సర్వం శ్రీసాయి
శ్రీ గోదావరి మాత చరిత్ర
5వ భాగం

1951వ సం" నుండి శ్రీ గోదావరి మాతాజీ శిష్యనిధి అనగా కన్యకలను శిష్యురాలను తీసుకోవడం ప్రారంభించిరు. శ్రీ ఉపాసని బాబావారే శ్రీ గోదావరి మాతజీకి ఈ అధికారం ఇచ్చారు.ఉపాసాని బాబా నిర్ణయించిన పద్దతి ప్రకారమే కన్యకల దీక్ష విధి నిర్వహన జరుతుంది. సాధారణంగా ఏ కన్య అయిన దీక్ష తీసుకొని జీవితాంతం ఆశ్రమంలోనే ఉండాలి అనుకుంటే ఆమె దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు ముందుగా ప్రశిక్షణం పొందటం తప్పనిసరి, ఆశ్రమనియమాలు నీతిరీతులు నిష్టగా పాటిస్తూ, ఆశ్రమంలో జరిగే దైలిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఉండాలి. ఈ ప్రకారంగా కన్యక మనఃపూర్వకంగా సన్న్యాస జీవనం గడిపే నిశ్చయం ప్రకటనమైన తరువాత, సంస్థలోని అధికారివర్గం ద్వారా ఆమె దీక్షకు యోగ్యురాలని అంగీకారం లభిస్తే, అప్పుడు ఆ కన్యకు దీక్షా ఇవ్వడం జరుగు తుంది.దీనికి సంబంధించిన కర్మకాండతంతు, రెండురోజులు నడుస్తుంది. ఎనిమిది తొమ్మిది గంటల సేపు ఈ విధివిధానం జరుగుతుంది. మొదటి దినం పుణ్యాహవాచనము, సర్వప్రాయశ్చిత్తవిధి. బ్రహ్మ కూర్చహోమం జరుగుతాయి. రెండవరోజు దీక్షారలక స్థాపనం, అభిషేకం, విష్ణుపూజనం, హవనం, గురు పూజ జరుగుతాయి. ఆపైన ఆత్మసమర్పణం, గురుదీక్ష, తరువాత ఆత్మ మంత్రోపదేశంతో దీక్ష పూర్తి ఔతుంది.

శ్రీ గోదావరి మాతాజీ 1951 సంవత్సరం సుమన, సునీతి, సవిత, విజయ, నళిని, సుమతి, యమున. ఈ యేడుగురు కన్యకలకు, 1963లో పుష్ప, ఉష, మంద, కుముదినీ-నలుగురు కన్యకలకు, 1968లో మహేశ్వరి, యోగేశ్వరి, మనోరమ, చంద్రకళ, సరోజిని, తేజస్విని ఆరుగురు కన్యకలకు, 1970లో మాధవికి. 1973లో మేధాసింధూ.. ఇద్దరికి. 1977లో సులోచన, అర్చిత ఇద్దరికి, 1978లో జాగృతి, సావిత్రి, గాయత్రి. ముగ్గురికి, 1981లో రాధా, జ్యోతి, కాళింది,రేఖా, నిర్మల ఐదుగురికి, మొతం 30 మంది కన్యకలకు దీక్ష ఇచ్చారు. చుక్కల్లో చంద్రడువలె ఈ శిష్య మండలంలో శ్రీ గోదావరి మాతాజీ ఆధ్యాత్మికాకాశంలో వెన్నెలలు కురిపిస్తున్నారు.

