శ్రీ సంకష్టహరచవితి వ్రత విధానం

సర్వం శ్రీసాయి

???శ్రీ సంకష్టహరచవితి వ్రత విధానం ??? click here for pdf

???సంకష్టహర చతుర్థి, దీన్నే సంకట చతుర్థి, సంకట చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకటవ్రతం అంటారు???

???ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా తెలుసుకోవాలి. సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు???

???ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని, మనసులో వున్న కోరికను మనసారా స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు (గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి ( మీకు తోచిన దక్షిణ ), తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి???

???ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనేట ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరికంగానూ, మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు???

???సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. "సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్ధంగాని, ఉప్పు తగిలిన (కలిసిన) / వేయబడిన పదార్ధాలు తినకూడదు". పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం (3,5,11 లేదా 21 'చవితి 'లు) పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి. ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి???

???ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం నాలుగుసార్లు పఠించి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది.

ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం. ఈ పోస్ట్ చివర్లో సంకటనాశన గణేశ స్తోత్రం ఉంది అది చాలా మహిమాన్వితమైన స్తోత్రం. ఇక్కడ ఉన్నది సంపూర్ణ సంకష్టహర చతుర్థి వ్రత విధానం,అందరూ సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తూ ???

 

???అసలు సంకటహర గణపతి విశిష్టత ఏమిటి ????

 

???గణేశ పురాణం ప్రకారం వినాయకుని ఉపాసన ప్రాథమికంగా రెండు విధాలు. అవి 1. వరద గణపతి పూజ 2. సంకష్టహర గణపతి పూజ. వీటిలో వరద గణపతి పూజ చాలావరకు అందరికీ తెలిసినదే, అది మనమందరమూ ప్రతీ సంవత్సరమూ చేసుకునే 'వినాయక చవితి'. అన్ని రకాల వరాలనూ మనకనుగ్రహించే ఈ వరద గణపతినే సిద్ధి గణపతి, వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు???

 ???సంకష్టహర గణపతి పూజ చాలా విశిష్టమైనది. సంకటహర గణపతి సకల భయ నివారకుడు. కుజుడిచేత పూజింపబడిన కుజదోష నివారకుడిగా, యముడిచేత పూజింపబడిన పాప నాశకుడిగా గణేశ పురాణం ఈతడిని కీర్తిస్తుంది. వరద గణపతి పూజకి శుక్ల చతుర్థి ముఖ్యమైనట్లుగా సంకష్టహర గణపతి పూజకి కృష్ణ చతుర్థి (బహుళ చవితి) ముఖ్యం. వాటిలొనూ మంగళ వారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. అవి సంవత్సరానికి రెండు మూడు సార్లు వస్తూ ఉంటాయి. అయితే మాఘమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి మరింత అరుదు???

 

???సంక్షిప్త వ్రత విధానం???

 

