రీస్వామి సన్యాసి రూపంలో దర్శనమిచ్చారు. మాధవ మార్తాండ జోషి' అనే పేరు కలవాడు స్వామి భక్తుడు. అతడు 'కళంబ కసూర్' అనే గ్రామానికి స్థలాలు కొలవటానికి వచ్చాడు ఒక సారి. ఇతడు ప్రభుత్వ రెవెన్యూ ఆఫీసరు" అతనికి కూడా స్వామి గజాననుల పై అత్యంత భక్తి వుండేది. రోజంతా చేయవలసిన పని పూర్తయింది. సాయంకాలం శేగాంవ్ వెడదామనే కోరిక కలిగిందతనికి ఇవాళ గురువారం రోజు స్వామి దర్శనానికి శేగాంవ్ వెడదాం అనుకొని అతడు తన బంట్రోతుకు అజ్ఞలిచ్చాడు. "ఎడ్లబండిని తయారు చెయ్యి. యిప్పుడే శేగాంవ్ వెడదాం. రాత్రికి అక్కడుండి మరునాడు వుదయం తిరిగి వద్దాం!" అన్నాడు. దానిమీదట బంట్రోతు కుతుబుద్దీన్, దొర! పైన ఆకాశం చూడండి. మేఘావృతమై వుంది. 'మన్ నది' లో నీరు కొంచెమే వుంది. అవి కూడా మురికిగా వున్నాయి. కాబట్టి వెళ్ళి విషయం మరోసారి ఆలోచించండి! అన్నాడు. 'అరే! నదిని చిటికెలో దాటిస్తాం? వెళ్ళి ఎడ్లబండి (ధమణి) ని సిద్దంచెయ్యి, తప్పించుకునే వుపాయాలు యింక వెతక్కు! అన్నాడు జోషిపాపం నౌకరుకదా? బండిని తీసుకొచ్చి ఎదురుగా నిలబెట్టాడు. జోషి అందులో ఎక్క శేగాంవ్ వైపు బయలుదేరాడు. ఎడ్లబండిని నదిలో దింపాడు. ఇంతలో అనుకోకుండా నదిలో నీరు ఎక్కువై అవతలి తీరానికి వెళ్ళటం అసంభవ మనిపించింది. జోరుగా గాలి దుమారం లేచింది. ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. ఒకేసారి 'మన్ నది'లో వరద వచ్చేసింది కుండపోత వర్షం ప్రారంభమైంది. తుఫాను -గాలిచేత రైతుల ఇళ్ళ కప్పులు ఎగిరిపోసాగాయి. ఉత్పాతాన్ని చూసిన సిపాయికుతుబుద్దీన్ 'సాబ్ మనమిక్కడ జలసమాధి కావలసిందే!' అన్నాడు. మాధవజోషి కూడా మనస్సులో భయపడ్డాడు. స్వామిని ప్రార్ధించసాగారు. "హే! సమర్థ గజాననా! మమ్మల్ని యీ ఆపదనుంచి రక్షించండి! మీరు తప్ప అన్యులెవరూ మమ్ము రక్షించేవారు లేరు! సముద్రంలో మునుగుతున్న ఓడను సిద్ధయోగులు తమ చేతి నందించి అందులోని వారి నందరినీ రక్షించారని పురాణ కథవిన్నాం. హే! బ్రహ్మవేత్తా! కరుణాఘనా! యీ ఆపదనుండి కాపాడండి! అని ప్రార్ధిస్తూనే వున్నాడు. ఇంతలో ఎడ్లబండిలోకి నీరు రావటం ప్రారంభించింది. దాంతో ఎడ్లు బెదిరిపోయాయి! జోషీజీ ముందుకు నడిచాడు. సిపాయితో నువ్వు నావెనకేరా! మనస్ఫూర్తిగా (సిద్ధయోగి) మహాత్ముని సంకీర్తనం