శ్రీ సాయినాథా మహీమా స్తోత్రం

షిర్డి సాయి హారతులలో మధ్యాన్న ,సాయంకాల హరతులలో పాడుకొనే ఈ మహిమా స్తోత్రం ఏంతో విశిష్టమైనది .
ఈ మహిమా స్తోత్రాన్నీ బాబా అంకిత భక్తుడైన శ్రీ ఉపాసనీ మహరాజ్ వారిచే షిర్డీ పవిత్ర భూమిలో 1911 సం .లో రచించాడు .
ఈ సంస్కృత శ్లోకాలు బాబా ఆదేశించిన అధ్యాత్మిక శిక్షణలో వుండగా రచించినవి .
1912 సం .లో శ్రావణ పౌర్ణమి నాడు , షిరిడీలో గురుస్థాన్ నందు , బాబా షిరిడీకి ప్రప్రధముగా వచ్చినపుడు ఆయన వేపచెట్టు క్రింద తపస్సు చేసిన గుర్తుగా
వేపచెట్టు క్రింద పాలరాయితో చేసిన పాదుకలు ప్రతిష్టింప బడినవి .
ఆ ప్రతిష్టా కార్యక్రమములో పాలరాయి పాదుకలు ప్రతిష్టించిన ఒక చిన్న నిలువుపాటి స్తంభముపై ఈ మహిమా స్తోత్రములోని నాలుగవది , అయిదవది శ్లోకాలు చెక్కబడినవి. ఈ మహిమా స్తొత్రంలో పదిహేను సంస్కృత శ్లోకాలు గలవు.
ఈ మహిమా స్తోత్రాన్ని సాయిభక్తులందరూ నిత్యమూ పారాయణ చేయుట ఎంతో శ్రేయస్కరం .ఈ శ్లోకాలన్నిటిలోనూ " నమామీశ్వరం సద్గురు సాయినాథం "అన్న శ్లోకం ఒక మకుటం లాంటిది .ఈ మకుటంలో సాయినాధుని ఈశ్వర తత్వం ,సద్గురు తత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది . ఈశ్వర తత్వం అనగా సర్వ శక్తిమత్వం ,సర్వ వ్యాపకతత్వం ,సర్వఙ్ఞత మరియు ఈ సృష్టి యందు ,తనకుగల సంపూర్ణ సర్వసౌభమత్వం
విశదమవుతుంది .నిరంతరం అత్మధ్యాన స్థితి ,తనను సమర్థ సద్గురువుగా భావించి ,
ఆశ్రయించినవారికి గురు తత్వం బోధించి , తనంతవారిగా చేయుటయే గురువుగా తన ఆశయము .పర బ్రహ్మ స్థితితో ,ఒక గురు స్వరూపంగా ,ఈ రెండు తత్వాలు బాబాలో ఒకేసారి కనిపిస్తాయి .బాబాలో గల ఈ అపూర్వ తత్వాలను ఉపసాని బాబా మహరాజ్ రచించిన ఈ మహిమస్తోత్రం లో కనిపిస్తాయి .
నమామీశ్వరం సద్గురు సాయినాథం .

శ్రీ సాయినాథ మహిమా స్తోత్రము
సంకలనం:
శ్రీ ఉపాసనీబాబా మహారాజ్

సదా సత్స్వరూపం చిదానందకందం
జగత్సంభవస్థాన సంహారహేతుమ్
స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ 1

భవధ్వాంత విధ్వంస మార్తాండమీడ్యం
మనోవాగతీతం మునీర్ ధ్యానగమ్యమ్
జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ 2

భవాంభోది మగ్నార్దితానాం జనానాం
స్వపాదాశ్రితానాం స్వభక్తి ప్రియాణామ్
సముద్దారణార్థం కలౌ సంభవంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ 3

సదా నింబవృక్షస్య మూలాదివాసాత్
సుధా స్రావిణం తిక్తమప్యప్రియం తమ్
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ 4

సదా కల్పవృక్షస్య తస్యాధిమూలే
భవద్భావబుద్ధ్యా సపర్యాదిసేవామ్
నృణాం కుర్వతాం భక్తి ముక్తి ప్రదంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ 5

అనేకాశృతాతర్క్యలీలా విలాసైః
సమావిష్క్రతేశానభాస్వత్ప్రభావమ్
అహంభావహీనం ప్రసనాత్మభావమ్
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ 6

సతాం విశ్రమారామమేవాభిరామం
సదా సజ్జనైః సంస్తుతం సన్నమద్భిః
జనామోదదం భక్తభద్రప్రదం తం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ 7

అజన్మాధ్యమేకం పరం బ్రహ్మ సాక్షాత్
స్వయం సంభవం రామేవావతీర్ణమ్
భగవద్దర్శనాత్సంపునీతః ప్రభోహం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ 8