స్వామి సాయినాథాయ
షిర్డి క్షేత్రవాసాయ
మామకాభీష్టదాయ
మహితమంగళం ॥
లోకనాథాయ భక్త
లోక సంరక్షకాయ
నాగలోక స్తుత్యాయా
నవ్య మంగళం॥
భక్త బృంద వందితాయ
బ్రహ్మ స్వరూపాయ
ముక్తి మార్గ భోధితాయ
పూజ్య మంగళం ॥
సత్యతత్వ భోధకాయ
సాధువేషాయతే
నిత్య మంగళ దాయకాయ
నిత్య మంగళం...
నిత్యమంగళం...
నిత్యమంగళం....