సర్వం శ్రీసాయి
శ్రీ గోదావరి మాత చరిత్ర
4వ అధ్యాయం

1948 నవంబరులో శ్రీ గోదావరి మాతాజీ నలుగురైదుగురు కన్యకలను తీసుకొని నాగపురం వెళ్ళి ధన్ తోలిలో ఉండే రానడే అనే తమ భక్తుని ఇంటిలో విడిది చేసారు. అంతకు కొంతకాలం ముందే శ్రీ రానడేగారికి భార్యావియోగం సంభవించినది. కన్నతల్లి మమతను కోల్పోయిన ఆయన బిడ్డలకు శ్రీ గోదావరి మాతాజీ రాకతో స్వచ్ఛమూ నిర్వ్యాజమూ ఐన ప్రేమ పుష్కలంగా లభించింది వాళ్ళు ఎప్పుడూ శ్రీ గోదావరిమాతాజీ ప్రక్కనే ఉండేవారు. నాగపురం నుండి వెళ్ళిపోయే ముందు ఆ ఇంట్లో ఒకరోజు సత్యనారాయణవ్రతం ఆచరించాలెనని శ్రీ గోదావరి మాతాజీకి సంకల్పం కలిగింది. శ్రీ గోదావరి మాతాజీ వ్రతంకోసం ముహూర్తం నిర్ణయించిరు.నిర్ణియించిన రోజునాడు శ్రీ గోదావరిమాతాజీ స్వయంగా పూజ మొదలు పెట్టారు. ఆ రోజు శ్రీ గోదావరి మాతాజీ దర్శనంకోసం ప్రాతఃకాలంనుండే భక్తులు వస్తువున్నారు. శ్రీ రానడేగారు కొందరు భక్తులను తీర్థ ప్రసాదాల కోసం ఆహ్వానించారు. అందుకు తగినట్లుగానే ప్రసాదం సిద్ధం చేయించారు. కాని మాతాజీ తమదర్శనానికి వచ్చినవారినందరినీ ప్రసాదము తీసు వెళ్ళండి అనిఆదేశించారు. అది గమనించిన రానడే ఆందోళన పదుతున్నాడు. చేసిన కొద్ది ప్రసాదం ఇంతమందికి ఎలా సరిపోతుంది? అని ఆయన ఆందోళన చెబుతున్నాడు. రానడే పడుతున్న ఆందోళనను గుర్తించిన సర్వజ్ఞురాలైన శ్రీ గోదావరి మాతాజీ "ఈ రోజు ప్రసాదం నేనే పంచుతాను" అన్నారు. శ్రీ సత్యనారాయణ పూజ ముగిసింది. హారతి ఐనతరువాత శ్రీ గోదావరిమాతాజీ ప్రసాదం పంచటం మొదలు పెట్టారు.శ్రీ మాతాజీ దివ్యహస్తాలతో ప్రసాదం లభిస్తున్నందుకు భక్తులందరికీ మహానందం కలిగింది. అనుకున్నదానికంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు ప్రసాదం తీసుకుంటున్నారు. అనా పాత్రలో ప్రసాదం ఇంకా చాలా మిగిలి ఉంది. ఈ తమాషా చూస్తూ ప్రక్కనే నిలుచున్న రానడేగారి బిడ్డలు అద్భుతాశ్చర్యనిమగ్నులైనారు. సాక్షాత్తు అన్నపూర్ణ వడ్డించటానికి పూనుకున్నప్పుడు పదార్థానికి కొరత ఎలా ఏర్పడుతుంది.ఇటువంటి అద్భుతానుభవాలు భక్తుల హృదయాల్లో కోకొల్లలుగా ఉన్నాయి.

