హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నప్పుడు నియమాలు :-
 
 ||శ్రీ హనుమాన్ జయంతి|| పర్వదినం సంద్భంగా , ఉదయం 3:00 గం. నుండి  మీకు నచ్చిన సమయంలో పారాయణము చేయవచ్చు.
||హనుమాన్ చాలీసా||  పారాయణ చేయువారు  వారివారి  సత్సంకల్పం చెప్పుకున్న తరువాత పారాయణ చేయడం ప్రారంభించండి.
హనుమాన్ చాలీసా పారాయణ నియమాలు.
 
1.మీ ఇంట్లో లోనో లేదా మందిరంలో లేదా మీకు అవకాశం ఉన్న ప్రదేశంలో కూర్చొని పారాయణ చెయ్యాలి. 2.ఉదయం 3 గం. నుండి వినాయకున్నీ తలచుకుని ప్రారంభించి  హనుమాన్ చాలీసా పారాయణ ప్రతి మంగళవారం రోజు ఒక్కసారి, శనివారం రోజు ఒక్కసారి చెయ్యాలి.
3.ప్రతిసారి పారాయణకు ఒకసారి ముందు "శ్రీరామ రామ రామేతి" మంత్రాన్ని తప్పక చదువుకివాలి ఇలా చేయడం వలన శ్రీ హనుమంతుడు ప్రసన్నుడై పారాయణ చేయు శక్తి ప్రసాధిస్తారు.
4.పారాయణ పూర్తి అయిన తరువాత అవకాశం ఉంటే మంగళ హారతి ఇవ్వండి.అవకాశం లేని వారి *సర్వం శ్రీహనుమన్ చాలీసా* గ్రూప్ తరపున హారతి ఇస్తారు. మనసులో హారతి ఇస్తున్నట్లుగా భావించాలి.
5. పారాయణ ప్రతిరోజు ఒకే సమయంలో ఒక్కదగ్గర కూర్చొని చేయడానికి వీలైనంత వరకు ప్రయత్నం చేయండి.
6.మీ మీ ప్రదేశాలలోని వారంతా వారి వారి ఇళ్లలో హనుమాన్ చాలీసా పారాయణలో పాల్గొనేలా చూడండి. సామూహికంగా కాకుండా ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. 
*7.స్త్రీలు నెలసరి సమయంలో పారాయణము చేయవద్దు. మీ కుటుంబంలో వారి ఎవరితోనైనా చేయించండి.*
*8.మరణము,పుట్టుక వంటి మైలు ఉన్నవారు కూడా.... ముందుగా గ్రూప్ అడ్మిన్ తో మాట్లాడి వారి సలహా తీసుకొని..... మీకు తెలిసిన వారు లేదు. అడ్మిన్ చెప్పిన విధంగా పారాయణము చేయించండి.*
 ఏమైనా సందేహములు ఉంటే అడ్మిన్స్ లేదా....
ట్రస్ట్ నెంబర్ ని సంప్రదించగలరు.
     ఇట్లు
---////////--
సర్వం శ్రీసాయి సేవా ట్రస్ట్
9493789468
 

 శ్రీ హనుమాన్ చాలీసా

 
వినాయకుని ప్రార్థన
"శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం  ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే"
గురు ప్రార్థన

"గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"
శ్రీరామ మంత్రం

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||
సంకల్పం
మీ సంకల్పం చెప్పుకొని హనుచాలిసా పారాయణం చేయాలి
*హనుమానంజనానూను:*
*వాయుపుత్రోమహాబలః*
*రామేష్ఠ: ఫల్గుణసఖః పింగాక్షో:*
*అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః*
*లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః*
*స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః*
*తస్యమృత్యుభయం నాస్తిసర్వత్ర విజయీభవేత్*

