సర్వం శ్రీసాయి
శ్రీ గోదావరి మాత చరిత్ర
పదహరవ అధ్యాయం

1976 సంవత్సరంలో శ్రీ గోదావరి మాతాజీ సటానాలోను శేగాంవ్ లోను యజ్ఞాలు చేయటమేగాక తాము చాలాకాలంగా కాంక్షిస్తుండిన పూరీజగన్నాథ క్షేత్రయాత్ర కూడ చేసారు.

సటానా నాసిక్ జిల్లాలో చిన్న గ్రామం. శ్రీ ఉపాసనీ మహారాజులు ఇక్కడే జన్మించినారు. వారు పుట్టినచోట శ్రీ కోటిలింగేశ్వర, శ్రీ మారుతి మందిరాలు నిర్మించారు. సమీపంలో ఉన్న ఆరామనదీ తటాన బాబావారి పితామహుల సమాధిస్థలంపై దత్తాత్రేయ మందిరం నిర్మించినారు. శ్రీ గోదావరి మాతాజీ కన్యకల సమేతంగా సటానాలో ఆగస్టు 1-5 తేదీల మధ్యన రుద్రయాగం చేసారు.

బుల్డానా జిల్లాలో శేగాంవ్ ఒక చిన్న గ్రామం. జగద్విఖ్యాత సిద్ధపురుషులు

శ్రీ గజానన మహారాజాగారి నివాసంచేత ఆ గ్రామానికి గొప్ప ఖ్యాతి వచ్చింది.

వారు 1905 సంవత్సరం సమాధి చెందినారు. ఇప్పటికీ వారి దేవస్థానానికి లక్షల సంఖ్యలో భక్తులు యాత్ర చేస్తుంటారు. మన గోదావరిమాత పుట్టినది కూడ ఈ పవిత్ర క్షేత్రంలోనే. దేవీ నవరాత్రుల సందర్భంగా శ్రీ గోదావరి మాతాజీ కన్యకల సమేతంగా శ్రీ గజానన మహారాజుల దేవస్థానంవారి కోరిక మేరకు దండియజ్ఞం చేసినారు. యజ్ఞం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు ప్రారంభమై నవమినాడు ముగిసింది.

శ్రీ గోదావరి మాతాజీ జగన్నాథపూరీ క్షేత్రం నవంబరులో దర్శించినారు. ఈ యాత్రలో వారివెంట సాకోరి ఆశ్రమం కన్యకలతోపాటు చాలామంది భక్తులు ఉన్నారు. శ్రీమతి లీలాతాయి గద్దె, శ్రీమతి చంపాబెన్ నవలాఖీ, శ్రీమతి సహస్రబుద్దే, రూసీగాంధీ మొదలైనవారంతా తోడుగా వెళ్ళరు. బరోడా వాస్తవ్యులు శ్రీ బగుభాయి పటేలు ఈ యాత్రను ఏర్పాటు చేసినారు. ఇందు కోసం ఒక ప్రత్యేకమైన లక్షురీ బస్సును, సమస్త సౌకర్యాలను వారే సమకూర్చినారు. అందరు కలిసి నవంబరు 11 నాడు నాగపురంనుండి బయలుదేరి. నవంబరు 27 నాడు తిరిగి వచ్చినారు. ఈ తీర్థయాత్రలో శ్రీ వల్లభాచార్యులకు సంబంధించిన పుణ్యభూమి చంపారణ్యం కూడ దర్శించి కలకత్తాకు వెళ్ళినారు.
" అక్కడ కాళీమాత మందిరం గంగాతటమున ఉన్న బేలూరు మఠం, శ్రీరామకృష్ణ పరమహంస శ్రీ శారదామాతల సమాధులు, శ్రీ వివేకానందుల స్మారక మందిరం చూచి చండీఖోల్ చండిని దర్శించినారు. చండీఖోల్ గొప్ప శ పీఠం. అక్కడ విశ్వనాథానందులు అనే మహాతపస్వి ఉంటున్నారు. చిట్ట చివరన పవిత్ర జగన్నాథ క్షేత్రం దానిచుట్టు ప్రక్కల ఉన్న పుణ్యస్థలాలు కూడ దర్శించారు.

