సర్వం శ్రీసాయి
శ్రీ గోదావరి మాత చరిత్ర
6వ అధ్యాయం

సాకోరి ఆశ్రమం చరిత్రలో 1954 వ సంవత్సరం చాలా ముఖ్యమైనది. ఈ సంవత్సరం శ్రీ గోదావరిమాతాజీ హైదరాబాదులో సూరతులో కేడ్ గావ్ లో యజ్ఞాలు చేసారు. శ్రీ గోదావరిమాతాజీ మొట్టమొదట హైదరాబాదులో చండీయాగం చేసారు. హైదరాబాదులో శ్రీ ఉపాసనీ మహారాజుల ఆశ్రమం ఉన్నది. దీనిని "ఉపాసనీ టేకిడి (గుట్ట)" అంటారు. ఇది నగరానికి 7 మైళ్ళ దూరాన ఉన్నది. యజ్ఞం గురించి చెప్పేముందు ఈ ఆశ్రమం ఏవిధంగా ఏర్పాటైనదో తెలుసుకుంటే కుతూహలంగా ఉంటుంది.

హైదరాబాదులో ఉపాసనీ మహారాజులకు పెద్ద సంఖ్యలో భక్తులుండే వారు. కనుక వారు ఇక్కడికి ఏడాదికొకసారి తప్పక వచ్చేవారు. ఆనాటి నిజాం ప్రభుత్వ ప్రధానమంత్రి సర్ క్రిషన్ ప్రసాద్ బహద్దరు ఉపాసనీ మహారాజులకు మహాభక్తుడు. 1928లో రాజా నర్సింగ్ బహద్దర్, ఉపాసనీబాబా కొంతకాలం హైదరాబాదులో ఉండ వలెను అనే కాంక్షతో కొంతభూమిని ధారాదత్తం చేసారు. నగరానికి దూరంగా ఏకాంతమైన ఈ గుట్టనేల శ్రీ ఉపాసనీ బాబావారికి బాగా నచ్చింది. ఈ స్థలంలో శ్రీ సాయిబాబావారి గుప్త పాదుకలు ఉన్నాయి అని మహారాజు అటుండేవారు. ఈ స్థలాన్ని అభివృద్ధిపరచి వారి నివాసంకోసం గదులూ చిన్న మందిరాన్ని కూడా నిర్మించారు. మహారాజు ఇంతకు మించిన కట్టడాలు వద్దన్నారు. ఉపాసనీ మహరాజులు సమాధి చెందిన తరువాత ఇక్కడ వారి పాదుకులు ప్రతిష్ట చేసి చిన్న మందిరం కట్టించారు. ఈ క్యారమంతా పట్టుదలతో నెరవేర్చినవారు సరస్వతీబాయి సక్సేనాగారు. ఆమె రాజా నర్సింగ్ బహద్దరు మేన కోడలు. అందరూ ఈమెని జీజీ అని పిలుస్తారు. ఆమెకు బాల్య వైధవ్యం ప్రాప్తించిన తరువాత సాకోరికి వచ్చి అనాటినుండి ఆశ్రమానికే అంకితమైన జీవితం గడుపుతున్నారు. సంస్థాన పోషకమండలిలో వారు సభ్యులు, సంస్థానానికి పెద్ద అండ.

ఈ ఉపాసనీ టేకిడిలో ఫిబ్రవరి నెలలో పెద్ద యెత్తున యాగం జరిగింది. దీని కోసం ఒక ప్రతేక్యమైన కమీటీ ఏర్పాటు చేయడం జరిగిది. రాజా నర్సింగ్ బహద్దరు, వ్యవ సాయశాఖ డైరెక్టరైన పృధ్వీరాజా, డాక్టర్ నర్సింగ్ ప్రసాద్, ప్రతాపరెడ్డి మొద లైన్ ప్రముఖులు అందులో సభ్యులు.