చెయ్యి! చింతించకు. భగవంతుడే మనని రక్షిస్తాడు. అని జోషీజీ స్వామి నట్లు ప్రార్ధించాడు. హే! స్వామీ మీ శక్తి ఆగాధం! మమ్మల్ని రక్షించనన్నా రక్షించండి! లేకపోతే యిందులో ముంచెయ్యండి. మీరేది చేద్దామనుకుంటే అదే చేయండి' అలా అనిపగ్గాలు వదిలేశాడు. ఇద్దరూ కళ్ళు మూసుకున్నారు. ముందు యిలా అయింది! ఇలాంటి ఆపదలోవున్న ఎడ్లబండి భగవత్ కృపవలన రెండవ ఒడ్డుకు చేరటమే గాక శేగాంవ్ వెళ్ళే మార్గంలో నిలబడింది. కళ్ళు తెరచి యీ ఆశ్చర్యకరమైన చమత్కారాన్ని చూసి యిద్దరూ ఎంతో సంతోషించారు. సిద్దయోగియొక్క యీ నిరంకుశ శక్తిని చూడండి! వరదవంటి ఆపదనుంచి తన భక్తుల్ని రక్షించారు. జోషీజీ తరువాత రాత్రికి శేగాంవ్ వచ్చాడు. సమాధిని దర్శించుకున్నారు. పల్లకినూరేగించే కార్యక్రమంలో పాల్గొన్నాడు. మరసటి రోజున జోషీజీ దానధర్మాలు చేశాడు. వెళ్ళేటప్పుడు బ్రాహ్మణ భోజనాలకై బాళాభావుడు జోషీజీ ఎంతో ధనాన్నిచ్చాడు. బాలాభావూకి జరిగిన సంఘటన గూర్చి చెప్పాడు. " ఆపదనుంచి నేను బ్రతికి బయటపడ్డాను! బ్రాహ్మణులకు నా తరపున భోజనాలు ఏర్పాటు చేయించండి. నాకు మరి సెలవు లేదు! కాబట్టి పనికి తిరిగి వెళ్ళిపోవల్సిందే!" అని జోషీజీ సమాధిని మరోసారి దర్శించుకొని వెళ్ళిపోయాడు. 'హింగణి' నివాసి యాదవ్ గణేశ్ సుబేదార్ అనే సజ్జనులొకడు వర్ణాత ప్రాంతంలో పత్తి వ్యాపారం చేసేవాడు. ఒక సారి అతనికి వ్యాపారంలో పదివేల నష్టం వచ్చింది. దానితో అతడు చింతితుడూ, దుఃఖితుడూ అయ్యాడు. ఐనా వ్యాపారం విడిచి పెట్టలేడుకదా! వ్యాపారంలో లాభం వస్తుందనే ఆశను అతడు వదిలేశాడు. కానీ ప్రయత్నిస్తూనేవున్నాడు. ఖాళీగా లేకుండా వ్యాపారం చేస్తూనే. వున్నాడు. పనిమీద వాగ్దావచ్చి 'వినాయక్ అసిర్ కర్' అనే వానియింట ఒకసారి మకాం వేశాడు. ఇంతలో ఒక బిచ్చగాడు బిచ్చం అడుక్కుంటానికి వచ్చాడక్కడికి అతడు బీదవాని వేషంలో వున్నాడు. చేత నోక పెద్దకర్ర, నెత్తిన ఒక మాసిపోయిన ఉన్ని టోపీ ఉన్నాయి. వృద్ధాప్యం వలన శరీరం వణుకుతోంది. వాణ్ణి చూస్తూనే 'అసిరికర్' క్రోధితుడయ్యాడు. వాడితో వెనక్కెళ్ళు! అక్కడ నీకు బిచ్చం దొరుకుతుంది. ముందుకు రాకు అన్నాడు.. ఐనా యజమాని మాటలు వినపట్లుగా వరండాలోకి వచ్చి 'యాదవ'కి దగ్గరగా కూర్చున్నాడు. కొంచెం బిచ్చం వెయ్యండి' అని తన బిక్షాపాత్రని 'యాదవ్ జీ' ముందుంచాడు. 