  1. సూర్యోదయమవకముందే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమూ, నిత్య పూజ పూర్తి చేసుకోవాలి.
  2. తరువాత గణేశుని తలచుకొని ఆరోజు సంకష్టహర గణపతి వ్రతం ఆచరించడానికి సంకల్పించుకోవాలి.
  3. పగలంతా ఉపవాసంగాని, అల్పాహారంతోగాని ఉండాలి. నిష్ఠతో గడపాలి.
  4. సాయంత్రమవగానే తెల్ల నువ్వులూ, ఉసిరి కలిపి నూరిన చూర్ణంతో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి.
  5. మట్టితో గణేశుని ప్రతిమచేసిగానీ, పసుపుతో మూర్తిని చేసిగానీ గణేశుని అందులోనికి రమ్మని ప్రార్థించాలి.
  6. ధూప, దీపములూ, పుష్పాలంకరణ చేసి, తప్పనిసరిగా గరిక చిగుళ్ళతో పూజించాలి.
  7. మూడు ఐదు లేదా ఏడు ఆకులు గల గరికలను, యిరవయ్యొకటి లేదా అంతకంటే ఎక్కువగానీ కనీసం ఒక్కటైనాగానీ సమర్పించాలి.
  8. నలభై ఎనిమిది నిముషాలపాటు ఏదైనా గణేశ మంత్ర జపం చేయాలి.
  9. గణేశునికి నైవేద్యం సమర్పించి, హారతినివ్వాలి.
  10. చంద్రోదయ సమయానికల్లా ఈ పూజ అంతటినీ ముగించాలి.
  11. తప్పనిసరిగా చంద్రుని చూచి, చంద్రునికీ చతుర్థీ తిథికి నమస్కరించి అర్ఘ్యమివ్వాలి.
  12. తరువాత పూజామందిరంలోకి వెళ్ళి గణేశుని, "సంకటాం మాం నివారయ" (నా సంకటములను తొలగించు) అని వేడుకుని, నమస్కరించి అర్ఘ్యమివ్వాలి.
  13. భోజన సమారాధన జరిపి, తరువాత తానూ భుజించాలి.
  14. రాత్రంతా గణేశుని స్మరిస్తూ, కీర్తిస్తూ జాగారం చేయాలి.
  15. తరువాత రోజు ఉదయం గణేశునికి సాధారణ పూజ చేసి, మళ్ళీ పూజించే అవకాశం అనుగ్రహించమంటూ స్వస్థానానికి తిరిగి వెళ్ళమని ప్రార్థించాలి.
  16. తరువాత గణేశ నిమజ్జన కార్యక్రమం చేయాలి.

 

???నిజానికి ఎంతో సులువుగా ఉన్నప్పటికీ, కొందరికి పూజలు అంతగా అలవాటు లేకపోవడంచేత, ఈ వ్రత విధిలో కొన్ని సందేహాలు రావడం సహజం. నాకు కలిగిన సందేహాల నివృత్తి కోసం గణేశ పురాణం శోధించగా???

 

  1. అతి ముఖ్యమైన వ్రత విధి ఏమిటి?

జ. పైన చెప్పిన వాటిలో ఇవి మరొక్కసారి గమనించండి (2,3,7,8,11,12,13).

 

  1. ఏ పూలు వాడాలి?

జ. మందారము వంటి ఎరుపు రంగు పూలు వినాయకునికి అత్యంత యిష్టం.

వినాయక చవితి నాడు తప్ప గణేశ్వరుని పూజలో ఎప్పుడూ తులసి ఆకులు గానీ పూలు గానీ వాడరాదు. కాబట్టి అవి నిషిద్ధం.

 

  1. ఏ మంత్రం జపించాలి?

జ. గురువుచే ఉపదేశింపబడిన గణపతి మంత్రం అత్యుత్తమం. అయినప్పటికీ,

'గజానన' అనే నామ మంత్రంగానీ,

'సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః

లంబోదరశ్చ వికటో విఘ్ననాశో గణాధిపః

ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః

ద్వాదశైతాని నామాని యః పఠేచ్ఛ్రుణుయాదపి

విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా

సంగ్రామే సంకటేచైవ విఘ్నస్తస్య నజాయతే' అనే నామ స్తోత్రంగానీ జపించవచ్చు.

 

  1. నైవేద్యం ఏమి సమర్పించాలి?

కుడుములు, ఉండ్రాళ్ళు, అరటి కాయలు, పాయసము, నువ్వులు

 

  1. ప్రసాదం తెల్లవారిన తరువాత స్వీకరించాలా?

జ. కాదు. చంద్రోదయం తరువాత గణేశునికి నమస్కరించి ప్రసాదం తప్పనిసరిగా భుజించాలి.

 

  1. రోజంతా గణేశ స్మరణలో గడపడానికి తేలికైన దారి ఏదైనా ఉందా?

జ. గణేశ పురాణం చదవడం (వినడం) లేదా గణేశునికై నైవేద్యాలు వండటం (సమర్పించడం). చేతనైతే నృత్య గీతాలూ మంచివే.

 

  1. అర్ఘ్యం యివ్వటం తెలియకపోతే?