1952వ సం" విజయదశమివీ పండగ రోజున శిష్యురాండులైన కన్యకలను ఉద్దేశించి శ్రీ గోదావరి మాతజీ ఒక సందేశం ఇచ్చరు. కన్యకల ధ్యేయం ఏమై ఉండాలో అనే సందేశంలో స్ఫష్టంగా వివరించారు. శ్రీ గోదావరి మాతాజీ ఇలా అన్నారు. "ఉపాసని కన్యా కుమారీ సంస్థానంలో మీరు ఎందుకుంటున్నారో, మీరు చేయవలసినది ఏమిటో చెప్పుతాను. ఈ ప్రపంచానికి మీరొక ఆదర్శాన్ని అందించాలె. నవవిధా భక్తికి తొమ్మిది లక్షణాలైన అంగాలుగా ఉన్నవి. అందులో ప్రతిఒక లక్షణాన్ని మీరు తెలుసుకోవాలి. తొమ్మిది విదాలైన భక్తిమార్గములలో ఏదో ఒక దైనా మీరు ఆచరించాలి. ప్రతిఒక్కరు ఒక్కొక్క గుణాన్ని ఆత్మసాత్కృతం చేసుకొని లోకానికి ఆదర్శమూర్తులుగా నిలవాలి. మీరు లోకులకు ఆదర్శంగా ఉంటేనే మీ వలన అనేక మంది ఉద్దరింపబడుతారు."మీరందరూ చండికాదేవి ఆంతరికశక్తులు. మీరు ఆవరణంలో ఉన్న దేవతలు. మీరు నవదుర్గలు. అందువలన కామక్రోధాదులతో యుద్ధంచేసి వాటిని సంహరించటానికి మీరు సిద్ధం కావాలి. ఈ ప్రయోజనం సాధించటానికి మీకు ఈశ్వరీయజ్ఞానం తోడ్పడుతుంది. ఈశ్వరీయ జ్ఞానఖడ్గాన్ని, భక్తిధ్వజాన్ని, ధరించి కామక్రోధాది అరిషడ్వర్గాలతో పోరాడి, మీ జీవితాలను, మనస్సులను బంగారం చేసుకోండి. ఆ బంగారాన్ని శ్రీ ఉపాసాని బాబాకు సమర్పించండి. మీరు సమస్తలోకానికి ఆరాధ్యమూర్తులు కావలేను అని నేను శ్రీ ఉపాసాని బాబా వారిని ప్రార్థిస్తున్నాను. విజయదశమి సందర్భంగా మీకివే నా ఆశీస్సులు".

1953 సంవత్సరాంతంలో దక్షిణ భారతీయ సంతుల్లో ప్రముఖులైన స్వామి రామదాసుగారు తమ శిష్యాగ్రణి కృష్ణామాతాజీతో సాకోరికి విచ్చేసారు. వారికి సాకోరి ఆశ్రమం తరుపున ఆమెకు ఘనమైన స్వాగతసకారం జరిగింది. కీ.శే. N. G. భరూచా గారి బంగ్లాలో వారికి విడిది ఏర్పాటుచేయటం జరిగింది. స్వామి రామదాసుగారు కేరళరాష్ట్రంలోని కన్హనగడం సమీపాన రామనగరంలోని "ఆనందాశ్రమం"లో ఉంటారు. వారు బహు గ్రంథకర్తలు, వేదాంతము, దర్శనములు, ఆధ్యాత్మిక విషయాల గూర్చి అమూల్యరచనలు చేసి మన ప్రాచీనసంస్కృతికి ప్రోగుచేసిన మహనీయులు వారు. “In Quest of God", "Io the Vision of God" మొదలైనవి వారి సుప్రసిద్ధ రచనలు, వారు సాకోరిలో 10 రోజులున్నారు. ఆ పదిరోజులు ఎంతో ఆనందప్రదంగా ఉండేవి. భగన్నామంతో మధుర సంకీర్తనలతో వాతావరణమంతా ప్రతిధ్వనించింది. సంతుల సాంగత్యంలో లభించే ఆనందం వర్ణరాతీతం. స్వామి రామదాసు తమ ఆశ్రమానికి తిరిగి వెళ్లిన తరువాత 'విజన్ ' అనే తమ మాసపత్రికలో ఈ విధంగా వ్రాసారు.