'వీడెంత సిగ్గుమాలినవాడు! వద్దంటున్నా దగ్గరకొచ్చి కూర్చున్నాడు' అనుకున్నాడు మనసులో అతణ్ణి కొంచం పరికించి చూస్తే అతడు శేగాంవ్ లోని రాజయోగి శ్రీ గజానన స్వామివలె కనిపించాడు యాదవ్ కి! తేజస్సు కలిగిన కళ్ళు, స్వామివలె స్వచ్ఛమైన మాట! కానీ యితణ్ణే శ్రీ గజాననులు అనుకుందామంటే, వారు శాంతించి చాలాకాలమైందికదా? మరి ఋప్పుడెలా కనిపించగలరు? ఏమైనా కానీ యితణ్ణి శ్రీగజాననులనుకొని కొన్ని పైసలెందుకివ్వరాదు?" బిచ్చగాడు ఇచ్చిన పైపలు తీసుకొని గజాననస్వామి కోసం యింకొన్ని పైసలిస్తే బెల్లం ప్రసాధంగా మంచి పెట్టబడుతుంది కదా? బెల్లం ప్రసాదం పంచుతానని యిప్పటికెన్నిసార్లు మొక్కవు. కానీ నేడు నువ్వు ముందువెనకాడటం సహించేది లేదు. నీకు వ్యాపారంలో పదివేల నష్టం వచ్చింది. దాన్ని ఆలోచించే ఇంకా కొంత ధనాన్ని యివ్వు! ఊం, తియ్యి జేబులోంచి పాకెట్టు! అన్ని యిలా అన్నాడు. "నువ్విచ్చిన దానితో నేను సంతుష్టుడ నన్వలేదు? ఇంకా కొన్ని రూపాయలివ్వు యాదవ్ యింకా కొంత పైకాన్ని బికారి చేతిలో వుంచాడు. ఇంతలో వినాయక్ అసిలేకర్ ఏదో పనిమీద లోపలికి వెళ్ళాడు. ఆసిర్ కర్ వరండాలో యాదవ్ ఒక్కడే మిగిలిపోయాడు. అప్పుడా బికారి "గజానన స్వామిని గురించి నీకు అనుమానమెందుకు? బట్టలు విడిచి నాఎదుట నిలబడు. నీ శరీరం పైన నా దృష్టి పడేసి, నీ రోగం అంతా ఇట్టే మాయమౌతుంది. అరే! నువ్వు నాకు కొడుకు వంటి వాడిని. నా ఎదుట సిగ్గు పడటం ఎందుకు?" అలా అని యాదవ్ వెన్నుమీద చేత్తో రాశాడు. తరువాత ప్రేమతో అతని శరీరాన్నంతా తన చేత్తో నిమిరాడు. ఇంతలో ఆసిర్ కర్ బయటి కొచ్చాడు. యాదవ్ రావ్ నుంచి డబ్బుతీసుకొని బికారి వెళ్ళిపోయాడు. అతణ్ణ ఎంతో వెతికాడు కాని ఫలితం లేకపోయింది. కొంత ఆలోచించిన మీదట ' బికారి రూపంలోని వారు శ్రీ గజాననులే అనిపించింది. 'ఒకవేళ వారు శ్రీస్వామియే అయివుంటే, నా వ్యాపారంలో నేడు తప్పకుండా లాభిస్తుంది!" అని మనస్సులో ఆలోచించసాగాడు. ఇంతలో యాదవ్ జీ ప్రత్తి బళ్ళు అన్నీ ఎంతో ఎక్కువ ధరకే అమ్ముడు పోయాయి! దీంతో యాదవ్ జీ ఎంతో ఆనందించాడు. బికారి రూపంలో వచ్చి శ్రీగజాననులే నా కోరిక తీర్చారని స్పష్టంగా తెలుసుకున్నాడు. భక్తులలో ధృఢనిష్ఠ వున్నట్లయితే, స్వామీజీ నేడుకూడా వారిని