జ. నమస్కరించడం ఉత్తమం. తెలియని పూజావిధి తలకెత్తుకోవడం మంచిది కాదు.

 

  1. పూజ చేయడం చేతకాదనుకుంటే?

జ. మంచి బ్రాహ్మణుని పిలిచి అతనితో చేయించుకోవడం సర్వవిధాలా శ్రేయస్కరం. అయితే తప్పనిసరిగా పూజ పూర్తయిన వెంటనే దక్షిణ యివ్వండి. లేదా దగ్గర్లోని గణపతి ఆలయంలో వ్రతంలో పాలుపంచుకోండి.

 

?వ్రతాచరణ వలన లాభాలు ?

 

?గణేశ పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు. వాటిలో పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్యాపాతక నాశనము, వికలాంగ దోష నిర్మూలనము, రాజ్య ప్రాప్తి, కుజ దోష నివారణము, క్షయ వ్యాధి శమనము, బానిసత్వ విముక్తి, క్రోధోపశమనము, అకాల మృత్యు హరణము, కుష్ఠు వ్యాధి నివారణము, జ్ఞాన ప్రాప్తి, మహిమ, నష్ట వస్తు ప్రాప్తి, మనోభీష్ట సిద్ధి, యుద్ధ విజయము, గురు అనుగ్రహము, ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం ఉన్నాయి. అయితే నేటికాలంలో వాటి అన్నింటి అవసరం కూడా చాలామందికి లేదు. అందుకే గణేశ ఉపాసకులు సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా, జాతకదోషాలను పోగొట్టడంలో సాటిలేనిదిగా తెలియజేస్తున్నారు?

 

?అనేక లాభాలు ఉన్న ఈ వ్రతాన్ని, ఒక్కరోజు ఆచరిస్తే చాలు గణేశలోకంలో స్థానాన్ని ప్రసాదించే ఈ వ్రతాన్ని, మళ్ళీ ఏడేళ్ళ తరువాత వచ్చినా అప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయో ఉండవో, ఈసారి తప్పక ఆచరిచి, మన అదృష్టాన్ని సార్థకం చేసుకుందాం. ఆ శక్తి పుత్రుని శక్తి సహితుని అనుగ్రహాన్ని పొందుదాం?

 

?పూర్తి వ్రతం చేయగలిగినా లేకున్నా కనీసం చంద్రోదయ సమయంలో చంద్రునికి, చతుర్థీ తిథికి, గణేశునికి నమస్కరించి భోజనం చేయండి. అత్యంత శ్రేయోదాయకమైన ముహూర్తం. గణేశానుగ్రహం తప్పక కలుగుతుంది?

 

?సంకటహర గణపతి ధ్యానం, ఏకవింశతి నామాలు?

 

?ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభం లంబోదరం విశాలాక్షం జ్వలత్పావకలోచనం ఆఖుపృష్ఠ సమారూఢం చామరైః వీజితం గణైః శేషయజ్ఞోపవీతం చ చింతయేత్తం గజాననం ?

 

?శ్రీ సంకష్టహర గణపతి వ్రతం?

 

శ్లోకం:

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే

 

ఆచమనం:

ఓం కేశవాయ స్వాహాః

నారాయణాయ స్వాహాః

మాధవాయ స్వాహాః

(అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను)

 

గోవిందాయ నమః

విష్ణవే నమః

మధుసూదనాయ నమః

త్రివిక్రమాయ నమః

వామనాయ నమః

శ్రీధరాయ నమః

హృషీకేశాయ నమః

పద్మనాభాయ నమః

దామోదరాయ నమః

సంకర్షణాయ నమః

వాసుదేవాయ నమః

ప్రద్యుమ్నాయ నమః

అనిరుద్దాయ నమః

పురుషోత్తమాయ నమః

అధోక్షజాయ నమః

నారసింహాయ నమః

అచ్యుతాయ నమః

ఉపేంద్రాయ నమః

హరయే నమః

శ్రీ కృష్ణాయ నమః

శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

 

దైవ ప్రార్థన

 

(గణపతికి నమస్కరించి ఈ క్రింది శ్లోకములు చదువ వలెను).