"ఉపాసనీ బాబా కన్యాకుమారీసంస్థానంలో మేము గడపిన రోజులు చిరస్మరణీయం. ఎందుకంటే శ్రీ ఉపాసనీ బాబావారి భక్తులు శిష్యులూ ఐన శ్రీ గోదావరి మాత, ఇంకా ఇతరకన్యకల సాంగత్యంలో మాకు దివ్యానందానుభవం కలిగింది. వారి పవిత్ర,స్వచ్ఛ మైన ప్రేమలో మమ్ములను ఓలలాడించారు. కన్యకల్లో భక్తితాదాత్మ్యమే కాదు దైనందిన సత్కర్మలు ఆచరించేటప్పుడు, పూజ, యజ్ఞం, భజనలు చేసేటప్పుడు, ప్రతి పనిలోను వారి నడివడిలోను ప్రగాఢ విశ్వాసమూ పవిత్రమైన భావన ప్రస్పుటం ఔతాయి. వాళ్ళ జీవనసర్వసం గురు రూపం ధరించింది.ఉపాసాని బాబాయందు వారికి గల ప్రేమగౌరవాలు అద్భుతం. వారు నిరంతరం ఉపాసానిబాబా స్మరణంలోనే నిమగ్నులై వుంటారు. ఉపసానిబాబా తమను అవహించిన తాదాత్మ్యంతో, ఆయన సంకల్ప ప్రకారమే, ఆయన ప్రసాదించిన శక్తితోనే, వారు అన్ని పనులూ చేస్తూ తిరుగుతున్నట్లు కనబడుతారు. సత్పురుషుల సాంగ త్యంతో వ్యక్తులలో ఆధ్యాత్మిక సౌందర్యం, ప్రకాశం, ప్రేమానందాల నిధులుగా ఎలా పరిణమిస్తారో దీనివల్ల స్పష్టం ఔతుంది".సాకోరికి వచ్చివెళ్లిన తరువాత స్వామి రామదాసుగారు చాలా విదేశాలు తిరిగి వచ్చారు. ప్రపంచ పర్యటనం ముగిసిన తరువాత వారు తమ అనుభవాలను World is God (ప్రపంచమే భగవంతుడు) అనే పుస్తకం వ్రాసారు. జగత్ ప్రసిద్ధమైన ఆ గ్రంథంలో వారు శ్రీ గోదావరీ మాతాజీ గూర్చి చాలా గొప్పగా పొగడుతూ ఈ విధంగా వ్రాసారు.

"దివ్యత్వాకాంక్ష పురుషునికి ఉన్నట్లే స్త్రీకి కూడ ఉంటుంది. కనుక నిర్వాణం లేదా మోక్షం సాధించే మార్గంలో పయనించటానికి స్త్రీలకు కూడ అన్ని అవకాశాలు ఉండాలి. మన ప్రాచీన భారతదేశ చరిత్రలో స్త్రీలు చాలామంది ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించిన వారు ఉన్నారు. మైత్రేయి, గార్గి, అనసూయ, శబరి, బృందావన గోపికలు, మీరాబాయి, జానాబాయి, ముక్తాబాయి, శారదాదేవి మొదలెనవారంతా అటువంటివారే. యూరపులో థెరెసా, క్లారా, మేరీవంటివారెందరో ఉన్నారు. వర్తమానకాలంలో మన మధ్యలో ఆనందమాయి,మీరాదేవి, గోదావరీమాత, రమాదేవి, కృష్ణాబాయి వంటివారున్నారు. యూరప్ అమెరికాలలో ఈనాడున్న వారిలో శ్రీమతి గెర్డ్రూడ్ కాక్, సిస్టర్ దయా, సిస్టర్ గాయత్రీదేవి మొదలైనవారు ముఖ్యులు. ఈనాడు సమ కాలీన యోగినులు చాలాదేశాల్లో ప్రపంచమంతటా ఉన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో సాధనచేసే శిష్యబలగం కూడా వారికి చెప్పుకోదగినంత ఉన్నది. ఇందులో చాలామంది యోగినులు ఆశ్రమాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు నడుపు తున్నారు. పరమార్థం అన్వేషించేవారందరికీ ఆ సంస్థలో ప్రవేశం లభిస్తుంది".