రక్షిస్తారు! భావూ రాజారాం కబర్ ఖాంగాంలో డాక్టరుకదా! అతనికి 'తల్హారా' కు బదిలీ అయింది. అందుచేత స్వామి దర్శనార్ధం తన కుటుంబంతో ఖాంగాం మంచి బయలుదేరాడు. సాయం సమయంలో వారంతా శేగాంవ్ చేరారు. దర్శనంకోసం వారు ముందుకు వెళ్ళసాగారు. ఇంతలో మఠాధిపతియైన భాళాభావూ ప్రార్ధన అయిన తరువాత అతనితో ప్రసాదం తీసుకొని వెళ్ళ మన్నాడు. ఇవాల్టి వరకూ ప్రసాదం తీసుకోకుండా ఎప్పుడూ వెళ్ళలేదు. మరి యివాళ నీ మనస్సులో యిలాటి ఆలోచన ఎందుకొచ్చింది! అన్నారు. ఆధీకాక నేడు ఉత్పాతదినం, అశుభముహూర్తం అంటారు. అన్నాడు భావు దాన్ని సమ్మతించాడు. 'నాకిప్పుడు చాలా ముఖ్యమైన పనివుంది. రాత్రికి ప్రసాదం తీసుకొని వెడతాను. నేడు నన్నుండమని అనవద్దు." అన్నాడు. భోజనం చేసి డాక్టరు తన కుటుంబంతో సహా రాత్రే ఎండ్లబండిలో వెళ్లిపోయాడు. రాత్రి ఘనాంధకారంలో నిండివుంది, పతివియోగాన్ని భరించలేక శోశిస్తున్నట్లుగా వుందారాత్రి! ఇంతలోనే చమత్కారం జరిగింది. బండివారు తల్హారా వెళ్ళే దారి మరచిపోయాడు. దారి ఎవరివైనా అడిగి తెలుసుకోవటానికి ఎదురుగా ఎవరూ కనపడలేదు. దారి చాలా చిన్నది. దారికి రెండువైపులా ముళ్ళచెట్లు వుండటం వలన అవి గుచ్చుకుంటున్నాయి. బండి చెఱువు గట్టున నిలబడింది. పరిస్థితిని గ్రహించిన బండివాడు అయ్యా! మనం దారి తప్పాము అన్నాడు. ఇది చూసిన కబర్ కి ఏమీ తోచలేదు. అతడు క్రిందికి దిగి చూస్తుంటే ఎదుట విచిత్రంగానూ, ఎప్పుడూ చూడనిదీ కనిపించింది. బండివాడి మీద మండిపడి వాణ్ణి దుర్భాషలాడాడు కూడా! ''అదే! నువ్వు తెలహరా' వాడివేకదా అని నీ బండిని కట్టించుకున్నది. మరి నువ్వు మమ్మల్ని యీ నిర్జన ప్రదేశంలోకి తెచ్చి పడేశావేమిటి? వచ్చేటప్పుడు. తప్పతాగి వచ్చావా? దారి కూడా తెలియకుండా పోయింది నీకు? దారిలో నీకు నిద్ర వచ్చిందా ఏమిటి? నీకు తెలియకుండానే ఎడ్లు దారి తప్పాయా!

తెలహరాకు దారి నీకు తెలిపిందే కదా! మరి నీ బండి తప్పుడు దారికెలా వచ్చింది?" అన్న భాపూ కటువచనాలు విని, పాపం బండివాడు "సాబ్! నన్నెందుకు తిడతారు? నాచేత అపరాధమూ జరగలేదు. నే నెప్పుడూ తెలహారా నుంచి బండిని తెస్తూ వుంటాను. నాకు దారి చక్కగా తెలిసినదే. కాబట్టి సమయంలోనైనా వచ్చిపోతూ వుంటాను, ఎడ్లు కూడా అటూ ఇటూ పోలేదు మరి! అవి తిన్నగానే నడుస్తున్నాయి. ఎదురుగా