సర్వం శ్రీసాయి
శ్రీ గోదావరి మాత చరిత్ర
3వ అధ్యాయం

1941వ సం౹౹ లో శ్రీ ఉపాసనీ బాబావారు మహాసమాధి చెందిన తరువాత శ్రీ గోదావరి మాతగారే భక్తులకూ ఆశ్రమానికి కల్పవృక్షమూ కామదేనువూ ఐనారు. ఆశ్రమనిర్వహణ భారము, జిజ్ఞాసువులు ఆర్తులుగా వచ్చే భక్తులకు మార్గోపదేశం చేసి ఆశీర్వదించే బాధ్యత గోదావరిమాతాజీపైన పడినది. కస్తూరి పరిమళాలు ఎంత దాచినా దాగనట్లే శ్రీ గోదావరి మాతలోని దైవీగణాల పరిమళాలు దూర దూరాలకు వ్యాపించింది. ఆమెలో క్రమంగా ఈశ్వరత్వ - ఈశ్వరీయ శక్తులు తాండవిస్తూ విజృంభింపసాగాయి. అందువలన భక్త సందోహం, భావుకజనం ఉత్తరోత్తరా ప్రాంతాల వారు సాకోరికి అధికసంఖ్యలో వస్తూ ఉండేవారు. ఆమె సర్వజ్ఞత్వ సర్వాంతర్యామిత్వ సర్వశక్తిమత్వ మహిమలను అనేక మంది భక్తులు అనుభవించ సాగారు.

1945వ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన, ఉపాసనీ బాబా చిరకాలాభక్తులు శ్రీ బేడా లేకర్ దర్శనార్ధమై సాకోరికి వచ్చి అత్యవసరమైన పని ఉండటం వలన ముంబైకి వెళ్ళడానికి ఆనవాయితీ ప్రకారం శ్రీ గోదావరి మాతాజీ అనుమతి కోరారు. శ్రీమాతాజీ ఆప్యాయంగా "చాలా రోజుల తరువాత వచ్చరూ కదా! ఇప్పుడే ఎలా వెళ్లి పోతారు? ఉండండి" అన్నారు. ఆయన మాట్లాడకుండా ఊరుకనే ఉన్నారు. వెంటనే అక్కడినుండి బయలుదేరి వెళ్లడం అత్యవసరం. ఒక భాగ స్వామితోపాటు తాను కాగితాలపై ముంబైలో సంతకం చేయకపోతే నష్టం వచ్చే ప్రమాదం ఉంది కనుక అనుజ్ఞ ఇప్పించవలసిందిగా ఒక కన్యక చేత గోదావరిమాతాజీగారికి వార్త పంపించాడు. కాని గోదావరిమాతాజీ ఈ విషయాన్ని ఏమీ పట్టించు కోలేదు. పాపం ఖేడాలేకర్ సందిగ్ధావస్థలో పడ్డాడు. రెండు రోజులున్నాడు.స్నేహితుని వద్ద నుండి వెంటనే బయలుదేరి రమ్మని ఉత్తరం వచ్చింది. భేడాలేకర్ కు వచ్చిన ఉత్తరాన్ని గోదావరిమాతాజీ ముందుంచి అనుజ్ఞకై వేడుకుంటూ ఆడిగాడు. "నాకు మరాఠీ చదవటం రాదు” అని గోదావరిమాతాజీ ఆయనను మభ్య పెట్టరు. తాను ప్రయాణమైపోవటం శ్రీ గోదావరి మాతా జీకి ఇష్టంలేదు కనుక ఆమె ఆజ్ఞ లభించినప్పుడే వెళదాం అని భేడాలేకర్ నిశ్చ యించుకున్నాడు. ఆశ్రమంలో జరిగే దైనందిన పుణ్యకార్యాలలో పాల్గొన్నాడు. 15 రోజులు సత్సంగం చేసిన ఆనందం అమృతం త్రాగినట్లు త్రాగాడు. 16వ రోజున అనుకోకుండా శ్రీ గోదావరిమాతాజీ చిరునవ్వు నవ్వుతూ “రేపు ఉదయం ముంబై వెళ్ళండి. మీ కోసం ఎదురు చూస్తున్నారు" అంటూ ప్రసాదం ఇచ్చి ఆశీర్వ దించారు.