-1952లో అవతార్ శ్రీ మెహర్ బాబా తమ అనుయాయులతో సాకోరికి వచ్చరు. అహ్మద్ నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే మెహరా బాదు వారి ఆశ్రమస్థానం శ్రీ ఉపాసనీ మహారాజులు సజీవులైయున్నప్పుడు -1918లో శ్రీ మెహర్ బాబాగారు సాకోరికి మొట్టమొదటిగా వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాలు ఉన్నారు. ఉపాసనీ మహారాజులు తమ దేహయాత్ర 1941లో చాలించిన తరువాత, వారు 1952లో శ్రీయశ్వంతరావు బొరావకేగారి నూతన గృహప్రవేకోత్సవం సందర్భంగా ఇన్నాళ్ళ తరువాత మరల వచ్చరు. శ్రీ యశ్వంతరావుగారు కూడ మెహర్ బాబావలె ఉపాసనీ మహారాజుల శిష్యులే. శ్రీగోదావరిమాతాజీని కలుసుకొని అవతార్ మెహర్ బాబా చాలా సంతోషించారు. వారు మౌనవ్రతంలో ఉండటం వలన తమ మనోభావాలు పలకపై ఆక్షర రూపాలు ద్వారా లిఖించేవారు. పలకమీద వారి వ్రేళ్ళు విద్యుద్వేగంతో కదిలేవి. ఏడాదికొకసారి మోహర్ బాబా తమ భక్తులకు అనుయాయులకు సహవాసం, అంటే తమతో కలిసి ఉండే అవకాశం, ప్రసాదించేవారు. ఒకసారి అటువంటి సహవాసంలో వారు "శ్రీ సాకోరి గోదావరిమాత మహోన్నతురాలు. నేను భారతదేశమంతా తిరిగాను. ప్రపంచన్ని చాలా సార్లు చుట్టివచ్చను. కాని శ్రీ గోదావరిమాతాజీవంటి విశాలహృదయంగలవారు నాకు ఎక్కడా కనబడలేదు.శ్రీ గోదావరి మాతాజీ కరువుని తీర్చే ప్రేమమూర్తి. నఖశిఖ పర్యంతం వారు ప్రేమమూర్తులు" అన్నారు.

"God speaks" "The Every thing & the Nothing"వంటివి వారి ప్రసిద్ధ రచనల్లో కొన్ని. వారి అమెరికా శిష్యుడు పురో డోమ్ వ్రాసిన “Listen Humanity" అనే గ్రంథం చాలా ముఖ్యమైనది. మోహర్ బాబా జీవితానికి సంబంధించిన ముఖ్య సంఘటనలన్నీ అతడా గ్రంథంలో భద్రపరిచారు.ఆ పుస్తకంలోనే మోహర్ బాబా శ్రీ గోదావరిమాతాజీని కలుసుకున్నప్పటి సంఘన శ్రీ గోదావరి మాతాజీ వ్యక్తిత్వమూ చాలా శక్తివంతంగా రచించారు.1953వ సంవత్సరం చాలా ముఖ్యమైనది. ఇంగ్లీషులో 'డివోషన్' అనే సాణ్మాసిన క జనవరిలో అప్పుడే 'శాంతిసాధన' అనే మరాఠీ మానపత్రిక, సాకోరి సంస్థానం పక్షముని ప్రారంభమైనది. ఈ పత్రికలద్వారా సంతుల సందేశాలు మహోన్నతమైన ఉపదేశాలు అందరి అందుబాటులోనికి వస్తుండేవి.

శ్రీ గోదావరి మాత స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని, శ్రీ ఉపాసనీ బాబావారి జన్మశతాబ్దిని పురస్కరించుకొని ప్రత్యేక సంచికలు ప్రకరించారు. ఈ సంచికల్లో ప్రఖ్యాతవిద్వాంసులు మహానుభావులైన సాధుసంతుల వ్యాసాలు ప్రచురింపబడటంచేత పాఠకుల గౌరవఆధారములు అందుకున్నాయి.అమెరికా నుండి వెలువడే Self Realisation అనే పత్రికాధిపతి ఇలా వ్రాసారు.

Self Realisation Fellowship కాలిఫోర్నియా USA 5, 3, 1955

మహాశయాః ప్రణామములు

మార్చి 7వ నాడు వ్రాసిన మీ ఉత్తరం అందినది, కృతజ్ఞతలు. గడచినవారమే: మీరంపిన డివోషన్ సంచికలందాయి. ఆ పత్రికలోని ప్రేరణాత్మక మైన,జ్ఞానకారక మైన వ్యాసాలు చదివి ఎంతో ఆనందించాను.

Miss Jane Brush( ఎడిటర్)


మధ్యప్రదేశ్ భూతపూర్వ రాజ్యపాలకులు డా. పటాస్కర్ ఇలా వ్రాసారు.