యీ చెఱువును చూసి ఆగిపోయినాయి! దారి తెలహారాకు వెళ్ళేదైతే కాదనిపిస్తోంది?" అన్నాడు. భాపూకబర్ మనస్సులో అనుమానం కలిగింది. "ఇది స్వామి చమత్కారమేమోనని" ఎందుకంటే నేను స్వామి ప్రసాదం స్వీకరించకుండానే వచ్చేశాను. భాళాభావు చేసిన విన్నపాన్ని నేను విననేలేదు కాబట్టి నేను దారితప్పాను. ఇప్పుడు సరియైన దారి ఎవడు చూపుతాడు?" అనుకొని అతడు ప్రార్ధించసాగాడు. "హే! గజాననా! భయంకర కాననం నుంచి నన్ను రక్షించేదెవరు? మీరే మమ్ము రక్షించేవారు" అనేలోగానే చెఱువు ఆవలి గట్టునే ఎడ్ల మెళ్ళో కట్టిన మువ్వల మోతలు వినపడ్డాయి డాక్టరుకి దాంతో అతనిలోని భయం కొంచెం తగ్గింది. బండివానితో "ఇక్కడి నుంచి దారి ఎంతో దూరం లేదనుకుంటా! మువ్వల చప్పుడు వినిపించే వైపు బండిని తోలు! అనగానే బండివాడు అలానే చేశాడు. అతి కష్టంమీద బండి మళ్ళీ దారిలొ పడింది. డాక్టరు వాకాబు చేయగా అది శేగాంవ్ పోలిమేరలే అని తెలిసింది. అప్పుడు డాక్టరు బండివానిని బండి శేగాంవ్ వైపు తిప్పమన్నాడు. అరుణోదయ సమయానికి కబర్ మఠానికి వెళ్ళి బాళాభాపూకు రాత్రి జరిగిందంతా చెప్పాడు. అంతావిని అయిందేదో మంచిదే అయింది. స్వామి నిన్ను కుముహూర్తంలో (వ్యతిపాతం) ముందుకు వెళ్ళన్విలేదు. కాబట్టి యివాళ ప్రసాదం తీసుకొని రేపు తెలహరా వెళ్ళండి భక్తుడు ప్రసాదాన్నెప్పుడూ తిరస్కరించకూడదు స్వామీజీకి నీవు నిజమైన భక్తుడవు కాబట్టి నిన్ను .. తిరిగి తీసుకొని వచ్చాడు. ప్రభు కృపలేనిదే మానవ సంకల్పాలు పూర్తికావు కదా! సిద్ధయోగుల మనస్సులో వున్నదే సఫలమౌతుంది? కాబట్టి వారిపై నమ్మకాన్నుంచి మానవుడు నిశ్చింతగా వుండాలి" అన్నాడు భాళాభావూ రెండవరోజు ప్రసాదాన్ని తీసుకొని భాపూకబర్ తెలహరా వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. ఇక ముందున్న విషయాన్ని జాగ్రత్తగా ఆలకించండి! 'భావసార్' జాతివాడైన 'రతన్ సా' అనే ఒక సజ్జనుడుండేవాడు. అతని కొడుకు 'దినకర్' ఒక్క సంవత్సరం వయస్సు కలవాడు. వాడికి వ్యాధి వచ్చింది. దాంతో వాడు రోజు రోజుకి క్షీణించ సాగాను. ఒట్టి ఎముకలే కనిపిస్తుండేవి పెద్ద పెద్ద వైద్యులు కూడా రప్పించ బడ్డారు. వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోయారు. పిల్లవాడు ఏడ్చినవాడు ఏడ్చినట్లే వుండేవాడు. పాలు