యజ్ఞం చూడటానికి భారతదేశం వివిధప్రదేశాలనుండి భక్తులు వచ్చరు. యజ్ఞంకోసం ప్రత్యేకమైన మండపం నిర్మించినారు. ఫిబ్రవరి 23తేదీ రోజున యజ్ఞం ప్రారంభమైనది. వేదమంత్రాల ఘోషతో అక్కడి వాతావరణమంతా మారుమ్రోగింది. యజ్ఞ సందర్భంగా ఇతర కార్యక్రమాలు చాలా ఏర్పాటు చేసారు. నామ సప్తాహం జరిగింది. పూనా నుండి వ్యాసబువా, అళంది నుండి పురాణిక్, హైదరాబాదునుండి డాక్టర్ పాఠక్ సా వచ్చి హరికథాగానం చేసారు. సాకోరినుండి పండిత జగన్నాథ్, శోలాపురంనుండి దిగంబర్ బువా, కాశీనుండి శర్మగారి వంటి ప్రఖ్యాత గాయకులు వచ్చి శాస్త్రీయసంగీతం వినిపించినారు. శ్రీ బిష్మరాజ్ గారు 50.60 మైళ్ళ డిండీ సంకీర్తన యాత్ర సాగించారు. మార్చి 3వ తేదీ రోజు శివరాత్రి కావటంచేత రుద్రాభిషేకం జరిగింది. 4వ తేదీ మార్చి నాడు పూర్ణాహుతి జరిగింది. దాదాపు 25 వేల శ్రద్ధాళువులైన భక్తజనం పూర్ణాహుతిని దర్శించారు.మరుసటి రోజు కన్యకలు సామూహిక సత్యనారాయణ పూజ జరిపించారు. యజ్ఞం పరిసమాప్తి ఐనతరువాత శ్రీగోదావరి మాతాజీని అలంకరించిన ఏనుగుపై వైభవంగా ఊరేగించారు. శ్రీగోదావరి మాతాజీ వెంట సులోచనకన్య అనే కన్య కూడా వున్నారు. రాజా నర్సింగ్ బహద్దర్ శ్రీ గోదావరిమాతాజీకి చామర సేవ చేస్తున్నారు. వాద్య నాదాలతో బయలుదేసిన శ్రీ గోదావరిమాతాజీ ఊరేగింపు వేలకొలది జనాలకు కనులు మిరుమిట్లు గోలిపింది. జయజయ ధ్వానాలతో నామ సంకీర్తనంతో ఆకాశం మారు మ్రోగింది. అదృశ్యం చూస్తుంటే గతించిన భారతదేశ వైభవం కనులకు కట్టినట్లైనది.

యజ్ఞం దర్శించటానికి ఆ రోజుల్లో ప్రముఖు ఏందరో వచ్చరు. ఆర్య సమాజ నాయకులు పండిత నరేంద్రజీ, ఎక్సైజ్ కమీషనరు దిల్సురాం, ఆర్థిక శాఖ డెప్యూటీ కార్యదర్శి శాంరాజ్, పండిత మాణిక్ ప్రసాద్ వంటి ప్రముఖు లెందరో వచ్చారు. అసంఖ్యాక భావుక భక్తులు యజ్ఞనారాయణుని దర్శించి పునీతులైనారు.ఈ యజ్ఞం తరువాత శ్రీ గోదావరి మాతాజీ పూనా వెళ్లారు. వారు పూనాలో ఉన్నప్పుడు సుప్రసిద్ధ యోగులైన హంసదేవ మహారాజును కలుసుకున్నారు. హంస దేవ మహారాజు గుజరాతు వాస్తవ్యులు. అసలు వారు పంజాలులో జన్మించినా గుజరాతులో స్థిరపడ్డారు. వారి ఆశ్రమం పవిత్ర తపతీ నదీతీరాన సూరతు పట్టణం సమీపంలో సిద్దకుటీరం పేరుతో ఉన్నది. దాని శాఖలు నర్మద ఒడ్డున బ్రోచ్ లోను, కలకత్తా సమీపాన జసీధీలోను, దక్షిణాన ఉదకమండలం లోను ఉన్నయి.శ్రీ హంసదేవ మహారాజు గారిది ఎత్తైన భారీ విగ్రహం. వారు కాషాయ వర్ణం నిలువుటంగీ ధరిస్తారు. వారి వయస్సు వందసంవత్సరాల దాటిపోయింది. ముంబయి ప్రభుత్వం విద్యాశాఖామాత్యులైన దినకర్ భాయి దేశాయి గారి పూనా ఇంటిలో విడిది చేసారు. శ్రీ గోదావరి మాతాజీ, శ్రీ హంసదేవ మహారాజు కలుసుకోవటం ఇదే మొదటిసారి. ఆ యిరువురు సంతుల సమాగమంలోని ఆనందం వర్ణనాతీతం. కొన్నాళ్ళ తరువాత గోదావరి మాతాజీ బయలుదేరే ముందు శ్రీ హంసదేవ మహారాజును సాకోరికి రావలసిందిగా ఆహ్వానించినారు. వారు సంతోషంతో అంగీకరించారు.అనుకున్న ప్రకారమే వారు సాకోరికి వచ్చారు. ఆశ్రమాన్ని అక్కడి వివిధ కార్యక్రమాలను చూచి పరమానంద భరితులైనారు. సాకోరి ఆశ్రమానికి వారి హృదయానికి ప్రేమసూత్రాలు పడుగు పేకలై అల్లుకున్నయి. వారు సాకోరిలో ఉండగానే సూరతులో ఒక యజ్ఞం చేయటానికి శ్రీ గోదావరి మాతాజీని సంప్రదించి తేదీ నిర్ణయం చేసారు. అక్టోబరు 31వ తేదీన సూరతులో మహారుద్రయాగం ప్రారంభించారు. బొంబాయి, పూనా, నాగపురం, హైదరాబాదు ఇంకా ఇతర ప్రదేశాలనుండి చాలా మంది భక్తులు ఈ అపూర్వయజ్ఞాన్ని దర్శించటానికి వచ్చారు.