"మీరు పంపించిన ప్రత్యేక సంచిక అంది. శ్రీగోదావరీ మాతాజీగారి స్వర్ణోత్సవాల సందర్భంగా మీరీ సంచిక ప్రకటించి, ప్రజలందరికి మహోపకారం చేసారు".

1953వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఋషీకేష్ లో విశ్వధర్మ పరిషన మాహాసభలు జరిగాయి. డివైన్ లైఫ్ సొసైటీ దివ్యజీవనసమాజ స్థాపకులైన స్వామి శివా నంద సరస్వతి ఈ సభలకు సంయోజకులు. హిమాలయాల పరిసరాలలో పవిత్రిగంగానదీ తీరాన 'ఆనంద కుటీరం' అనే వారి ఆశ్రమం ఉన్నది. వివిధ ధర్మాలకు సంబంధించిన దేశవిదేశాల ప్రతినిధులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సభల్లో పాల్గొనటానికై శ్రీ గోదావరిమాతాజీని కూడ సాదరంగా ఆహ్వానించారు. అనివార్య కారణాల మూలంగా శ్రీ గోదావరిమాతాజీ వెళ్ళలేకపోయారు. ఐనా వారు తమ ప్రతినిధులను పంపించారు. పరిషన్ లకోసం ఒక దివ్యమైన మండపనిర్మాణం జరిగింది. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ప్రతినిదులతో ఆశ్రమం క్రిక్కిరిసిపోయింది. సమావేశాలు సభలు మూడు రోజులు ఏడ తెరపి లేకుండా జరిగాయి. శ్రీగోదావరి మాతాజీ సందేశాన్ని ఉషా టిప్లిస్ (ఇప్పుడు శ్రీమతి ఓజా) చదివి వినిపించారు. సందేశం సంగ్రహంగా ఉన్నా శ్రోతలను బాగా ప్రభావితులను చేసింది. ఆ సందేశం విన్న విద్వన్ మండలి ముగ్ధులైపోయారు. సందేశం విన్న శివానంద సరస్వతి 'బిందువులో సింధువు' అని అభివర్ణించారు.

విశ్వమత పరిషత్తును ఉద్దేశించి శ్రీ గోదావరి మాతాజీ పంపించిన సందేశపాఠం:

"ఈనాటి ప్రపంచం భౌతికంవైపు ఎక్కువ మొగ్గుతున్నది; భౌతిక ప్రగతికోసం పాకులాడుతున్నది. ఆధ్యాత్మికత అంటే అనాదరన పెరిగిపోతున్నది. అందువల్లనే ప్రపంచంలో ఈనాడు శాంతి కరువైనది. జాతులు దేశాలు కలహించుకుంటున్నారు. రక్తపాతం, యుద్ధోన్మాదం, నిరంతరం భయపెడు తున్నవి. కనుక శాంతి స్థావనమే ఈనాటి ముఖ్య సమస్యగా పరిణమించినది.

కాని నిజమైన శాంతి ఎట్లా సాధ్యపడుతుంది ? శాంతిస్థాపనకు ఒకే మార్గం ఉంది. అదే ధర్మపునరుజ్జీవనం. మతవిశ్వాసం శాంతిసామ్రాజ్యానికి బాటలు వేస్తుంది. ఐతే, వర్తమాన సమాజానికి మతంపై విశ్వాసం లేదు. అందువలన అది అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నది. ప్రజలకు మతం పైన, దైవత్వానికి సాక్షాత్తు ప్రతీకలూ మానవసమాజానికి నిజమైన శ్రేయోదాయకులూ ఐన సాధుసంతుల మీద, నమ్మకం లేదు. కేవలం పాండిత్యం వలనగాని, మతం వేదాంతాల గూర్చి కుష్కో వన్యాసాలు చేయటం వలనగాని, వ్యక్తి ధార్మికుడు కాలేడు. ధర్మం లేదా మతం అనేది సభలో చర్చించే సిద్ధాంతమో విశ్వాసమో కాదు. అది నిత్యజీవితంలో ఆచరణీయమైన వాస్తవమైన సత్యం. మతం సమాజానికి అత్యావశ్యకం. అది జీవితానికి ఊపిరి. ధర్మం (మతం) లేకపోతే అంతా అస్తవ్యస్తం ఐపోతుంది. నిజంగా ప్రపంచానికి శాంతి కావాలని ఉంటే ధార్మికసూత్రాలను నిత్యజీవితంలో అనుష్ఠించటానికై గట్టి కృషి చేయవలసి ఉంటుంది."