అది 1956 సం"లో జరిగిన ఒక గొప్ప సంఘటన. ముంబై కి చెందిన భక్తురాలు శ్రీమతి చంపాలెన్ నవలాలీ, శ్రీ గోదావరి మాతాజీ వేసవి విడిది కోసం మహాబలేశ్వరంలో ఒక బంగ్లా అద్దెకు తీసుకున్నారు. ఆమె ప్రస్తుతం. సాకోరిలోనే ఉంటున్నారు. వైశాఖ బహుళ విదియనాడు శ్రీ మహా రాజుగారి జయంతి ఉత్సవం మహావైభవంగా జరిగింది. శ్రీ లక్ష్మణ్ బువాగారి హరినామసంకీర్తన కార్యక్రమం ఏర్పాటైనది. శ్రీ సత్యనారాయణ పూజ జరిగింది. అక్కడున్న భక్తులందరికోసం ప్రసాదం చేసారు. కాని ఆశించినదానికంటె ఎక్కువ సంఖ్యలో భక్తులు తీర్థప్రసాదాల తీసుకోవడం కోసం వచ్చరు. అప్పుడు సహజం గానే చంపాబెన్ కు ప్రసాదం అందరికీ సరిపోతుందా అనే విచారం కలిగింది.కాని గోదావరి మాతాజీ అనుగ్రహవిశేషంచేత అందరికి పంచిన తరువాత కూడ ప్రసాదం. మిగిలింది. మూడు రోజులు గడచినా ప్రసాదం తరిగిపోకుండా ఉంది. మూడు రోజులు దర్శనం కొరకు వచ్చినవారందరికీ అదే ప్రసాదం పంచారు. చివరకు చంపాబెన్ ఈ సంగతి శ్రీ గోదావరిమాతాజీకి విన్నవించారు. అప్పుడు ఒక్కసారి పంచటంతోనే ప్రసాదం అంతగా అపోయింది. శ్రీ గోదావరి మాతాజీ సంకల్పం ఇలా ఉంటుంది.శ్రీ గోదావరి మాతాజీ చేతుల్లో అక్షయం ఉంది. ఇది ఆమెకు చిన్ననాట నుండే సిద్దించింది. మారాణి అమ్మమ్మ ఒకసారి పూరీలు చేస్తూ మనుమరాలును నెయ్యి తెమ్మన్నది. చిన్న వయసులో ఉన్న చిట్టిగోదావరి తన చిన్నారి చేతులతో నెయ్యి తెచ్చి కడాయిలో పోసినది. అయితే ఆ నెయ్యి ప్రతినిత్యం కాల్చే పూరీలకంటే ఎక్కువ వాటికి సరిపోయినట్లు అమ్మమ్మకు అనిపించింది. ఇటువంటి అనుభవం ఆమెకు చాలా సార్లు కనబడింది. వస్తువులు సమృద్ధి కావడం కోసం ఆ అమ్మమ్మగారు ఎప్పుడూ ఈ మనుమరాలికే పనులు పురమాయించేవారు.

1948 డిసెంబరులో శ్రీ మాతాజీ నాగపురంనుండి సూరత్ వెళ్ళరు. అక్కడ పవిత్ర తపతినదీ తీరాన అశ్వినీకుమారాశ్రమం పేరుతో శ్రీ ఉపాసని మహారాజు ఆశ్రమం ఉంది. కమలాబాయి, తిపాఠి అనే భక్తురాలు ఈభూమినీ తన ఆస్తినీ ఉపాసనీ మహారాజుకు ఆర్పించారు. ఉపసానిబాబావారి పరమభక్తుడైన |శ్రీ బాబుభాయ్ కాయస్ట్ దానిని పునర్నిర్మించి చాలా అందంగా తీర్చిదిద్దిరు. అక్కడ ప్రతిరోజు నియమం ప్రకారం పూజ ఆరతి జరుగుగుతూనే ఉన్నాయి.

శ్రీ గోదావరిమాతాజీ తమ భక్తురాలైన సోమాబాయి సోనీ యింట విడిది చేసారు. ప్రతిరోజు శ్రీగోదావరిమాతాజీ దర్శనార్థం చాలామంది భక్తులు వచ్చేవారు. అట్టి వారిలో సూరత్ వాస్తవ్యులు ప్రసిద్ధ గాయకులు పండిత జగన్నాథ్ ఒకరు. ఆయన వెంట ఆయన కూతురు సుశీలకూడ ప్రతిరోజు వచ్చేది. సుశీలకు భక్తి ప్రపత్తులు సహజంగా ఎక్కువ. ఒకరోజు ప్రాతః కాలం ఆమెకు ఒక కల వచ్చింది. ఆ కలలో "శ్రీ గోదావరిమాతాజీ కనపడి ఆమెను “నీకు ఏస్తోత్రం ఎక్కువ ఇష్టం?" అని అడిగారు. విశ్వజననీ స్తోత్రం అంటూ సమాధానం చెప్పుతుండగా మెలకువ వచ్చింది. శ్రీ గోదావరిమాతాజీకలలో దర్శనమిచ్చినందుకు సుశీలకు చాలా సంతోషం కలిగింది. ఆరోజంతా ఆమెకు అదే సంతోషం. అంతకంటే ఎక్కువ ఆ కలకు వేరేవేరే మార్గం ఉందని ఆమె అనుకోలేదు.