ఈ యాత్రలో ఖర్గపురం పర్యటనం ముఖ్యమైనది. ఇది వంగదేశంలో ఉంటుంది. డెబ్భైయేండ్లకు పూర్వం శ్రీ ఉపాసనీ మహారాజులు ఇక్కడ 10 మాసాలుండిరి. అక్కడ శ్రీ ఉపాసనీ మహారాజు పాఠాంకములచేత పవిత్రమైన స్థలాలన్నీ శ్రీ గోదావరి మాతాజీ దర్శించినారు. ఉపాసని బాబావారిని సేవించిన కొందరు వృద్ధ భక్తులను కూడ కలుసుకున్నారు. శ్రీ శిరిడి సాయిబాబా అనుగ్రహంతో సిద్ధ పురుషులైన తరువాత శ్రీ ఉపాసనీబాబా ఏకాంతవాసం కోరి శిరిడినుండి ఇంత దూరం వచ్చి ఖర్గపురంలో నివసించినారు. ఇక్కడే వారి తొలిలీలలు విభూతులు లోకానికి ప్రకటితమైనవి.ఉపాసని బాబా గొప్ప సిద్ధపురుషులని మహా తపశ్శక్తి సంపన్నులని తెలిసిపోవటంతో అసంఖ్యాక జనం వారిని దర్శించటానికి ఇక్కడికి వచ్చేవారు శ్రీ గోదావరి మాతాజీ ఖర్గపురంలో మూడునాల్గు దినాలున్నారు. శ్రీ ఉపాసనీ బాబావారు నివసించిన భంగీవాడ, హరిజనుడైన భాగు కుటీరం, కేర్ కుటీరం ఉపాసని బాబా నిత్యం కూర్చుండే చోటు మొదలైన ప్రదేశాలన్నీ చూచినారు. ఇవి ఉపాసనీ భక్తులందరికి యాత్రాస్థలాలు. ముఖ్యంగా ఉపాసనిబాబా నివసించిన పాకివాడ దర్శించినప్పటి అనుభవం చాలా గొప్పది. శ్రీ గోదావరి మాతాజీని స్వాగతించటానికి, సన్మానించటానికి అక్కడి భక్తులు ఒక స్వాగత సమితి ఏర్పాటు చేసినారు. ఖర్గపురం నుండి బయలుదేరే ముందు అక్కడి పౌరులు శ్రీ గోదావరి మాతాజీకి సన్మానపత్రం సమర్పించినారు అది ఈ విధంగా ఉంది.

దేవీ మా ఖర్గపుర నివాసులమైన సాధకులము, భక్తులము, మీ అభిమానులము, ఐన మేము చారిత్రికమైన మీ అగమనాన్ని అత్యంతానందోత్సాహాలతో సగర్వంగా సగౌరవంగా స్వాగతిస్తున్నాము. కరుణాంతఃకరుణుడైన భగవంతుడు మాకు దివ్యోపదేశం చేయటానికి పంపిన దూతలు మీరు. మా చీకటి జీవితాలలోనికి దివ్య ప్రేమ ప్రకాశపు వెల్లువలు పారింపవచ్చిన మీకు న స్వాగతం. అజ్ఞానపు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న మానవాళి బ్రతుకుబాటల్లో సుజ్ఞాన దీపాలు మీరు వెలిగిస్తున్నారు. డోలాందోళితమౌతున్న ఈ లోకాన్ని చక్కదిద్దే ఆశాపూర్వక సందేశం అందించటానికే మీరు అవతరించిన వారు. ఈనాటి పెక్కు కఠిన సమస్యల పరిష్కారానికే సదా పవిత్రమూ స్వయం సంపూర్ణపరిణామమూ ఐన ఆదిశక్తియే మీ దివ్యాత్మ రూపంలో అవతరించినది.

అర్ధశతాబ్దికి పూర్వం శ్రీ ఉపాసనీ మహారాజులు వచ్చి పునీతం చేసిన ఈ స్థలానికి మీరు విచ్చేయటం మూలంగా ఆధ్యాత్మిక అవగాహనలో ఒక నూతన శకావిర్భావం జరుగుతుందని మా దృఢవిశ్వాసం. మీ ఆశీస్సులు న ఆధ్యాత్మిక పరిణామచైతన్యస్రవంతిలో శాంతిసంతోషములు సౌందర్యానందములు ప్రసాదించుగాక.

ఖర్గపురం
15.11.1976

భక్తి గౌరవాలతో స్వాగత సమితి సభ్యులు.