త్రాగటం కూడా మానేశాడు. జ్వరం వుండేది. వైద్యుడు పిల్లవాడు బ్రతకటం కష్టమని ధైర్యంగా వుండమని చెప్పాడు. ఆలోచన కలవారు. సముద్రానికి అడ్డంగా వంతెన కట్టాలనుకోరు! వైద్యరాజు కూడా ఓడిపోయానన్నాక 'రతన్ సా' దుఃఖించసాగాడు. తరువాత మనస్సులో కొంత ఆలోచించుకున్నాడు. "పిల్లవాడు చివరి క్షణాల్లో వున్నాడు. కాబట్టి చివరి ప్రయత్నం ఇంకొకటి ఎందుకు చేయకూడదు? అనుకున్నాడు. కుర్రవాడు క్షణాల మీదున్న సంగతి ఇంటి వాళ్ళందరికీ తెలిసిపోయింది. వాళ్ళంతా గుండెలు బాదుకుంటూ రోధించసాగారు. పిల్లవాడి కాళ్లూ చేతులూ చల్లబడసాగాయి. కళ్ళలోని కాంతి తగ్గిపోసాగింది. నాడీ అందటం లేదు! అలాటి సమయంలో 'రతన్ సా' పిల్లవాణ్ణి ఎత్తుకొని స్వామీజీ సమాధి దగ్గర వుంచాడు. పిల్లవాడు యీ రోగంనుంచి బ్రతికి బయట పడ్డట్టయితే ఐదురూపాయల ప్రసాదాన్ని పంచుతాను' అని మ్రొక్కుకున్నారు. 'స్వామీ! మీరు ఇతరులందరి కోరికలూ తీరుస్తూ వుంటారు కదా! నేను మీవాణ్ణే! నా నుండి ముఖం తిప్పేసుకోకండి! నా బిడ్డ మీ గుమ్మంలో మరణిస్తే మొత్తం విదర్భ ప్రాంతం అంతా మీ పేరుకు కళంకాన్నాపాదిస్తుంది. హే! స్వామీ! గజానవా మీ చరణాలు అమృతంతో సమానమైనవని అంతా అంటారు! కాబట్టి నన్ను కూడ కృపజూడండి.నా బిడ్డ బ్రతకనట్లైతే మీ పాదాల దగ్గరే నా తలబద్దలు కొట్టుకుంటాను అని మనస్సులో నిశ్చయించుకున్నాడు. హే! మహాపురుష గజాననా! మీ అమృత తుల్యమైన దృష్టిని నా బిడ్డపైన ప్రసరించనీయండి! నన్ను కష్టపెట్టకండి!" అని వేడుకున్నారు. కొంతసేపు అలానే గడిచిపోయింది. తరువాత యీ విధమైన చమత్కారం జరిగింది వ్యాధి గ్రస్తుడైన బిడ్డడు కాళ్ళూ చేతులూ ఆడించటం మొదలు పెట్టాడు. వాడి ఆడటం మొదలు పెట్టింది. తమ కళ్ళతో చూచినవారంతా ఎంతో ఆనందించారు. స్వామీజీ కృపకలిగినపుడు దుఃఖం ఎటు పోతుందో తెలియదు! అరుణోదయం అయినపుడు చీకట్లు నిలుస్తాయా! కొద్ది రోజుల్లోనే పిల్లవాడు ఆరోగ్యవంతుడయ్యాడు. శుద్ధ అంతఃకరణతో మ్రొక్కితే, అవి తప్పక ఫలిస్తాయన్నది సత్యం! ' దాదా సాహెబ్ కోల్హాట్' యొక్క రాజా అనే పుత్రుడు కూడా శ్రీస్వామి యొక్క కృప ఆశీర్వాద ఫలమే! సిద్ధయోగుల విలువ ఎంతో చెప్పరానిది. రామచంద్ర పాటిల్ కి పద్దెనిమిదేండ్ల యౌవన వతి 'చంద్రభాగ' అనే కూతురుండేది? ఆమె అత్తల్లు లాడేగాంలో వుండేది.