శ్రీహనుమాను గురుదేవు చరణములు

ఇహపర సాధక శరణములు

బుద్ధిహీనతను కలిగిన తనువులు

బుద్బుదములని తెలుపు సత్యములు

*శ్రీహనుమాను గురుదేవు చరణములు*

*ఇహపరసాధక శరణములూ*

జయహనుమంత జ్ఞానగుణవందిత

జయపండిత త్రిలోకపూజితా

రామదూత అతులిత బలధామా

అంజనీ పుత్ర పవనసుతనామా

ఉదయభానునీ మధురఫలమని

భావనలీల అమృతమును గ్రోలిన

కాంచనవర్ణ విరాజిత వేషా

కుండల మండిత కుంచిత కేశా

*శ్రీహనుమాను గురుదేవు చరణములు*

*ఇహపర సాధక శరణములూ*

రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి

రాజ పదవి సుగ్రేవున నిలిపి

జానకీ పతి ముద్రిత తోడ్కొని

జలధిలంఘించి లంకచేరుకొని

సూక్ష్మరూపమున సీతను జూచి

వికట రూపమున లంకనుగాల్చి

భీమరూపమున అసురుల జంపిన

రామ కార్యము సఫలముజేసిన

*శ్రీహనుమాను గురుదేవు చరణములు*

*ఇహపర సాధక శరణములూ*

సీతజాడగని వచ్చిన నినుగని

శ్రీరఘువీరుడు కౌగిట నినుగొని

సహస్ర రీతులా నిను కొనియాడగ

కాగల కార్యము నీపైనిడగా

వానరసేనతో వారిధి దాటి

లంకేశునితో తలపడి పోరి

హోరు హోరున పోరు సాగినా

అసుర సేనల వరుసన గూల్చిన

*శ్రీహనుమాను గురుదేవు చరణములు*

*ఇహపర సాధక శరణములూ*

లక్ష్మణ మూర్చతో రాముడడలగా

సంజీవి తెచ్చిన ప్రాణప్రదాత

రామలక్ష్మణుల అస్త్రధాటికి

అసురవీరులు అస్తమించిరి

తిరుగులేని శ్రీరామభాణమూ

జరిపించెను రావణ సంహారము

ఎదిరిలేని ... లంకాపురమున

ఏలికగా విభీషణుచేసిన

*శ్రీహనుమాను గురుదేవు చరణములు*

*ఇహపర సాధక శరణములూ*

సీతారాములు నగవుల గనిరి

ముల్లోకాల ఆరతులందిరి

అంతులేని ఆనందాశృవులే

అయోధ్యాపురి పొంగి పొరలే

సీతారాముల సుందర మందిరం

శ్రీకాంతుపదం నీహృదయం

రామచరిత కర్ణామృతగానా

రామనామ రసామృత పాన

*శ్రీహనుమాను గురుదేవు చరణములు*

ఇహపర సాధక శరణములూ

దుర్గమమగు ఏకార్యమైనా

సుగమమేయగు నీకృపచాలిన

కలుగు శుభములు నినుశరణన్నా

తొలగు భయములు నీరక్షణయున్నా

రామద్వారపు కాపరివైననీ

కట్టడి మీర బ్రహ్మాదుల తరమా

భూత పిశాచ శాకినీ డాకిని

భయపడి పారు నీనామజపమువిని

*శ్రీహనుమాను గురుదేవు చరణములు*

ఇహపర సాధక శరణములూ

ధ్వజావిరాజా వజ్రశరీర

భుజబలతే జాగదాధరా

ఈశ్వరాంశ సంభూత పవిత్ర

కేసరీపుత్రా పావనగాత్ర

సనకాదులు బ్రహ్మాదిదేవతలు

శారద నారద ఆదిశేషులూ

యమకుబేర దిక్పాలురు కవులూ

పులకితులైరి నీకీర్తిగానముల

*శ్రీహనుమాను గురుదేవు చరణములు*

*ఇహపర సాధక శరణములూ*

సోదర భరత సమానాయని

శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమా

సాధుల పాలిట ఇంద్రుడవన్నా

అసురుల పాలిట కాలుడవన్నా

అష్టసిద్ధి నవనిధులకు దాతగా

జానకీమాత దీవించెనుగా

రామరసామృత పానము చేసిన

మృత్యుంజయుడవై వెలసినా

*శ్రీహనుమాను గురుదేవు చరణములు*

*ఇహపర సాధక శరణములూ*

నీనామభజన శ్రీరామరంజన

జన్మజన్మాంతర దుఖభంజన

యెచ్చటుండినా రఘువరదాసు

చివరకు రాముని చేరుట తెలుసు

ఇతర చింతనలు మనసున మోతలు

స్థిరముగా మారుతి సేవలు సుఖములు

ఎందెందున శ్రీరామకీర్తన

అందందున హనుమాను నర్తన

*శ్రీహనుమాను గురుదేవు చరణములు*

*ఇహపర సాధక శరణములూ*

శ్రద్ధగ దీనిని ఆలకింపుమా

శుభమగు ఫలములు కలుగుసుమా

భక్తి మీరగా గానము సేయగ

ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగా

తులసిదాస హనుమాను చాలీసా

తెలుగున సులువుగా నలుగురు పాడగ

పలికిన సీతారాముని పలుకున

దోషములున్న మన్నింపుమన్నా

*శ్రీహనుమాను గురుదేవు చరణములు*

*ఇహపర సాధక శరణములూ*

మంగళ హారతి గొనుహనుమంతా

సీతారామ లక్ష్మణ సమేతా

నా అంతరాత్మ నేలుమో అనంతా

నీవే అంతా ...

 *శ్రీ హనుమంతా!*

*ఓం శాంతి శాంతి శాంతిః .*

శ్రీ హనుమాన్ జయంతి విశిష్టత