ఆ సంవత్సరపు నా అనుభవం ఒకటి మనవిచేస్తాను. శ్రీ గోదావరిమాతాజీ జీవిత చరిత్ర రచన ముగించినాను. కనుక దాని ప్రెస్ కాపీ సిద్ధం చేయాలె అను కున్నాను. అందుకోసం పూనాలో మా బంధువుల ఇంట్లో ఉండి ఈపని ముగించుదా మనుకున్నాను. దురదృష్టవశాత్తు నాకు కావలసిన విరామం చిక్క లేదు. అందువలన ముంబయిలో ఉండే మా సోదరి యింటికి పోదామనుకున్నాను. మా చెల్లెలు శ్రీమతి ఉషా ఓఝా ఇంట్లో ఉన్నాను. ఉదయం భోజనానంతరం స్టేషనుకు బయలుదేరినాను. బాగా ఎండగా ఉండటంచేత రిక్షా కట్టించుకున్నాను. ఒక చిన్న సంచి, పెట్టె తప్ప నావద్ద ఎక్కువ సామానులు కూడ లేవు. రైల్వే స్టేషనుకు చేరుకోవటానికి బస్సు పట్టుకోవాలి కనుక దగ్గరున్న బస్సు స్టాండుకు వెళ్ళినాను. ఆ తొందరలో నా పెట్టె రిక్షాలో మరచి పోయాను. శ్రీ మాతాజీ జీవితచరిత్ర వ్రాతప్రతి ఆ పెట్టెలోనే ఉన్నది. అది పోతే ఎట్లా అనే భయంక రాందోళనకు గురి ఐనాను. ఆ రిక్షాకోసం వెదకినాను, కాని లాభం లేకపోయింది. నిరాశనంగా ఇంటికి తిరిగి వచ్చినాను. నేను తిరిగి వచ్చినందుకు మా చెల్లెలు ఆశ్చర్యపడినది. జరిగిన కథంతా ఆమెకు చెప్పి వెంటనే 'సకాల్' దిన పత్రిక కార్యాలయానికి వెళ్ళి టెలిఫోను నెంబరు యుక్తంగా ఒక ప్రకటన ఇచ్చి నాను. శ్రీ గోదావరిమాతాజీ యందు నాకు సంపూర్ణ విశ్వాసం. నా వ్రాతప్రతిని ఆమెయేరక్షిస్తుందని నా నమ్మకం. ఐనా ఎన్నో నెలలు పరిశ్రమించి రచించిన గ్రంథం పోయింది కనుక నా మనస్సుకు శాంతి లేదు. ఎల్లప్పుడు అదే చింతగా ఉండేది.

మూడు దినాలు గడిచినా వ్రాతప్రతి జాడ లభించలేదు.అది దొరుకు తుందనే ఆశ పూర్తిగా పోయింది. అది ప్రొద్దటి సమయం. మా చెల్లెలు నాకు భోజనం వడ్డిస్తున్నది. నాకు తిండిగూడ సహించటంలేదు. ఇంతలో టెలిఫోన్ మ్రోగసాగింది. మా కెల్లెలు రిసీవరు ఎత్తింది; మాట్లాడుతున్నది. పెట్టె లభించిన రిక్షావాలా గొంతని గుర్తించిన నన్ను సంభ్రమాశ్చర్యములు ముంచెత్తినవి నా సంతోషానికి అవధులు లేవు. రిక్షావాలా చిరునామా తెలియగనే వెంటనే ఆ చోటుకు పరుగు పరుగున వెళ్ళినాను. అతని ఇల్లు శుక్రవార పేటలో, అక్కడికి చేరుకోవటానికి అరగంట పట్టింది. అతని యింట్లో గోడకు వ్రేలాడుతున్న పెట్టెను చూడగానే నా కన్నీళ్ళు కట్టలు తెగి ప్రవహించినవి. కృతజ్ఞతతో అతనికి కొంత డబ్బు ఇవ్వబోతే అతడు తీసుకోలేదు సరికదా ఎండలో పడివచ్చి, నందుకు నాకే అతడు శీతలపానీయం ఇచ్చినాడు. వ్రాతప్రతి, డబ్బు అపెట్టెలో గంగా ఉన్నవి.రిక్షవాలాకు కృతజ్ఞతలు చెప్పినాను. నా అమూల్య నిధియైన తప్రతిని రక్షించిన శ్రీ గోదావరి మాతాజీకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను.జగద్రక్షకురాలు క్షేమంకరి ఐన శ్రీ గోదావరిమాతాజీకి జేజేలు, పాఠక మహాశయాః ఈ చరిత్ర పఠనం మీకు సంతోషదాయకం ఐర ట్లైతే మీరు కూడా దేవతాస్వరూ యైన శ్రీ గోదావరి మాతాజీకి కృతజ్ఞతలు ఆర్పించాలి. ఎందుకంటే ఆయమ్మ దివ్య శక్తియే దీనిని కాపాడింది. నేను ఆమె చేతిలో ఒక సాధారణ ఉపకరణం మాత్రమే.

పదహరవ అధ్యాయం సంపూర్ణం.

© Copyright Sarvam Sree Sai Seva Trust