మే నెలలో చైతన్య ప్రభామండలి ఎనిమిదవ వార్షికోత్సవం ముంబైలో గోదావరిమాతాజీని అధ్యక్ష్యం వహించటానికి ఆహ్వానించారు. స్వామి చైతన్యానందులు స్థాపించిన ఈ ఆశ్రమం ఖార్ లో ఉంది. చైతన్యానందులు కడువృద్ధులు. విజ్ఞానపూర్ణమైన వారి శిరస్సునుండి వ్రేలాడే జడలు ప్రాచీన వట వృక్షం ఊడలను తలపిస్తాయి. ప్రత్యేకంగా నిర్మించిన మండపంలో వార్షికోత్సవాలు మహావైభవంగా జరుగుతున్నాయి. శ్రీ గోదావరిమాతాజీ బహిరంగ సభల్లో పాల్గొనటం బహుశ ఇదే ప్రథమం. జాజ్వల్యమానమైన శ్రీగోదావరిమాతాజీ వ్యక్తిత్వం సభాసదు లందరినీ ఆకట్టుకున్నది. ఉత్సవోచితమైన ఉపన్యాసాలు జరిగాయి. శ్రీగోదావరిమాతాజీ సందేశం వినిపించారు. గోదావరిమాతాజీ మానవ జీవితంలో ఆధ్యాత్మిక మూల్యాల మహత్వం గూర్చి నొక్కి చెప్పరు. కొన్ని రోజుల తరువాత స్వామీజీ సాకోరి ఆశ్రమం దర్శించివెళ్లారు. తరువాత ఒకవ్యాసం ప్రకటించారు.

"చైతన్యులకు సాకోరీ ఆశ్రమం దర్శించే అవకాశం లభించింది. పరమ పూజ్యులు శ్రీ ఉపాసనీ మహారాజుల పరిపూర్ణ కటాక్షానికి పాత్రురాలైన శ్రీ గోదావరిమాతాజీ ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నారు. శ్రీ గోదావరిమాతాజీ దివ్యనేతృత్వంలో నిష్కామసేవకు తమ జీవితాలను అంకితంచేసిన కొంతమంది కన్యకలు ఈ ఆశ్రమంలో ఉన్నారు. దివ్యభావప్రేరితులు, స్వార్ధరహితులు ఐన కొందరు పురు షులు కూడ కార్యకర్తలుగా ఈ ఆశ్రమంలో పని చేస్తున్నారు. విశ్వమంతటా దివ్యకిరణాలు ప్రసరించే విశ్వశక్తితో పూజ్య గోదావరిమాతాజీని పోల్చవచ్చు. అక్కడ పాటించే క్రమశిక్షణం మరొకచోట కనిపించని విశిష్టత. శ్రీ గోదావరిమాతాజీ పరాశక్తి అనే బేధం తిప్పితే, ఇచ్ఛాక్రియాజ్ఞానశక్తులు తమకు తామై నైమిత్తికంగా సర్వోత్కృష్టంగా ప్రతిభాసిస్తుంటాయి. సాకోరి ఆశ్రమం నాలుగు వైపులా దివ్య ప్రభాపుంజం పరివేష్టించి ఉంటుంది. గుణగ్రహణ పారీణులైనవారు ఎవరు అక్కడికి వెళ్ళి చూసినా ఈ సత్యాన్ని అనుభూతికి తెచ్చుకుంటారు. అది నిజంగా భూతల స్వర్గం. ఆతిథ్యము, ప్రేమ, సానుభూతి, దానము, మంచితనం,వినయము, సమత్వంవంటివి శ్రీ గోదావరిమాతాజీకి, వారి ఆశ్రమానికి అంతరికగుణాలు. శాంతికాముకులైన వారందరూ సాకోరిలో నివసించాలి."