 

  1. యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా తయోస్సంస్మరణాత్పుంసాంసర్వతో జయ మంగళం

 

  1. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ: యేషామిందీవరశ్శ్హ్యామో హృదయస్థోజనార్థన:

 

  1. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామ్యహం

 

  1. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే.

 

తాత్పర్యము: మంగళ కరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థములను సాధించి, శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ! పార్వతీ, ఓ! దుర్గాదేవీ, ఓ! నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను.

 

{ఈ క్రింది మంత్రమును చెపుతూ కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లవలెను.}

 

ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ఓం శచీపురందరాభ్యాం నమః ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః ఓం శ్రీ సితారామాభ్యాం నమః ||నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు||

 

భూతోచ్చాటన: (క్రింది విధముగా చదువుతూ అక్షతలు వెనుక వేసుకొనవలెను.)

 

శ్లో: ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే

 

తా: భూతోచ్చాటన అంటే భూతపిశాచములను పారద్రోలుట. చేయబోవు కార్యమునకు అవరోధము కలిగించు భూతపిశాచములను అచటినుండి వెడలిపొమ్మని భావము.

 

ప్రాణాయామం (మూడు సార్లు లోపలికి గాలి పీల్చి నెమ్మదిగా వదలడం)

 

ఓం భూః | ఓం భువః | ఓగ్ సువః | ఓం మహాః | ఓం జనః | ఓం తపః | ఓగ్ సత్యం |

 

ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ||

 

||ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్||

 

కారణము: (గృహస్థులు ఐదు వ్రేళ్ళతోను ముక్కును పట్టుకుని ఎడమరంధ్రం ద్వారా గాలిని పీల్చి, ఓం భూ: నుండి భూర్భువస్సువరోం వరకు మంత్రము చదివేంతకాలము గాలిని బంధించి తర్వాత మెల్లగా గాలిని కుడి ముక్కు రంధ్రం ద్వారావిడువ వలెను. దీనినే పూరకం, కుంభకం, రేచకం అంటారు. మంత్రం చదివే సమయంలో గాలిని బంధించుటను ప్రాణాయామము అంటారు. బ్రహ్మచారులు బొటన వ్రేలు, చిటికెన వ్రేళ్ళతో దీనిని చేయవలెను.)

 

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః || (అని నాలుగు దిక్కులా ఉద్ధరనితో నీళ్ళు చల్లవలెను. సుద్ధి చేసినట్టుగా)

 

ప్రాణాయామం

 

సంకల్పము: (ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏమి కోరి, ఏ పనిచేస్తున్నారో స్పష్టముగా చెప్పుకొనుటను సంకల్పము అంటారు.) మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, …….. నదీ సమీపే……… ( శ్రీ శైలస్య) నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ…………….నామ సంవత్సరే, …………… (దక్షిణాయనే), …….. ఋతౌ, ……… మాసే, ……… పక్షే,..….. (చతుర్థ్యాం) తిథి ………………. వాసరే, శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం, శుభతిధౌ శ్రీమాన్………… గోత్ర: ……….నామధేయ: ధర్మపత్నీ……………… సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ సంకష్టహర వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ సంకష్టహర వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. (నీరు ముట్టుకొనవలెను)

 

భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే

ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవమ్ ధ్యాయేత్సిద్ధి వినాయకమ్

ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం

 

షోడశోపచారపూజ

 

ధ్యాయేత్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం॥

 

శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి

అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ

 

ఆవాహయామి

మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం॥

 

ఆసనం సమర్పయామి

గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ॥

 

ఆర్ఘ్యం సమర్పయామి

గజవక్త్ర నమస్తే~స్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన॥

 

పాద్యం సమర్పయామి

అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో ॥

 

ఆచమనీయం సమర్పయామి.

దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే ॥

 

మధుపర్కం సమర్పయామి.

స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ॥

 

పంచామృత స్నానం సమర్పయామి.

గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే॥

 

శుద్దోదక స్నానం సమర్పయామి.

రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ ॥

 

వస్త్రయుగ్మం సమర్పయామి.

రాజితం బహ్మసూత్రం చ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక॥

ఉపవీతం సమర్పయామి.

చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం॥

 

గంధాన్ సమర్పయామి.

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్, గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే॥

 

అక్షతాన్ సమర్పయామి.

సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే॥

 

పుష్పాణి పూజయామి.

 

అథాంగ పూజ

(పుష్పములతో పూజించవలెను)

 

గణేశాయ నమః - పాదౌ పూజయామి

ఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామి

శూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామి

విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి

అఖువాహనాయ నమః - ఊరూ పూజయామి

హేరంబాయ నమః - కటిం పూజయామి

లంబోదరాయ నమః - ఉదరం పూజయామి

గణనాథాయ నమః - నాభిం పూజయామి

గణేశాయ నమః - హృదయం పూజయామి

స్థూలకంఠాయ నమః - కంఠం పూజయామి

గజవక్త్రాయ నమః - వక్త్రం పూజయామి

విఘ్నహంత్రే నమః - నేత్రం పూజయామి

శూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామి

ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి

సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి

విఘ్నరాజాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి

 

ఏకవింశతి పత్రపూజ

 

(21 విధముల పత్రములతో పూజింపవలెనుఆ ఆకులు దొరక్కపోతే గరిక సమర్పించవచ్చు)

సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి।

గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి।

ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి।

గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి

హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి।

లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి।

గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం పూజయామి।

గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి,

ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి,

వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి।

భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి,

వటవేనమః - దాడిమీపత్రం పూజయామి,

సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి,

ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి,

హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి

శూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి,

సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి,

ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి,

వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి,

సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి।

కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి।

శ్రీ గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి పూజయామి.

 

శ్రీ వినాయక అష్టోత్తర శత నామ పూజా

ఓం గజాననాయ నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం విఘ్నరాజాయ నమః

ఓం వినాయకాయ నమః

ఓం ద్వైమాతురాయ నమః

ఓం ద్విముఖాయ నమః

ఓం ప్రముఖాయ నమః

ఓం సుముఖాయ నమః

ఓం కృతినే నమః

ఓం సుప్రదీప్తాయ నమః

ఓం సుఖనిధయే నమః

ఓం సురాధ్యక్షాయ నమః

ఓం సురారిఘ్నాయ నమః

ఓం మహాగణపతయే నమః

ఓం మాన్యాయ నమః

ఓం మహాకాలాయ నమః

ఓం మహాబలాయ నమః

ఓం హేరంబాయ నమః

ఓం లంబజఠరాయ నమః

ఓం హయగ్రీవాయ నమః

ఓం ప్రథమాయ నమః

ఓం ప్రాజ్ఞాయ నమః

ఓం ప్రమోదాయ నమః

ఓం మోదకప్రియాయ నమః

ఓం విఘ్నకర్త్రే నమః

ఓం విఘ్నహంత్రే నమః

ఓం విశ్వనేత్రే నమః

ఓం విరాట్పతయే నమః

ఓం శ్రీపతయే నమః

ఓం వాక్పతయే నమః

ఓం శృంగారిణే నమః

ఓం ఆశ్రితవత్సలాయ నమః

ఓం శివప్రియాయ నమః

ఓం శీఘ్రకారిణే నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం బల్వాన్వితాయ నమః