ప్రతిరోజు లాగానే ఆ రోజు సాయంకాలం సుశీల శ్రీ గోదావరి మాతాజీ దర్శనానికి వెళ్ళింది. గోదావరి మాతాజీ ఆసనం పైన కూర్చొని ఉన్నారు. ఎప్పటికంటే ఎక్కువ సంతో షంగా కనబడుతున్నారు. శ్రీ గోదావరి మాతాజీచుట్టు పూలదండలు, పండ్లు, మిఠాయిలు కుప్పలుకుపోయాలుగా పడి ఉన్నవి. సుశీల శ్రీ గోదావరి మాతాజీ పాదాలంటి కూర్చున్నది. సైగచేసి శ్రీ గోదావరిమాతాజీ ఆమెను దగ్గరగా పిల్చుకొని 'విశ్వజననీస్తోత్రం' పుస్తకం చేతిలో పెట్టి "ఇదిగో నీకిష్టమైన స్తోత్రం తీసికో" అన్నారు. సుశీల ఆశ్చర్యసాగరంలో మునిగి పోయింది. శ్రీ గోదావరిమాతాజీ కాళ్ళను కన్నీళ్ళతో కడిగింది.

1950వ సంవత్సరం శ్రీ గోదావరిమాతాజీ జీవితంలో మహత్వపూర్ణమైనది. ఆ సంవత్సరం గోదావరిమాతాజీ కట్నీలోను కాశిలోను యజ్ఞాలు చేశారు.మొదట కట్నీలో రామయజ్ఞం చేసినారు. బజాన్ అనే పార్సీ భక్తుడు యజ్ఞయజమాని. ఆయనకు సున్నపురాళ్ళ గనులు వున్నయి. ఆయన ఉపాసనీ బాబాగారి గొప్ప భక్తుడు. యజ్ఞం జరుగుతున్న రోజుల్లో కట్నీలో మతకలహాలు చెలరేగాయి.భయంకర పరిస్థితులు ఎర్పడ్డాయి. పట్టపగలు నడివీధుల్లో హత్యలు జరుగుతుండటం వలన రాకపోకలపై నిషేద అజ్ఞలు విధించారు. శ్రీ బజాన్ గారి ఇంటికి సమీపంలో ఉన్న సంస్కృత పాఠశాలలో యజ్ఞమండపం నిర్మించారు.ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడ శ్రీ గోదావరిమాతాజీ యజ్ఞం ప్రశాంతంగా వైభవంగా జంపించారు.

శ్రీ గోదావరిమాతాజీ కట్నీ నుండి కాశీకి వెళ్ళి శ్రీ ఉపాసనీ బాబావారు సమాధి చెందిన సందర్భాన్ని పురస్కరించుకొని మహారుద్రయాగం చేసారు. కాశీకి వచ్చినప్పుడు ఉపసాని బాబావారు రాజఘాట్ లో ఉండేవారు. ఆ స్థలం గోయెంకాగారు ఉపాసాని బాబాకు సమర్పించిన స్థలం. అక్కడే గోదావరి మాతాజీ యజ్ఞం చేసారు. కాశీ భారత దేశంలో గొప్ప పుణ్యక్షేత్రం. హిందూ ధర్మావలంబుల అగణిత భావనలన్నీ ఈ క్షేత్రంతో ముడిపడి ఉన్నయి. ఇంతే కాకుండా వేదపండితులకు కాశీ పుట్టినిల్లు. యజ్ఞం చూడటానికి వేదపండితులు శాస్త్ర పండితులు చాలామంది వచ్చేవారు. మహామనీషి మదనమోహన మాలవీయగారి అల్లుడు దామలేశాస్త్రి వంటి ప్రముఖులు కూడా వచ్చారు. స్వాహాకారాలతో వేదమంత్రాలతో అక్కడి వాతావరణం ప్రతి ధ్వనించ సాగింది. భక్తులనేకులు యజ్ఞనారాయణుని దర్శించి ధన్యులైరు.ప్రతిరోజు అన్నదానం జరిగేది. పూర్ణాహుతి తరువాత పెద్దయెత్తున వేలకొలది వచ్చిన జనానికి ప్రసాదం పంచి సంతృప్తి కలిగించారు.