అది 1953వ సంవత్సరం భాద్రపదమాసం ఆగస్టునెల. గణేశోత్సవాలు యధా ప్రకారం ఆనందోత్సాహాలతో వైభవంగా జారిగాయి. ఆ ఉత్సవాల తరువాత మాలే గాంవ్ లో తమ కార్యక్రమం ముగించుకొని శ్రీ తుక్డోజీ మహారాజుగారు సాకోరి ఆశ్రమానికి విచ్చేసారు. వారు ఆజానుబాహువులు, దీర్ఘకాయులు, ప్రభావపూర్ణ వ్యక్తిత్వం కలవారు. వారు ఆశ్రమాన్ని దర్శించి శ్రీగోదావరిమాతాజీని కలుసుకొని పరమానందభరితు అయ్యారు. మాటల సందర్భంలో వారు, "చాలామంది శిష్యులు తమ గురువుల ఆస్తులను దుబారా చేస్తారు. కాని శ్రీ గోదావరిమాతాజీ తమ గురువులు ప్రారంభించిన కార్యం విస్తృతం చేయటమే కాక దానికి నూతనోత్తేజాన్ని ప్రసాదించారు" అని ప్రశంసించారు.

దాని తరువాత శ్రీ తుమ్హాజీ మహారాజుగారి భజన సంకీర్తన కార్యక్రమం జరిగింది. వారి మధురస్వరంతో వాతావరణమంతా పులకించిపోయింది. శ్రోతలు ముగ్దులైపోయారు. వారు మైమరచి భజనానందంలో నిమగ్నులైపోయారు. అ తరువాత శ్రీ తుమ్హాజీ మహారాజు శ్రోతలందరినీ ఉఱ్ఱూతలూపే ప్రసంగం చేసారు.“చాలా సంవత్సరంల క్రితమ ఈ సంస్థానం దర్శించాను. ఇక్కడున్న శుచి, క్రమశిక్షణ, పవిత్రత, శ్రీ గోదావరిమాతాజీ నిరాడంబరంగా చేస్తున్న ఘనకార్యానికి నిదర్శనాలు. ఈ ఆశ్రమం ప్రశాంతికి ఆవాసం. ఇక్కడి వాతావరణం ఆమోఘం. ఈ పవిత్ర మందిరాన్ని ప్రజానీకం సద్వినియోగం చేసుకోవాలి."ఆ తరువాతి కాలంలో 1975లో శ్రీ గోదావరిమాతాజీ స్వర్ణోత్సవాల సందర్భంగా ఒక ఉత్తరంలో ఇలా వ్రాసారు.

"మీ ఉత్తరం స్వర్ణోత్సవ ప్రత్యేక సంచిక రెండూ అందాయి. కృతజ్ఞుడను. పవిత్ర జనని స్వర్ణోత్సవాల సందర్భంగా మీరు ప్రచురించిన అందమైన సంచికను చూచి చాలా ఆనందించాను. సాంస్కృతిక వారసత్వంలో మాతృత్వానికి ఉన్న మహోన్నత స్థానందృష్ట్యా మిమ్ముల ఎంత కీర్తించినా ఎంత గౌరవించినా తక్కువే అంటాను. మీ ప్రయత్నం ప్రశంసనీయమైనది. "

ఆ సంవత్సరమే స్వామి చిన్మయానంద సాకోరి ఆశ్రమం సందర్శించారు. అటుతరువాత వారుసాకోరికి చాలా సార్లు వచ్చారు. జగద్విఖ్యాతమైన చిన్మయా మిషన్ స్థాపకులు వారు. భారతదేశమంతటా దాని శాఖలు అనేకం ఉన్నాయి. స్వామీజీ ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతారు. భగవద్గీతపైనా ఉపనిషత్తుల పైనా వారు సాధికార ప్రసంగాలు చేస్తారు. వారీవిధంగా వ్రాసారు.

"సాకోరీ కన్యాకుమారీ సంస్థానం గోదావరిమాతాజీని, ఆసంస్థానం క్రమశిక్షణనూ మనోహరమైన సౌందర్యాన్నీ దర్శించినందుకు నేను అదృష్టవంతుణ్ణిగా భావిస్తున్నాను. ఈ ఆమేయ ప్రభావం అంతా 30 సంవత్సరాల క్రింద ఈ ఆశ్రమాన్ని స్థాపించిన సద్గురు ఉపాసనీ బాబా వారిది. ఈ ధన్యతమమైన ఆశ్రమానికి వినయపరంపరలు కోరుతున్నాను".

ఐదవ అధ్యాయం సంపూర్ణం.