యజ్ఞం సందర్భంగా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసినారు. ఓం నమ శ్శివాయ మంత్రంతో వాతావరణం అంతా నిండిపోయింది. సంగీతభాస్కర మాస్టర్ వసంత్ (రాజకోట), పండిత జగన్నాథ్ (సూరతు), కేముభాయి యాజ్ఞిక్, శ్రీ శంకరరావు పవార్ (పూనా) వంటి సుప్రసిద్ధుల భజనసంగీత కార్య క్రమాలు జరిగాయి. ఒకరోజు శక్తిమండలం పక్షాన గర్భానాట్యం జరిగింది. భగవద్భకుడైన సుదాముని చరిత్రం కళాత్మకంగా ప్రదర్శించారు.శ్రీ హంసదేవ మహారాజుగారి జన్మదిన మహోత్సవం కార్తిక పూర్ణిమ నాడు ఆనందకోలాహలంగా మహావైభవంగా జరిగింది. శ్రీ హంసదేవ మహా రాజును పూలతేరుపై ఆసీనులను చేసి గొప్ప ఊరేగింపు జరిపించారు. శ్రీ గోదావరిమాతాజీని పూలమాలలతో అలంకరించిన కారులో కూర్చోబెట్టారు. శోభాయాత్ర సాగుతుంటే వీథులు క్రిక్కిరిసి పోయాయి.జనసందోహం మేడలెక్కి ఇంటి పైకప్పులెక్కి అరోజు జరుగుతున్న ఆశోభాయాత్ర లో మనోహర దృశ్యాన్ని నేత్రపర్వంగా చూసారు.యజ్ఞసందర్భంగా విచ్చేసిన మహానుబావుల్లో అహ్మదాబాదు వాస్తవ్యులు యోగిరాజు మనోవీర్యజీ మహారాజు, హరిద్వారం వాస్తవ్యులు మహామండలేశ్వ రులు ప్రముఖులు.పూర్ణాహుతి తరువాత శ్రీ హంసదేవ మహారాజు సభాసదుల నుద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ విధంగా అన్నారు. "ఏనుగంత భారీశరీరమున్న ఈ సన్యాసికి యజ్ఞం చేయటంవలన ప్రయోజనమేమిటని మీరు ప్రశ్నించవచ్చు. ఈ యజ్ఞం నాకోసం చేసుకున్నది కాదు. లోక కల్యాణం కోసం చేసింది. ఇందులో పాల్గొన్న వారందరూ ధన్యులు.ఇంతకు ముందే ఒకసారి నేను శ్రీ గోదావరిమాతాజీ గారి ఆశ్రమం దర్శించాను అప్పుడు నేను మా ఆశ్రమంలో యజ్ఞం చేయవలసిందిగా ఆమె ప్రార్థించాను. వారు మా కోరికను మన్నించి కన్యాకుమారికలతో ఇక్కడికి విచ్చేసి యజ్ఞం చేసారు. అందుకు వారికి కృతజ్ఞుడను."ఈ యజ్ఞమప్పటి ఒక సంఘటన చెప్పుకోవలసింది ఒకటి ఉన్నది. హంసదేవకీ మహారాజు ఒక సోఫాలో దిండుకు అనుకొని కూర్చుండేవారు. వివిధ ప్రదేశాల నుండి వచ్చిన మఠాధిపతులకు ధర్మాచార్యులకు వారివారి గౌరవర్హతలకు తగినట్లుగా కూర్చోవటానికి ఏర్పాట్లు జరిగాయి. హరిద్వారం,ఋుషీకేశం నుండి వచ్చిన మహామండలేశ్వరులు కూడ ఆయజ్ఞంలో ఉన్నారు. ప్రతిరోజు ఎవరో క్రొత్త ఆగంతుకులు వస్తునే ఉన్నారు. కార్యక్రమం ఆరంభమైన రోజు నుండి శ్రీ గోదావరిమాతాజీ కూర్చోవటానికోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసారు. వారికి ఒక సోఫా కేటాయించి ఉంచారు కాని తమ స్వభావానికి అనుగుణంగా శ్రీ గోదావరి మాతాజీ ఆ సోఫాపై కూర్చోకుండా భూమిపైనే చిత్రసనం వేసుకొని కూర్చుండేవారు. శ్రీ హంస దేవజీ మహారాజు పదేపదే కోరినా శ్రీ గోదావరిమాతాజీ నేలపైనే ఆసనం వేసుకొని కూర్చునేవారు. కొన్నిరోజులు తరువాత ఒకానొక మతసంస్థకు అధిపతులైన ఒక స్వామివారు అక్కడికి విచ్చేసారు. తమకోసం ఎటువంటి ఎత్తైన ఆసనం ఏర్పాటు చేయనందు వలన ఆయన నిలుచోనే ఉన్నారు. హంసదేవజీ మహారాజు గారి శిష్యులు తికమక పడ్డారు. ఏది ఏర్పాటు చేయాలో వారికి తెలియక వారు తొందర పడుతున్నారు ఆది గమనించి హంసదేవజీమహారాజు గర్జిస్తూ "నా వద్దకు ఎందరో వస్తుంటారు. నేనేమో సన్యాసిని ఎంతమందికని ఏర్పాట్లు చేయగలను? ఐతే ఈ గోదావరి మాతాజీని చూడండి.ఆమె ఎంత మహోన్నతురాలు అంతే కాదు. ఒక గొప్ప సంస్థకు ఆమె అధిపతి కూడ. ఐనా ఉన్నతాసనం పైన కూర్చుండకుండా నేలపైనే కూర్చుంటున్నారు. అంతటి వినమ్రశీలురను నా జీవితంలో ఇంతవరకు చూడ లేదు" అన్నారు.సూరతు సిద్దకుటీరాశ్రమంలో యజ్ఞం చేసినతరువాత అనతికాలంలోనే శ్రీ గోదావరిమాతాజీగారు నారాయణ మహారాజుల ఆశ్రమం ఉన్న కేడ గాంవ్ లో ఒక యాగం చేసారు. ఈ కేడ్ గాంవ్ డొండ్ మన్మాడ్ రైలు మార్గంలో పూనా సమీ పాన ఉంటుంది. శ్రీ నారాయణ మహారాజు ఒక గొప్ప రాజయోగి. ఆయన రాజ భోగాలతో తులతూగుతున్నట్లు కనపడినా పూర్తిగా అనాసక్తులు. గొప్ప కర్మఠులు.వారు అనేక సత్యనారాయణ వ్రతాలు జరిపించారు. ఒకసారి వారు 1100 సత్యనారాయణ పూజలు జరిపిన సంఘటన మరిచిపోలేనిది.