ఓం బలోద్దతాయ నమః

ఓం భక్తనిధయే నమః

ఓం భావగమ్యాయ నమః

ఓం భావాత్మజాయ నమః

ఓం అగ్రగామినే నమః

ఓం మంత్రకృతే నమః

ఓం చామీకర ప్రభాయ నమః

ఓం సర్వాయ నమః

ఓం సర్వోపాస్యాయ నమః

ఓం సర్వకర్త్రే నమః

ఓం సర్వ నేత్రే నమః

ఓం నర్వసిద్దిప్రదాయ నమః

ఓం పంచహస్తాయ నమః

ఓం పార్వతీనందనాయ నమః

ఓం ప్రభవే నమః

ఓం కుమార గురవే నమః

ఓం కుంజరాసురభంజనాయ నమః

ఓం కాంతిమతే నమః

ఓం ధృతిమతే నమః

ఓం కామినే నమః

ఓం కపిత్థఫలప్రియాయ నమః

ఓం బ్రహ్మచారిణే నమః

ఓం బ్రహ్మరూపిణే నమః

ఓం మహోదరాయ నమః

ఓం మదోత్కటాయ నమః

ఓం మహావీరాయ నమః

ఓం మంత్రిణే నమః

ఓం మంగళసుస్వరాయ నమః

ఓం ప్రమదాయ నమః

ఓం జ్యాయసే నమః

ఓం యక్షికిన్నరసేవితాయ నమః

ఓం గంగాసుతాయ నమః

ఓం గణాధీశాయ నమః

ఓం గంభీరనినదాయ నమః

ఓం వటవే నమః

ఓం జ్యోతిషే నమః

ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః

ఓం అభీష్టవరదాయ నమః

ఓం మంగళప్రదాయ నమః

ఓం అవ్యక్త రూపాయ నమః

ఓం పురాణపురుషాయ నమః

ఓం పూష్ణే నమః

ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః ?

ఓం అగ్రగణ్యాయ నమః

ఓం అగ్రపూజ్యాయ నమః

ఓం అపాకృతపరాక్రమాయ నమః

ఓం సత్యధర్మిణే నమః

ఓం సఖ్యై నమః

ఓం సారాయ నమః

ఓం సరసాంబునిధయే నమః

ఓం మహేశాయ నమః

ఓం విశదాంగాయ నమః

ఓం మణికింకిణీ మేఖలాయ నమః

ఓం సమస్తదేవతామూర్తయే నమః

ఓం సహిష్ణవే నమః

ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః

ఓం విష్ణువే నమః

ఓం విష్ణుప్రియాయ నమః

ఓం భక్తజీవితాయ నమః

ఓం ఐశ్వర్యకారణాయ నమః

ఓం సతతోత్థితాయ నమః

ఓం విష్వగ్దృశేనమః

ఓం విశ్వరక్షావిధానకృతే నమః

ఓం కళ్యాణగురవే నమః

ఓం ఉన్మత్తవేషాయ నమః

ఓం పరజయినే నమః

ఓం సమస్త జగదాధారాయ నమః

ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః

అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్

అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే

 

దశాంగం గుగ్గలోపేతం సుగంధం, సుమనోహరం, ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ॥

ధూపమాఘ్రాపయామి॥

 

సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే

దీపందర్శయామి।

 

సుగంధాసుకృతాంశ్చైవమోదకాన్ ఘృతపాచితాన్, నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్,

భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ, ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక,

నైవేద్యం సమర్పయామి।

 

సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ, భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక

సువర్ణపుష్పం సమర్పయామి.

 

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం

తాంబూలం సమర్పయామి।

 

ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ

నీరాజనం సమర్పయామి।

 

అథ దూర్వాయుగ్మ పూజా ( గరిక పూజ )

గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

 

ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

 

అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

 

వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

 

ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

 

సర్వసిద్ది ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

 

ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

 

ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

 

మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

 

కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి।

 

ఏకదంతైకవదన తథామూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి।

నమస్కారము, ప్రార్థన

 

ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన, ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి,

 

అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన,

పునరర్ఘ్యం సమర్పయామి,

 

ఓం బ్రహ్మవినాయకాయ నమః

 

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన,

ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్

వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ

నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.

 

?సంకట హర చతుర్ధి గొప్పదనం తెలియపరుచు కధ?

 

?ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుం డగా ఘర్‌సేన్‌ అనే రాజు రాజ్యం దాటే సమయంలో, అనేక పాప ములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తలకించ సాగాడు?