భేడాలేకర్ ముంబై చేరుకొని, తన స్నేహితుడు ఎంతో కోపం పడతాడాని అని సంకోచిస్తూ స్నేహితునింటికి వెళితే ఆయన సంతోషంతో ఆహ్వానించాడు. సంతకం చేయటానికి వచ్చే భాగస్వామి ఇన్నాళ్ళు జబ్బుపడి రాలేకపోయారని రేపు వస్తున్నానని ఉత్తరం వ్రాసాడని,నీకోసం టెలిగ్రామ్ పంపుదామనుకుంటే సమయా నికి భగవంతుడే నిన్ను పంపించినాడనీ మాటల్లోని ఆ మాటలు విన్న ఖేడాలేకర్ కన్నుల్లో కృతజ్ఞతాసృవులు కంటినుండి దారలా రాసాగాయి. మనసు లోనే గోదావరిమాతాజీకి ధన్యవాదాలు తెలుపుకున్నాడు. శ్రీగోదావరిమాతాజీ మాటల్లో నిగూడ రహష్యం ఆయనకు అప్పుడు అర్ధమైంది. సాధుసంతుల మాటలోని గుప్త శక్తిపై నమ్మకం మరింత దృఢడింది. శ్రీ గోదావరి మాతాజీ సర్వజ్ఞాత్వం బోధపడింది.

1945వ సం౹౹లో జరిగిన మరోక సంఘటన. అది జనవరి నెల. సంక్రాంతి ఉత్సవాలు అప్పుడే పూర్తి అనాయి. భక్తులు గోదావరి మాతాజీ ఆశీస్సులు, ప్రసాదం తీసుకొని స్వగ్రామాలకు వెళుతున్నారు. ఒక రోజు ఉదయం భజన కార్యక్రమం మహాద్వారం వద్ద జరుగుతున్నది.సంకీర్తనలతో వాతావరణమంతా మారుమోగుతున్న సమయంలో గోదావరి మాతాజీ నన్ను రమ్మంటున్నారని పిలుపు వచ్చింది. శ్రీ గోదావరి మాతాజీ సభామండ వంలో నిలుచున్నారు. నేను వెళ్ళి చెంత నిలుచున్నాను.

"కోత్వాల్ ఉత్తరం వ్రాసాడు నీకు తెలుసా"? అని శ్రీ గోదావరి మాతాజీ ప్రశ్నించారు.

'నాకు తెలియదు' అన్నాను.

"ఆయన కొడుకు అనంతు ప్లేగుతో బాధపడుతున్నాడు" అని గోదావరిమాతాజీఅన్నారు. ఆవార్త విని నేను స్తబ్దుడనై పోయినాను.

"చింతించవలసిన పనిలేదు. తొందరగానే తేరుకుంటాడు. ఈ విభూతి పంపించు" అంటూ గోదావరిమాతాజీ నాచేతికి విభూది పొట్లం అందించారు.

అనంతు మా పెదతల్లి కొడుకు.ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడు. మా యింటి ఆనవాయితీ ప్రకారం గోదావరి మాతాజీ ఆశీస్సులకోసం నూతన వధువుతో మొన్న జరిగిన సంక్రాంతిఉత్సవాలకు సాకోరికి వచ్చరు. ఇంటికి తిరిగి వెళుతూ పూనాలోఉండే మా చెల్లెలు సౌ॥ విమలాబాయి జున్నార్ కర్ పిలిచింది కనుక ఆమె యింటికి భార్యాసమేతంగా పూణే వెళ్ళిరు. వెళ్ళిన మరుసటిరోజునే ప్లేగు వ్యాధి అంటుకున్నది. చంకలో ప్లేగు పొక్కులు లేచాయి. వెంటనే అంటువ్యాధుల ఆసుపత్రిలో చేర్పించారు.వైద్యం చేస్తున్నా సరే అతని పరిస్థితి విషమించింది.