మార్గశిరంలో యజ్ఞముహూర్తం నిర్ణయం కావటంతో శ్రీ గోదావరిమాతాజీ కన్యకలను జీజీని తీసుకొని కేడ్ గాంవ్ చేరుకున్నారు వ్యవస్థాపకులైన శ్రీ B T. వాఘ్ గారు కూడ వెంట ఉన్నారు. వివిధప్రదేశాలనుండి భక్తజనులు అక్కడికి చేరుకున్నారు శ్రీ నారాయణ మహారాజుగారి అనుయాయులు ముంబయి, పూనా, ఇతర ప్రదేశాలనుండి అధికసంఖ్యలో వచ్చినారు. సర్దార్ ఆభాసాహెబ్ ముజుం దార్, కెప్టెన్ బేల్సరే ప్రభృతులు సమధికోత్సాహం కనబరిచారు. యజ్ఞానికి అయ్యే ఖర్చు అంతా సాకోరి ఆశ్రమం భరించింది.నారాయణ మహారాజు సజీవంగా ఉన్నప్పుడు ఈ ఆశ్రమం భక్త జనంతో కిటకిటలాడుతుండేది. కాని వారు కీర్తిశేషులైన తరువాత ఇది పాడు పడినట్లై అయిపోయింది. ఇప్పుడు తల పెట్టిన యజ్ఞం మూలంగా వాతావరణమంతా మరల ఉత్తేజితమూ, భక్తిభరితమూ అయింది.స్వాహాకారములతో మారుమోగింది. అదృష్టవంతు లందరూ ఆ వాతావరణంలోని ఆనందపారవశ్యాన్ని పంచుకున్నారు.