 

?అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు… ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమా నం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా!

అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని!! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు?

 

?అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్ర్తీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెం టనే ఎంతో పాపాత్మురాలైన స్ర్తీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, ‘నిన్నంతా ఈ స్ర్తీ ఉప వాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయా న నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతు ర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది’ అని చెప్పాడు?

 

?అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్‌ దూతని అపుడు సైనికు లు ఎంతో బ్రతిమాలారు. ఆ స్ర్తీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేష్‌ దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వల న ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు?

 

?ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పా టు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది.

వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేష్‌ లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు?

 

?సంకష్టహర చతుర్ధి ఉపవాసంతో స్వర్గలోక పయనం ?

 

?భాద్రపద శుద్ధ చవితి వినాయకచవితి. నిజానికి వినాయకునికి ప్రతి నెలా చవితి రోజు మహా ఇష్టమైన రోజని చెప్తారు పెద్దలు. అందుకే ప్రతి నెలా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధి నాడు ఉపవాసం ఉంటారు కొందరు. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధిని ''సంకటహర చతుర్థి'' లేదా ''సంకష్టహర చతుర్ధి'' అంటారు. ఈ ''సంకష్టహర చతుర్ధి'' గనుక మంగళవారం నాడు వస్తే ''అంగారకి చతుర్ధి'' అంటారు?

 

?పూర్వం భ్రుశుండి అనే మహర్షి ఉండేవాడు. ఆయన వినాయకుని భక్తుల్లో అగ్రగణ్యుడు. తాము కూడా ఆదర్శంగా మారాలని ఎందరో భ్రుశుండిని చూసేందుకు వెళ్ళేవారు. భ్రుశుండి మహర్షి ప్రతి నెలా పౌర్ణమి తర్వాత వచ్చే ''సంకష్టహర చతుర్థి'' లేదా ''సంకష్ట చతుర్ధి''నాడు వినాయకుని భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండేవాడట. ఇలా ''సంకష్ట చతుర్ధి'' నాడు చేసే పూజ, ఉపవాసాలకు ఎంత ప్రాధాన్యత ఉందో, ఎంత పుణ్యం వస్తుందో తెలిపే కథ చూడండి...

ఒకసారి దేవలోక అధిపతి ఇంద్రుడు, భ్రుశుండిని దర్శించుకుని పుష్పక విమానంలో తిరిగి వెళ్తున్నాడు. ఆ దివ్య విమాన కాంతులు ధగధగాయమానంగా ఉన్నాయి. ఆ ఊళ్ళో అనేక పాపాలు చేసిన ఒక వ్యక్తి ఇంద్ర విమానాన్ని ఆశ్చర్యంగా చూశాడు.

దేవేంద్రుని విమానం కిందికి దిగివచ్చింది. ఆ ధ్వనికి అందరూ విడ్డూరంగా చూశారు. ఇంద్రుడు వెనుతిరిగి వచ్చిన కారణం ఏమిటని అడిగారు.

 

''ఇక్కడ ఎవరో చాలా పాపాలు చేసిన వ్యక్తి దృష్టి దీనిపై పడింది.. అందుకే విమానం కిందికి వచ్చింది'' అన్నాడు?

 

?''మరి, ఇప్పుడు పైకి ఎలా లేస్తుంది.. తిరిగి వెళ్ళడం ఎలా దేవా?''అనడిగారు అంతే ఆశ్చర్యంగా.

''ఇంద్రుడు చిరునవ్వు నవ్వుతూ ''ఈరోజు పంచమి.. నిన్న చతుర్ధి నాడు మీలో ఎవరైనా ఉపవాసం ఉన్నారేమో చూడండి.. ఒకవేళ అలా ఎవరైనా నిన్నటి రోజు ఉపవాసం ఉండి ఉంటే, వారి దివ్య దృష్టి ఈ విమానం మీద ప్రసరిస్తే, ఇది తిరిగి బయల్దేరుతుంది...'' అన్నాడు?