 

"సరియైన సమయానికే ఆమె గర్భవతి అయింది. సమయంలో ఆమె కష్టపడాల్సి వచ్చింది. స్త్రీలు ప్రసూతి బయట పడటం మరొక జన్మ ఎత్తినట్లే! ఎంతో కష్టంగా ప్రసూతి కష్టం గట్టెక్కింది. కానీ తరువాత చంద్రభాగాకు జ్వరం వచ్చింది. అదేదో కొత్తరకం జ్వరం! మామూలు జ్వరం కాదు. కూతురికి వైద్యం చేయించటంలో తండ్రి తక్కువేమీ చేయలేదు. వైద్యులు డాక్టర్లూ కూడా ఏమీ చేయలేకపోయారు. మందుల వలన జ్వరం కొంచెం తగ్గింది. కానీ పూర్తిగా ఆరోగ్యం కోలుకోలేదు. చంద్రలాగా మాటిమాటికి అస్వస్థురాలౌతూ వుండేది. అందుచేత ఆమె తండ్రి పరీక్ష చేయించటానికి ఆమెను అకోలా తీసుకొని వెళ్ళాడు. కొందరు క్షయ అనీ, మరికొందరు మరొకటని రోగాన్ని గురించి చెప్పసాగారు. ఒకరు చెప్పింది. మరొకరితో కలవలేదు. పాటిల్ ఆమెను అనేక చోట్ల చూపించి విసిగిపోయాడు. తరువాత మాఅసలైన వైద్యులు శ్రీ గజాననస్వామియే! అనుకున్నాడు. 'అమ్మాయిని. రక్షించినా తీసుకుపోయినా వారిదే భారం! అనుకుని శ్రీస్వామీజీ చరణామృతం త్రాగిస్తూ, వంటికి విభూతిని వ్రాయటం మొదలు పెట్టాడు. అతనికి స్వామిపైన ప్రగాఢమైన భక్తి వుండేది. ఉపాయం వలన ఆమె క్రమక్రమంగా కోలుకోసాగింది. ఆమెకు ఇంతకుముందు పక్క మీదనుంచి లేవటానికి కూడా ఓపిక వుండేది కాదు కానీ యిప్పుడు మెల్లిగా నడిచి స్వామి దర్శనార్థం మఠానికి నడిచి వస్తోంది. ఇదంతా స్వామి తీర్థమూ, విభూతి, యొక్క ప్రభావమే! నిష్ణావంతులైన భక్తులకు భగవత్ప్రప్తి తప్పక కలుగుతుంది! ఉపాసకునికి తన ఉపాస్యుని మీద దృఢ భక్తి విశ్వాసాలు వుండటం -ఎంతో అవుసరం! రామచంద్రుని భార్య జానకాబాయి సులక్షణ అయినా, కర్మఫలాన్ని అనుభవించాల్సి వచ్చింది. వాతవికారం వలన ఆమె కడుపులో పొట్లు రాసాగాయి. మందులు వాడటం వలన ఆమెకు కడుపునొప్పి కొద్ది రోజులు వచ్చేది కాదు. మళ్ళీ కొన్నాళ్ళకు వచ్చేది నొప్పి ఇలా చాలా రోజులు గడిచాయి. క్రమంగా వాతవికార ప్రభావం మెదడు మీద పడనారంభించింది. ఆమె ఆలోచనా శక్తి క్షీణించి పోయింది. అందువలనే ఆమె పిచ్చిదానిలాగా వుండేది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ వుండేది. ఒకప్పుడు తినకుండానే నిద్రపోయేది. ఒకప్పుడు తినటం ప్రారంభిస్తే అదే పనిగా ఉంటూనే వుండేది. ఇది చూసిన వాళ్ళు కొందరు యీ మెకు భూతం పట్టిందని, మరికొందరు చేతబడి చేశారని అనేవారు, ఊళ్ళోని పెద్దవాళ్ళతో ఎంతోమందికి విరోధం వుంటుంది. అలాటి శత్రువులు వారిని ఎదుట ఏమీ చేయలేక చేతబడులు చేసే వారి పగ తీర్చుకుంటారు మేరి! పాటిల్ వూళ్ళోని పెద్ద ధనవంతుడే అతడు ఆపదలో వున్నాడని తెలిసి డాంబికులు అతణ్ణి మోసం చెయ్యాలనుకున్నారు. ఏదో ఒక మిషమీద అతని యింటికి వచ్చి ఎందరో డబ్బు పట్టుకు పోతుండేవారు. భార్య వైద్యానికి చేయవలసినదంతా చేశాడు. అయినా ప్రయత్నాలన్నీ వ్యర్ధమే అయ్యాయి. చివరికి ఒక ఉపాయం చేయటానికి నిశ్చయించుకున్నాడు. 