యజ్ఞం ముగిసిన తరువాత శ్రీ గోదావరిమాతాజీ బరువెక్కిన గుండెతో అక్కడ నుండి తిరుగు ప్రయాణమైయ్యారు. భక్తజనుల కన్నులు ప్రేమాశ్రువులు కురిసి బయలుదేరేముందు శ్రీ గోదావరిమాతాజీ ఆధాసాహెబు ముజుందారుతో "సంక్రాంతి సమీపిస్తున్నది. సాకోరికి రండి" అంటూ ఆహ్వానించారు. ఆయన "అప్పుడే చతుర్ది పండుగు కూడ ఉంది. చవితి పండుగుకు నేను విధిగా మోరాగాంవ్ లో ఉంటాను. రాగలనో లేదో" అన్నారు. "మోరాగాంవ్ వెళ్ళకుండా సాకోరికే రండి. అక్కడ కూడ వినాయకుడున్నాడు" అని శ్రీ గోదావరి మాతాజీ మరల అన్నారు. సాహెబ్ ముజుందార్ మహారాష్ట్ర దేశంలో ప్రసిద్ధవ్యక్తులు; కేడ్ గాంవ్, జేజారీ, మోరాగాంవ్ వంటి ప్రదేశాల్లోని దేవస్థానముల పాలకమండలి సభ్యులు. మహారాష్ట్రదేశపు సామాజిక జీవనంలో వారికి గణనీయమైన స్థానం ఉంది. శ్రీ గోదావరిమాతాజీ ఆహ్వానం మన్నించి ఆయన సంక్రాంతికి సాకోరికి వచ్చారు. జీవితంలో మొదటిసారి తమ నియమాన్ని సడలించుకొని మోరాగాంవ్ వెళ్ళకుండా ఆయన సాకోరికే చేరుకున్నారు.

సంక్రాంతి ఉత్సవాలకు సాకోరికి వందల సంఖ్యలో భక్తులు వచ్చారు.ఏండ్ల తరబడిగా సంక్రాంతి ఉత్సవాలకు తప్పనిసరిగా భక్త్యుత్సాహాలతో దూర దూరాలనుండి సాకోరికి వచ్చే భక్తులు చాలమంది ఉన్నారు. ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడ చాలా ఏర్పాటుచేసారు.

|శ్రీ గోదావరి మాతాజీ వారి మహాపూజ ప్రారంభమైనది. గోదావరిమాతాజీపూజ ఒకప్రక్క జరుగుతుంటే మరొకప్రక్క సుప్రసిద్ధ గాయకుల సంగీతగోష్ఠి కూడ జరుగు తుంటుంది. దివ్యమైన సంగీతనాద సుధాతరంగాలలో భక్తులు ఓలలాడుతుంటారు. భక్తులు బారులుతీరి శ్రీ గోదావరిమాతాజీ దర్శనార్ధమై ముందుకు వెలుతున్నారు. శ్రీ ముంజుదార్ కూడ పూలమాల, కొబ్బరికాయ పట్టుకొని ఆ వరుసలో చేరిపోయి. తనవంతు రాగానే ఆయన శ్రీ గోదావరి మాతాజీ పవిత్రపాద సన్నిధిలో పూలు,కొబ్బరికాయ సమర్పించారు. ఐతే అప్పుడు ఒక ఆశ్చర్యానందకరమైన అనుభవం ఆయనకు కలిగింది. శ్రీ గోదావరిమాతాజీ స్థానంలో ఆయనకు తమ ఆరాధ్యదైవం మోరాగాంవ్ లోని మయూరేశ్వర గణపతి దర్శనం లభించినది. మొదట ఆయన తన కండ్లను తానే నమ్మలేదు. కాని పదేపదే ఆటు చూచినప్పుడల్లా దర్శనం కావడంతో ఆయన ఆనందపారవశ్యంతో మైమరచిపోయాడు.అంతులేని అశ్రుధారలు కురుస్తుండగా తన పూజ ముగించాడు. శ్రీ గోదావరిమాతాజీకి శ్రీ వినాయకునికి ఏమాత్రం భేదం లేదనే నిశ్చయానికి వచ్చాడు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత ఉత్తరం వ్రాస్తూ "శ్రీ గోదావరిమాతాజీని తలుచుకున్నప్పుడల్లా నాయెదుట గణపతి సాక్షాత్కరిస్తాడు నాకు వారు చాలాసార్లు స్వప్నంలోకూడ దర్శనం ప్రసాదించినారు. ఆమూర్తికి ముఖంలో తొండం ఉన్నట్లు కనబడు తుంది. శ్రీ గోదావరిమాత శ్రీగణాధిపతి అవతారమని నా దృఢ విశ్వాసం" అన్నారు.

6వ అధ్యాయం సంపూర్ణం.