పూణేకు ఆనంతును పిలిచింది కనుక మా చెల్లలు విమలా బాయి, చాలా ఆందోళన పడింది. కొత్తగా పెండ్లి చేసికొని మొదటిసారి.

తమ్ముడు తన యింటికి వచ్చి ఇటువంటి విపత్తు పాలైనందుకు ఆమె మనస్సు విలవిలలాడింది. శ్రీ గోదావరి మాతాజీని ప్రార్థించినది. "తల్లీ నా తమ్ముణ్ణి ఈ విపత్తు నుండి రక్షించు. నీవే మాకు దిక్కు" అని దీనంగా గోదావరి మాతాజీకి ఉత్తరం వ్రాసింది. ఆనాడు రాత్రి ఆమెకు ఒక విలక్షణమైన కల వచ్చింది. కలలో శ్రీగోదావరి మాతాజీ దర్శనమైనది. చేతుల్లో కుంకుమభరిణ పట్టుకొని తన మరదలికి బొట్టు పెట్టడానికై ముందువెనుక లాడుతున్నట్లు గోదావరి మాతాజీ దర్శనమిచ్చింది. రెండవరోజే మాతాజీ వ్రాయించిన ఉత్తరం విమలాబాయికి అందింది. "నీవేమీ కంగారు పడకు. శ్రీ ఉపాసనిబాబావారి అనుగ్రహం ఉంది" అనే గోదావరి మాతాజీ సమాధానంతో ఆమె మనసు కుదుట పడింది. ఆసుపత్రికి వెళ్ళి చూస్తే అనంతు పరిస్థితి ఈరోజురేపో అన్నట్లుగా వుంది. మరదలు తల్లిదండ్రులకు టెలిగ్రాం ఇచ్చి పిలిపించింది. అనంతు పరిస్థితి చూచి వాళ్ళు తీవ్రాందోళనకు గురైనారు. అనంతు భార్య పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అమ్మాయిది చిన్నవయస్సు. పాపం ఆవయసు లోనే ఆమెకు పసుపుకుంకుమలు తీరిపోయేటట్లువున్నది. అల్పాయుష్కుణ్ణి కట్టుకున్నందుకు బాధపడటం తప్ప ఏమి చేయగలదు ఆదురదృష్టవంతురాలు అని అనుకుంటున్నారు.

శ్రీ గోదావరిమాతాజీ పంపించిన విభూతి అందిన మరు క్షణం విమలాబాయి ఆసుపత్రికి వెళ్ళింది. డాక్టర్లు చేసిన చికిత్సలూ ఉపచారాలూ నిష్పలమై పోయినవి.డాక్టర్లు ఆశ వదులుకున్నారు. అనంతు గడియలు లెక్క పెడుతున్నాడు.విమలాబాయి అనంతు నుదిటిపై విభూతి తిలకం పెట్టింది.కొంత విభూతి అతని నోటిలో వేసింది. ఆ రాత్రి అనంతుకు స్పృహ వచ్చింది. క్రమంగా అతని జ్వరం తగ్గిపోయింది. మరుసటి రోజు పరీక్షించిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అనంతు ఈ విధంగా గోదావరిమాతాజీ అనుగ్రహం వలన మృత్యుముఖం నుండి బయటపడ్డాడు. శ్రీ గోదావరి మాతాజీ శక్తికి కరుణకూ ఇదొక చిన్న ఉదాహరణ.