ఉపాసనీ మహారాజు మహిళలకు వేదాధికారం ఇచ్చి వారిచేత యజ్ఞాలు. చేయించే విప్లవాత్మక ధోరణి కొందరు సనాతనపండితులకు నచ్చలేదు. కన్యలు చేసే యాజ్ఞిక కర్మలు చూస్తూ వారి ముఖతః స్వచ్ఛమైన వేదమంత్రోచ్ఛారణం వింటూ కొందరు పండితులు సంతోషిస్తుంటే, కొందరు సనాతనులు స్త్రీలకు యజ్ఞాలు యాగాలు చేసే వేదాధికారం ఉందా? అంటూ గుసాగులు ప్రారంభించారు. వాళ్ళలో వాళ్ళ ప్రారంభించి గొడవలు మొదలయ్యాయి. "ఇంత సుస్వరంగా స్వచ్చంగా వాళ్ళు వేదం చెప్పుతుంటే అధికారం ఉందా లేదా అనే ప్రశ్నకు తావే లేదు" అనుకున్నారు. చివరక ఈ అభిప్రాయానికే ఆమోదం లభించింది. ఈ విధంగా ఉపాసని బాబా ఉద్యమంలోని విలువ విద్వాంసులకు, బుద్ధిమంతులకు మెల్ల మెల్లగా తెలియ వచ్చింది. ఆ యజ్ఞమప్పుడు ఒక భక్తునికి కలిగిన అనుభవం చెప్పుకో వలసినది. కాశీలో గోదావరిమాతాజీ మహారుద్రయాగం చేయిస్తున్నారని తెలిసి చాలా చోట్లనుండి భక్తులు వచ్చి చేరుకున్నారు. అలాంటి వారిలో సూరత్ వాస్తవ్యులు శ్రీ దేవీ ప్రసాద్ త్రివేదీ ఒకరు. యజ్ఞపరిసమాప్తి ఐన తరువాత తిరిగి వెళ్ళటానికై గోదావరిమాతాజీ అనుమతికోసం ఆమెసన్నిదికి వెళ్లారు.

"ఎప్పుడు బయలుదేరుతున్నావు?" అని గోదావరి మాతాజీ ప్రశ్నించినారు.

"రేపే ఇల్హాబాదు ఎక్స్ ప్రెస్ లో వెళ్తున్నాను" అని త్రివేది సమాధానం చెప్పారు. వెంటనే "ఆ బండిలో వెళ్లకు" అని గోదావరిమాతాజీ గట్టిగా అన్నారు. త్రివేది నిశ్చేష్టుడై పోయాడు. ఎప్పుడూ గోదావరిమాతాజీ మృదువుగా సౌమ్యంగా మాట్లాడుతారు. అప్పుడు గోదావరిమాతాజీ పలికినతీరు ఆయనకు ఆశ్చర్యం కలిగించింది. మరుసటి రోజు వెళ్ళటానికి గోదావరిమాతాజీ అనుమతిఇచ్చారు. అప్పుడు రైలు బండ్లలో రద్దీ ఎక్కువ ఉండటం వలన ఇంత త్వరగా రిజర్వేషన్ లభిస్తుందో. లేదో అనే ఆరాటం కలిగింది త్రివేదిగారికి. అది గమనించి శ్రీ గోదావరి మాతాజీ "ఆరాట పడకు, రిజర్వేషన్ దొరుకుతుంది" అని అన్నారు. గోదావరి మాతాజీ ఆశీస్సులు, ప్రసాదం తీసుకొని త్రివేదీ అక్కడనుండి వెళ్లారు.అనుకున్న రోజు త్రివేది స్టేషనుకు చేరాడు. ఒక పెట్టె అంతా ఖాళీగా ఉండటంచేత ఆయనకు ముంబయికి సులభంగానే రిజర్వేషన్ దొరికింది. ఖాండ్వా స్టేషన్ చేరిన తరువాత దాదాపు రెండు గంటలు నిలిచి పోయింది. అంత సేపు రైలుబండి ఆగటానికి కారణమేమిటో కనుక్కుంటే. నిన్నటి ఇలాబాదు ఎక్స్ ప్రెస్ భయంకర ప్రమాదానికి గురియైనట్లు త్రివేదికి తెలిసింది. ప్రమాదం జరిగిన చోటుమీదుగా త్రివేదీ ప్రయాణం చేస్తున్న బండి వేలుతుంటే ఆ దృశ్యం చూడలేక పోయాడు. అతని గుండె ఆగి పోయినంత అయింది , శరీరం వణకిపోయింది అప్పుడు శ్రీ గోదావరిమాతాజీ గట్టిగా అన్నమాటల్లోని అంతర్యం త్రివేదికి తెలిసివచ్చింది. శ్రీ గోదావరిమాతాజీ అతనిని మృత్యువునుండి తప్పించినందుకు. కృతజ్ఞతాభావంతో గుండెలు నిండి. కనులు చెమ్మగిల్లినవి హృదయం ఉపొంగిపోయింది.

నాల్గవ అధ్యాయం సంపూర్ణం.