'మాకు వైద్యులు శ్రీ గజాననులే! వారెలా చేయదలుచుకుంటే అలానే చేయనీ! నా భార్య వారికి కొడలేకదా! కాబట్టి ఇక అన్యవుపాయాలు అక్కర్లేదు! అని అనుకొని తన భార్యతో "రేపటి నుంచి ఉదయం స్నానం చెయ్యగానే మఠానికి వెళ్ళి స్వామి సమాధికి ప్రదక్షిణం చేసే నియమాన్ని పాటించు" ఆన్నాడు. ఆమె పతిజజ్ఞను శిరసావహించింది. నియమంగా రోజూ సమాధికి ప్రదక్షణ చేసి వస్తూవుండేది. ఆమె యీ సేవ వ్యర్ధం కాలేదు. ఆమె శ్రద్ధాభక్తుల్ని చూసి స్వామి ప్రసన్నులయ్యారు. కొద్దిరోజుల్లో వాతవికారం తక్కువై క్రమంగా మరి కొద్ది రోజుల్లోనే పూర్తిగా ఆరోగ్యవంతురాలైంది. సిద్ధయోగులకు చేసిన సేవ లెప్పుడూ వ్యర్ధం కావుగా మరి! శ్రీస్వామి గజానముల తరువాత భాళాభావూ మఠాధిపతి అయ్యారు. ఆయన వలన కూడ కొన్ని చమత్కారాలు జరిగినాయి. బాళాభావూ వైశాఖ శుద్ధ షష్ఠి తిథినాడు శేగాంవ్ లోనే వైకుంఠవాసుడయ్యాడు. అతని తరువాత 'నారాయణ' పీఠాధిపతి అయ్యాడు. బాళాభావూ వైకుంఠవాసి అయినపుడు నాందుర్గాంలో వున్న నారాయణకు ఒక కల వచ్చింది. అది యిప్పుడు వినండి "! మాలీ నారాయణా! ఇక శేగాంవ్ వెళ్ళి అక్కడున్న భక్తుల్ని రక్షించు. ఇది నా ఆజ్ఞ అని వెళ్ళిపోయారు స్వామి గజాననులు. అందుచేతనే నారాయణ శేగాంవ్ వచ్చాడు. పీఠం మీదుండి ఆతడూ కొంత సేవచేశాడు. చైత్ర శుద్ధ షష్ఠి నాడు అతడు సమాధిస్తుడయ్యాడు. పూర్వ సుకృతం లేకుంటే మహాత్ముల సేవ లభించదు. మహాత్ముల సేవ వలన లభించే మహాపుణ్యం అక్షయమే!! శ్రీ గజాననస్వామి లీలా మహిమలోని అర్ధాన్ని తెలుసుకొనటం చాలా దుర్లభం! ఆకాశంలో మెరిసే నక్షత్రాల నెవరు లెక్కించగలరు? అలాటిదే యిదీను. నేను అజ్ఞానుడనైన పామరుణ్ణి, మందమతిని, ఇలాటి స్థితిలో లీలాసాగర వర్ణనం ఎలా చేయబడుతుంది? వారు చెప్పిందే నేనూ చెప్పాను. లేఖిని ద్వారా అక్షర రూపంలో వ్రాసింది నిజమే! కానీ వీటిలో అంత సామర్ధ్య మెక్కడిది? లేఖిని ఎవరి చేత వుందో వారే అక్షరాలను లిఖించారు. లేఖలు కేవలం అక్షరాలు వ్రాసే సాధనమేకదా! అదే సరిగ్గా యిక్కడా జరిగింది. నేను వ్రాసే పనిని చేశాను. వ్రాయటం, వ్రాయింప చేయటం అనేవి స్వయంగా స్వామి శ్రీ గజాననులే చేశారు! వారి కృప వలనే నేనిది లిఖించింది. ఇందులో నా గొప్పతనం మాత్రమూ లేదు సుమా! స్వస్తి శ్రీ దాసగణూచే విరచితమైన శ్రీ గజానన విజయమను పేరుగల యీ గ్రంథం కలశ సమీపానికొచ్చింది! కలశాధ్యాయం ముందున్నది?

 

|| శుభం భవతు

|| శ్రీ హరిహరార్పణమస్తు ||

||ఇది వింశాధ్యాయము సమాప్తము||

యే మనుష్యః మాం ఆశ్రతః!

తాన్ సర్వేస్యః కర్మ వినాశనః లభై!!