శ్రీ వెంకటరెడ్డి అనే సజ్జనుడు శ్రీ గోదావరిమాతాజీ దర్శనార్థమై సాకోరికి వచ్చి నాడు. అతడు తెలుగుదేశం వాడు. కాని ఉద్యోగరీత్యా మరాఠ్వడకు పరమ భోగిలో నివసిస్తున్నాడు. అతడు పోలీసుశాఖలో ఠాణేదాడు. ఒక నెల సెలవు పెట్టి వచ్చడు. ఆరోజుల్లో వున్న పరిస్థితు ప్రకారం ఎంతో కష్టంమీద ఆయనకు సెలవు దొరికింది. నెల తరువాత తిరిగిపోవటానికై ఆచారం ప్రకారం, రెడ్డి శ్రీగోదావరి మాతాజీ అనుజ్ఞ వేడుకున్నారు. కాని గోదావరిమాతాజీ ఆయనతో "మరి కొన్నాళ్ళు ఇక్కడే ఉండ" మని అన్నారు.

శ్రీగోదావరి మాతాజీ రెడ్డిగారి భార్యద్వారా ఆయనకు "నీవు ఇక్కడే ఉండు. నేను అక్కడికి పోయి నీవంతు పని చేస్తాను" అని సందేశం పంపించారు. ఆ మాటలు విన్న రెడ్డిగారి మనస్సు ఉప్పొంగి పోయింది. శ్రీ గోదావరిమాతాజీ యందు ఆయనకున్న అమితమైన భక్తి శ్రద్ధల మూలంగా, పరిణామం ఎట్లుంటుందో అనే ఆలోచన కూడ లేకుండ. ఆయన నిర్విచారంగా మరొక నెలరోజులు శ్రీ గోదావరిమాతాజీ సన్నిధిలో ఉండిపోయాడు. నెల తరువాత శ్రీ గోదావరి మాతాజీ ఆశీస్సులు, ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు పనిలో చేరాడు. చిత్రమేమిటంటే ఆయనను ఎవ్వరూ ఒక్క మాటైనా అనలేదు సరికదా ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్లవు నావనికూడ ఆడుగలేదు. ఆయన పెట్టుకున్న సెలవుచీటి, చట్టం ప్రకారం ఒప్పుకోకున్నా కాషియర్ రెండు నెలల జీతం ఇచ్చడు. రెడ్డిగారు కాషియర్ ను జీతం ఎలా ఇచ్చినావని అడిగితే, "మీ రెండు నెలల జీతం ఒప్పుకున్నట్లు కాగిత పత్రం వచ్చింది. మీ సెలవు చీటి మాత్రం తరువాత ఆమోదిస్తారట" అన్నాడు. సెలవు దొరుకుతుందనే నమ్మకంలేని గడ్డు రోజులలో రెండు నెలల సెలవు లభించటం, సెలవు ఆమోదించకుండానే రెండు నెలల జీతం ఇవ్వటం శ్రీ గోదావరిమాతాజీ కృపాకటాక్షం కాక మరేమిటి?

1946వ సం"లో ఒకానొక పరిస్థితులలో వెంకటరెడ్డిగారికి ఉద్యోగం ఇష్టం లేక పోయింది. ఆయన శాశ్వతంగా సాకోరిలో ఉండి పోదామని నిశ్చయించు కున్నాడు. ముందుగా రెండేండ్లు సెలవు పెట్టి, అటు తరువాత ఉద్యోగానికి రాజీ నామా చేసారు. ఆయన 11 సంవత్సరాలు మాత్రమే ఉద్యోగం చేసినా జీవి తాంతం పెన్షన్ లభించింది. సాకోరి ఆశ్రమంలో గోదావరిమాతాజీ చరణ సన్నిధిలో పుణ్యకర్మలు చేస్తూ వెంకటరెడ్డిగారు తమ శేషజీవితం గడిపారు. ఇదంతా 'అమ్మ' చలువయే కదా!

మూడవ అధ్యాయం సంపూర్ణం.