?వాళ్ళు ఊరంతా విచారించారు. కానీ, ఒక్కరు కూడా ముందురోజు ఉపవాసం లేరని తేలింది. దేవేంద్రుడు బాధపడుతూ ఉండగా, వినాయకుని భటులు ఒక చనిపోయిన స్త్రీని తీసికెళ్తూ కనిపించారు?

 

?ఇంద్రుడు చూసి, ''అదేంటి, అన్ని పాపాలు చేసిన స్త్రీని యమదూతలు కాకుండా మీరెందుకు తీసికెళ్తున్నారు" అనడిగాడు???

 

???''నిజమే.. ఆమె ఉత్తమురాలేం కాదు. కానీ నిన్న అనుకోకుండా రోజంతా నిద్ర పోవడంవల్ల ఆమె భుజించలేదు. రోజంతా ఉపవాసం చేసి, ఈరోజు ఉదయం లేచిన తర్వాతే తింది. అలా ఆమెకి తెలీకుండానే నిన్న చతుర్ధినాడు ఉపవాసం ఉంది. అందువల్ల ఆమెని మేం తీసుకువెళ్తున్నాం'' అని చెప్పారు. అంతా విన్న తర్వాత ఇంద్రుడు ''సరే, ఆమె పుణ్యాన్ని కాస్త ఇటు ప్రసరింపచేయండి..'' అన్నాడు.

''క్షమించండి, అలా కుదరదు స్వామీ'' అంటూ వారు వెళ్ళిపోయారు. అయితే, ఆమె మీది నుండి వచ్చిన గాలితో విమానం బయల్దేరింది. చతుర్ధి నాటి ఉపవాసం చేసిన మహిమ అలాంటిది?

 

 

 

?సంకష్టహర చతుర్థి వ్రత కథ ?

 

పుత్ర సంతానం లేని కృతవీర్యుని తపస్సు పితృలోకంలో ఉన్న అతని తండ్రిని కదిలించగా, అతడు బ్రహ్మదేవుని ప్రార్థించి తన పుత్రునికై ఈ వ్రతాన్ని పుస్తకరూపంలో పొందినట్లూ, దానిని స్వప్నంలో దర్శనమిచ్చి కృతవీర్యునికి ప్రసాదించినట్లూ గణేశ పురాణం తెలుపుతుంది. కృతవీర్యుడు దీనిని పాటించి గణేశానుగ్రహంతో కార్తవీర్యార్జునుని వంటి పుత్రుని పొందిన విషయం ఇంద్రుని వల్ల తెలుసుకున్న శూరసేనుడనే మహారాజు తానూ సంకష్టహర గణపతి వ్రతం ఆచరించి, తనతో పాటు తన రాజ్యంలోని ప్రజలనందరినీ వైనాయకలోకానికి తీసుకువెళ్ళగలిగినట్లూ వ్రత కథ.

 

సంకటహర గణపతి స్తోత్రం

 

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం

భక్తావాసం స్మరేన్నిత్యమాయు: కామార్ధ సిద్ధయే

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం

తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం

లంబోదరం పంచమం చ షష్టం వికటమేవచ

సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టకం

నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం

ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్

ద్వాదశైతావి నామాని త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం

నచవిఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో

విద్యార్దీ లభతే విద్యాం ధనార్దీ లభతే ధనం

పుత్రార్దీ లభతే పుత్రాన్ మోక్షార్ధీ లభతే గతిమ్

జపేత్ గణపతిస్తోత్రం చతుర్మాసై: ఫలం లభత్

సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్

తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః

 

ఇక్కడ ఉన్నది సంపూర్ణ సంకష్టహర చతుర్థి వ్రత విధానం, అందరూ సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తూ అందరం భక్తితో " ఓం గం గణపతయే నమః " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ వినాయకుడు....

 

ఓం గం గణపతయే నమః

 

యే మనుష్యః మాం ఆశ్రతః!

తాన్ సర్వేస్యః కర్మ వినాశనః లభై!!